నాకు ధోనీకి నో డిష్యూం-డిష్యూం.. ఐపీఎల్-2017లో అదరగొడతాం: స్టీవ్ స్మిత్
ఐపీఎల్ పదో సీజన్ ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రైజింగ్ పూణే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆయన స్థానంలో స్టీవ్ స్మిత్‌న
ఐపీఎల్ పదో సీజన్ ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రైజింగ్ పూణే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆయన స్థానంలో స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఇప్పటికే ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్.. సొంతగడ్డపై ఆడిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీపై నోరు పారేసుకుని సారీ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని.. మా ఇద్దరి మధ్య సమస్యలేవీ లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా పూణే తరపున ఆతడు ఆడుతుండటంతో అతనితో కలుపుగోలుగా వెళ్తానన్నాడు. తద్వారా ఐపీఎల్‌లో ధోనీతో కలిసి అదరగొడతానని చెప్పాడు.
ధోనీ మైదానంలో మెలకువలు నేర్పించడంలో ఎంతగానో సహకరిస్తాడని చెప్పాడు. అతనితో వృత్తిపరంగా సత్సంబంధాలున్నట్లు స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. తమ జట్టులో మేటి ఆటగాళ్లున్నారని తప్పకుండా మెరుగైన ఫలితాలు సాధించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని స్మిత్ తెలిపాడు.