Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీపై బ్రాడ్ హగ్ ఐపీఎల్ కామెంట్స్.. ట్విట్టర్లో సారీ.. రవిచంద్రన్ అశ్విన్ సెటైర్లు

క్షమాపణ కోరూతూ హాడ్జ్‌ పేర్కొన్న లేఖకు భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందించాడు. అంతేకాదు అభిమానులకు ఒక సూచన చేశాడు. ఇక నుంచి మార్చి 30న అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవంగా గుర్

Advertiesment
Ravichandran Ashwin
ఆస్ట్రేలియా-భారత్ క్రికెటర్ల మధ్య టెస్టు క్రికెట్ సిరీస్ ముగిసినా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై కాలుమోపినప్పటి నుంచి.. మైదానంతో పాటు మీడియా పాయింట్ల వద్ద ఆసీస్ సమరానికి సై అంది. స్టేడియంలో స్లెడ్జింగ్.. బయట కామెంట్స్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. ఇక సిరీస్ ముగిసింది కదా అనుకుంటే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా క్రికెటర్లకు సారీ చెప్తూ సంజాయిషీ ఇచ్చుకోవడం మొదలెట్టారు. 
 
టీమిండియా క్రికెటర్లు సైతం వారికి అనుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ కెప్టెన్ స్మిత్ చివరి టెస్టు ముగిశాక స్లెడ్జింగ్ వంటి ఇతరత్రా కారణాలకు నోరు పారేసుకోవడంపై సారీ చెప్పాడు. ఇదే తరహాలో ఆసీస్ మాజీ ప్లేయర్ బ్రాడ్ హగ్ కూడా కోహ్లీ సారీ చెప్తూ ట్వీట్ చేశాడు. 
 
ఈ ఘటనపై భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గురువారం వెటకారంగా ఓ ట్వీట్‌ చేశాడు.. ఈ సంవత్సరం నుంచి మార్చి 30న క్షమాపణ దినోత్సవం జరుపుకోవాలంటూ దీనిలో పేర్కొన్నాడు. ఎందుకిలా అన్నాడంటే.. ఐపీఎల్‌లో ఆడటం కోసమే కోహ్లి ఆసీస్‌తో చివరి టెస్టుకు దూరమైనట్లు  ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాడ్జ్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై హాడ్జ్ కోహ్లీని క్షమాపణ కోరుతూ.. సోషల్‌మీడియాలో పెద్ద లేఖ ఉంచిన సంగతి తెలిసిందే. 
 
హాడ్జ్‌ వ్యాఖ్యలను మొదట భారత ఆటగాళ్లు పట్టించుకోలేదు. క్షమాపణ కోరూతూ హాడ్జ్‌ పేర్కొన్న లేఖకు భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సోషల్‌మీడియా ద్వారా స్పందించాడు. అంతేకాదు అభిమానులకు ఒక సూచన చేశాడు. ఇక నుంచి మార్చి 30న అంతర్జాతీయ క్షమాపణ దినోత్సవంగా గుర్తిద్దాం అంటూ పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌లో ఆడే ఆసీస్ ఆటగాళ్లతో సత్సంబంధాలున్నాయ్: విరాట్ కోహ్లీ