Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చరిత్రలో నిలిచిపోయిన క్యాచ్. ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని కట్టబెట్టిన అంబటి రాయుడు

ముంబై ఇండియన్స్‌కి అద్వితీయ విజయాన్ని, గెలుపు వాకిట ఉన్న పుణె సూపర్ జెయింట్స్‌‌కి అంతిమ క్షణాల్లో పరాజయాన్ని తీసుకువచ్చిన ఆ మేటి క్యాచ్‍‌ను పట్టిన ఖ్యాతి తెలుగువాడైన అంబటి రాయుడుకు దక్కింది.

Advertiesment
చరిత్రలో నిలిచిపోయిన క్యాచ్. ముంబై ఇండియన్స్‌కి విజయాన్ని కట్టబెట్టిన అంబటి రాయుడు
హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (01:41 IST)
ముంబై ఇండియన్స్‌కి అద్వితీయ విజయాన్ని, గెలుపు వాకిట ఉన్న పుణె సూపర్ జెయింట్స్‌‌కి అంతిమ క్షణాల్లో పరాజయాన్ని తీసుకువచ్చిన ఆ మేటి క్యాచ్‍‌ను పట్టిన ఖ్యాతి తెలుగువాడైన అంబటి రాయుడుకు దక్కింది. ఉప్పల్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ టోర్నీలో పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ స్మిత్ అప్పటకే అర్థ సెంచరీ సాధించడమే కాకుండా సిక్స్‌లు, ఫో్ర్లు బాదుతూ ఊపుమీదున్నాడు. ఒక్క ఫోర్‌తో మ్యాచ్ టై కావడం లేదా ఒక్క సిక్స్ కొడితే టైటిల్ తమ పరం కానున్న క్షణంలో మిచెల్ జాన్సన్ అంతకుముందు బంతితో ఊపు మీదున్న మనోజ్ తివారీని ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 
 
చివరి ఓవర్ మూడోబంతికి స్మిత్ క్రీజులో ఉన్నాడు. మిచెల్ జాన్సన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంబ్ వైపు విసిరిన బంతిని స్మిత్ సిక్స్‌గా మలిచే ఉద్దేశంతో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా పైకిలేపాడు అది బౌండరీ వేవు సాగింది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడి ఫీల్డర్‌గా ఉన్న అంబటి రాయుడు రెండు చేతులూ పైకి లేపాడు. క్షణకాలంలో బంతి అతడి చేతుల్లోకి వచ్చి పడింది. క్షణ కాలం కన్ఫ్యూజన్‌కి గురైన రాయుడు సరైన పొజిషన్‌లో చేతులు సాపకపోవడంతో బంతి చేజారిపోయిందనే అనుకున్నారు కానీ చివరిక్షణంలో వేలి కొసలతో బంతిని పట్టుకున్న రాయుడు పరమానందంతా గాల్లోకి ఎగిరాడు. 
 
స్మిత్ బ్యాటింగ్ ప్రావీణ్యంతో చేయి జారిందనుకున్న ఫైనల్ మ్యాచ్‌ని ఈ ఒక్క క్యాచ్ ద్వారా రాయుడు మలుపుతిప్పాడు. ఇంకేముంది రాయుడి ఫీట్‌ను చూసిన ముంబై ఇండియన్ జట్టు మూకుమ్మడిగా రాయుడై వైపు పరుగెత్తింది. మిచెల్ జాన్ససన్, మలింగ, బూమ్రా, కెప్టెన్ రోహిత్ శర్మ అందరూ రాయుడిని కౌగిలించుకున్నారు. తల నిమిరారు. ఫీల్టింగ్‌లో ఒక్క అద్భుతం సాధిస్తే ఒక టోర్నీ ఎలా చేజారిపోతుందో పాఠం నేర్పిన క్యాచ్ అది. 
 
ముంబై జట్టులో, వేలాది అభిమానుల్లో ఆనంద హేల, మైదానంలో ఒకే ఒక్కడి వదనంలో అంతులేని విషాదం. పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ షాక్‌కు గురై అలా చూస్తుండిపోయాడు. గెలుపు ముంగిట ఉన్న జట్టు  విజయాన్ని క్షణ కాలంలో చేజార్చుకున్న విషాద ఘటన అది. ఒక జట్టు నైతిక స్థైర్యం కుప్పగూలిన క్షణమది. తర్వాతి మూడు బంతుల్లో 7 పరుగులు చేయవలసిన పుణె జట్టు ఆ ఒత్తిడిని తట్టుకోలేకే చేజేతులా ఆటను చేజార్చుకుంది. 
 
ఒక క్షణమాత్ర  కాలంలో విజయాన్ని లిఖించిన అద్వితీయ క్యాచ్‌ పట్టిన రాయుడు ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగో విజయాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టి అందించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అద్వితీయంగా నిలిచే సూపర్బ్ క్యాచ్‍‌ను రాయుడు తన పేరుమీద లిఖించుకున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్కంఠకే ఉత్కంఠ నేర్పిన ఫైనల్ ఓవర్: ముంబై ఇండియన్స్ కొత్త చరిత్ర.. విలపించిన స్టీవ్ స్మిత్