Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మిత్ మా కెప్టెన్ అయినా.. ధోనీనే అత్యుత్తమ సారథి.. దటీజ్ ధోనీ.. బెన్‌స్టోక్స్ ట్వీట్..

మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. నిండు కుండ తొణకదు అన్నట్లు.. ధోనీకి ఎంత కీర్తి వచ్చినా.. ఎంత అవమానం జరిగినా.. కూల్‌గా ఉండిపోతాడు. అదే అతనిలోని ప్లస్ పాయింట్. ధోనీ రికార్డులు చూస్తే ధోన

Advertiesment
IPL 2017
, శుక్రవారం, 19 మే 2017 (12:22 IST)
మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. నిండు కుండ తొణకదు అన్నట్లు.. ధోనీకి ఎంత కీర్తి వచ్చినా.. ఎంత అవమానం జరిగినా.. కూల్‌గా ఉండిపోతాడు. అదే అతనిలోని ప్లస్ పాయింట్. ధోనీ రికార్డులు చూస్తే ధోనీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

క్రికెట్ ఏ ఫార్మాట్ అయినా బాధ్యతగా ఆడే ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించే సాహసం ఈ ఐపీఎల్‌లో పుణె సూపర్‌జెయింట్ చేసింది‌. ఈ సంఘటనకు మరో ఆటగాడైతే దీన్ని అవమానంగా భావించేవాడేమీ.. యాజమాన్యంతో గొడవకు దిగేవాడు. కానీ ధోనీ మాత్రం కెప్టెన్సీ సంగతిని మరిచిపోయి.. జట్టు సభ్యుడిగా రంగంలోకి దిగాడు. 
 
ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని మాజీలు చాలామంది తప్పుబట్టారు. అభిమానులు ఫ్రాంఛైజీ యాజమాన్యంపై సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోశారు. ఈ స్పందన చూసి మరో ఆటగాడైతే ఏదో ఒక సందర్భంలో నోరు జారేవాడేమో. కానీ ధోని మాత్రం నోరెత్తి పుణె యాజమాన్యాన్ని ఒక్కమాట కూడా అనలేదు. ఈ సహనానికే యావత్ క్రీడా ప్రపంచం మొత్తం ధోనీకి ఫిదా అయింది.
 
ఈ నేపథ్యంలో మైదానంలో ధోనీ ఆట తీరుపై పుణె స్టార్ ఆటగాడు, ఈ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న బెన్‌స్టోక్స్ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ ధోనీ రేంజ్ ఏంటో పుణె యాజమాన్యానికి తెలియజేసేలా నిలిచింది. 'ధోని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఎవరైనా వెళ్లొచ్చు. ఏ సలహాలైనా తీసుకోవచ్చు' అన్నాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉండే ధోనీ క్రికెట్‌ పరిజ్ఞానం ప్రత్యేకం. ఫీల్డింగ్‌ కూర్పుపై అతడికి గొప్ప పట్టు ఉంది. స్మిత్‌ మా కెప్టెన్‌ అయినప్పటికీ.. ధోనీనే కెప్టెన్సీ విషయంలో అత్యుత్తముడని కూడా బాగా తెలుసు. అందుకే ఫీల్డింగ్ ఏర్పాట్లపై ధోనీతో మాట్లాడిన తర్వాతే స్మిత్ నిర్ణయాలు తీసుకుంటాడని బెన్‌స్టోక్స్ తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ : మనీష్ పాండేను తొలగించారు.. దినేష్ కార్తీక్‌ను చేర్చారు.. ఎందుకు?