Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ ఆప్యాయత మర్చిపోలేను.... జూనియర్ ఎన్‌టిఆర్‌

అమ్మ ఆప్యాయత మర్చిపోలేను.... జూనియర్ ఎన్‌టిఆర్‌
, మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (14:22 IST)
ఎన్‌టిఆర్‌ జూనియర్‌ నటించిన చిత్రం 'టెంపర్‌'. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఎన్‌టిఆర్‌ మీడియా ముందుకే రాలేదు. అయితే శివరాత్రి సందర్భంగా రచయిత వక్కంతం వంశీతో కలిసి ఓ మ్యూజిక్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం...
 
ఈ సినిమాను చూశాక మీ తల్లిదండ్రులు ఎలా ఫీలయ్యారు? 
సినిమా చూసినంతసేపు.. మొదటి భాగంలో అమ్మగారు ఏమీ మాట్లాడలేదు. పెద్దగా స్పందించలేదు. నచ్చలేదేమోనని అనుకున్నాను. నెగెటివ్‌ టచ్‌ వున్న పోలీసు అధికారిగా నటించడం కాస్త కోపంగానూ వున్నారు. కానీ సెకండాఫ్‌లో పాత్ర మారే విధానంతో ఆ పాయింట్‌ అమ్మను ఎంతో ఎట్రాక్ట్‌ చేసింది. ఇదే అభిప్రాయాన్ని మా స్నేహితులు కూడా చెప్పారు. వారి మదర్స్‌ కూడా ఇలాగే స్పందించారట. క్లైమాక్స్‌ చూశాక.. అమ్మ ఆప్యాయత, ఆనందం, కళ్ళు చెమర్చడం చూశాక నాకు నేనే అనుకోకుండా ఏడ్చేశాను. 

 
నాన్నగారు ఏవిధంగా రియాక్ట్‌ అయ్యారు? 
నాన్నగారు ఆప్యాయతతో తెలీని ఆనందం, బాధ కన్పించాయి. కళ్యాణరామ్‌ సినిమా పటాస్‌ ఘన విజయం సాధించడం, తర్వాత నా సినిమా ఘనవిజయం సాధించడం ఒకవైపు చెప్పలేని ఆనందం కల్గిస్తుంటే... ఇంకోవైపు అన్నయ్య జానకిరామ్‌ లేకపోవడం ఈ విజయంలో ఆయన పాలుపంచుకోలేకుండా జరగడం తెలీని ఆనందంతో బాధతో వచ్చిన కన్నీళ్ళు వచ్చాయి. సినిమా చూసి బయటకు వచ్చాక భుజంపై దెబ్బవేశారు. జానకీరామ్‌ లేని విషయంతో చెప్పలేని ఎమోషన్స్‌కు నాకూ వచ్చాయి.
 
శివరాత్రి నాడు ప్రేక్షకులకు ఏం చెబుతారు? 
టెంపర్‌.. కేవలం ఒక సినిమా కాదు. నిజాయితీగా మీ అందరినీ ఆనందపర్చి చేసిన ప్రయత్నంతో మాకు ఇంకో జన్మని ప్రసాదించారు. మీ రుణం తీర్చుకోలేనిది. ఈ సినిమాకు పని చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ధన్యవాదాలు. మంచి చిత్రాలు ఆదరించే మనస్సు ఎల్లవేళలా ఫ్యాన్స్‌కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా దైవం నందమూరి తారక రామారావుగారి ఆశీస్సులు, ఏ లోకంలో వున్నా జానకీరామ్‌ అన్నయ్య ఆశీర్వాదం వుండాలని కోరుకుంటూ.. శివరాత్రికి అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu