Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంతగడ్డపై సన్ రైజర్స్ అదుర్స్.. పోరాడి ఓడిన డిల్లీ డేర్ డెవిల్స్

ఐపీఎల్‌ పదోసీజన్‌లో సొంతగడ్డపై తనకు తిరుగులేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి నిరూపించుకుంది. బుధవారం ఉప్పల్‌ మైదానంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటి లీగ్‌లో నాలుగో విజయాన్ని సొంతం చే

Advertiesment
సొంతగడ్డపై సన్ రైజర్స్ అదుర్స్.. పోరాడి ఓడిన డిల్లీ డేర్ డెవిల్స్
హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (02:27 IST)
ఐపీఎల్‌ పదోసీజన్‌లో సొంతగడ్డపై తనకు తిరుగులేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి నిరూపించుకుంది. బుధవారం ఉప్పల్‌ మైదానంలో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటి లీగ్‌లో నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ డేర్‌డెవిల్స్‌ 5 వికెట్ల నష్టానికి 176 పరుగులకు పరిమితమైంది. దీంతో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్లు విలియమ్సన్‌(89: 51బంతుల్లో 6×4, 5×6), శిఖర్‌ ధావన్‌(70:50బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకాలతో రాణించడంతో నాలుగు వికెట్లకు 191 పరుగులు చేసింది.
 
లక్ష్య ఛేదనలో దిల్లీ ఓపెనర్‌ సంజు శాంసన్‌(42: 33బంతుల్లో 3×4, 2×6) మంచి శుభారంభం అందించాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న హైదరాబాది బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేయడానికి కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బంతి ఇచ్చాడు. 2 కీలక వికెట్లు తీసి కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. సిరాజ్‌ వేసిన తన మొదటి ఓవర్‌లో క్రీజులో ఉన్న ఓపెనర్‌ సామ్‌ బిల్లింగ్స్‌(13) తొలి నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు బాది మంచి వూపు మీదున్నాడు. ఐతే ఐదో బంతిని కూడా బౌండరీ తరలించేందుకు ప్రయత్నించగా దీపక్‌ హుడా చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. 14వ ఓవర్‌ మొదటి బంతికి దూకుడుగా ఆడుతున్న శాంసన్‌ను కూడా సిరాజే పెవిలియన్‌ పంపించాడు. 
 
యువరాజ్‌ సింగ్‌ వేసిన 10వ ఓవర్‌లో దిల్లీ రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కరుణ్‌(33) రనౌట్‌గా వెనుదిరగగా అప్పుడే క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ పంపిన యువీ మ్యాచ్‌ను హైదరాబాద్‌ వైపు తిప్పాడు. అనంతరం వచ్చిన శ్రేయాస్‌ (50నాటౌట్‌:31బంతుల్లో 5×4, 2×6) చివరి వరకు పోరాడినప్పటికీ దిల్లీకి విజయం దక్కలేదు. మాథ్యూస్‌(31) కూడా శ్రేయాస్‌కు సహకారం అందించినప్పటికీ హైదరాబాద్‌ పటిష్ఠ బౌలింగ్‌ ముందు నిలవలేకపోయారు. సిద్ధార్థ్‌ కౌల్‌, యువరాజ్‌ సింగ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.
 
చివర్లో సన్ రైజర్స్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయినా హెన్రిక్స్ రెండు ఫోర్లతో 12 పరుగులు, హుడా సిక్స్ కొట్టడంతో  నిర్ణీత ఓవర్లలో సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓ దశలో 200 చేసేలా కనిపించినా.. ఢిల్లీ బౌలర్ క్రిస్ మోరిస్ వరుస బంతుల్లో ధావన్, యువరాజ్‌లను ఔట్ చేసి సన్ రైజర్స్ ను కట్టడి చేశాడు. ధావన్ ఫామ్‌లోకి రావడంతో పాటు విలియమ్సన్ అందుబాటులోకి రావడం సన్ రైజర్స్ జట్టులో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ స్టంపింగ్ కంటే వేగంగా మాల్యాకు బెయిల్ వచ్చింది.. రైతులనైతే అరెస్ట్ చేస్తారు..