ట్వంటీ-20 మ్యాచ్‌లకు ధోనీ అన్‌ఫిట్ : గంగూలీ కామెంట్స్
భారత డాషింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ధోనీ మైదానంలో పెద్దగా రాణించడం లేదు.
భారత డాషింగ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో ధోనీ మైదానంలో పెద్దగా రాణించడం లేదు. దీనిపై గంగూలీ స్పందిస్తూ ట్వంటీ20ల్లో ధోనీ ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి క్రికెట్‌లో ధోనీని మెరుగైన ఆటగాడిగా తాను భావించడం లేదని చెప్పాడు.
అదేసమయంలో 50 ఓవర్ల పరిమిత వన్డేల్లో ధోనీ అత్యున్నత ఆటగాడు అనడంలో సందేహం లేదని తెలిపాడు. అయితే, గత పదేళ్ల కాలంలో టీ20ల్లో ధోనీ కేవలం ఒకే ఒక అర్థ శతకం సాధించాడని చెప్పాడు. ఇదేమంత చెప్పుకోదగ్గ విషయం కాదని అన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ధోనీ విఫలమయ్యాడని గుర్తు చేశారు. గంగూలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.