Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పటికీ ఆ సీన్లే గుర్తొస్తుంటాయి... 'బాహుబలి'పై తమన్నా ఇంటర్వ్యూ

ఇప్పటికీ ఆ సీన్లే గుర్తొస్తుంటాయి... 'బాహుబలి'పై తమన్నా ఇంటర్వ్యూ
, శనివారం, 4 జులై 2015 (20:43 IST)
'బాహుబలి'లో అవంతిక అనే రాణిగా తమన్నా నటించింది. ఆమె చేయగలదనే తెలుసుకుని రాజమౌళి ఆమెకు అవకాశం కల్పించారు. ఎంతోమంది పోటీలో వున్నా ఇటువంటి పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె చెబుతుంది. ఈ నెల 10న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే అన్నిచోట్లా మొదలుపెట్టారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కథానాయిక తమన్నా శనివారంనాడు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ విశేషాలు..
 
బాహుబలిలో పాత్ర కోసం మీరు ప్రయత్నించారా?
ఇంత పెద్ద చిత్రంలో నాకూ అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతాను.
 
దర్శకుడి ఆలోచన మేరకు పాత్ర వస్తే రాజమౌళి దర్శకత్వం ఎలా అనిపించింది?
ఆయన సినిమాలో అవకాశమంటే మాటలు రావడంలేదు. చేసేది పెద్ద సినిమా అయినా కూడా ఆయన చాలా కూల్‌గా, ఎక్కడా కోపమనేదే తెచ్చుకోకుండా పని చేయడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఆయనకేం కావాలనేదానిపై ఒక పూర్తి విజన్‌ ఉంటుంది. మనం ఆ విజన్‌ను అర్థం చేసుకొని ఫాలో అయిపోవడమే నాకు తెలిసింది. ఒకరకంగా ఆయన చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తాను.
 
పాత్ర కోసం కసరత్తు చేశారా?
క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడమే నా మొదటి పని. దానికితోడు కొన్ని నెలల పాటు చాలా అంశాల్లో శిక్షణనిచ్చారు. షూట్‌కి ముందు కొన్ని రిహార్సల్స్‌ కూడా చేశాం. అన్నీ పకడ్బందీగా సెట్‌ అయ్యాకే సెట్స్‌ పైకి వెళ్ళడంతో షూటింగ్‌ అప్పుడు ఏ ఇబ్బందీ పడలేదు.
 
ఈ సినిమాపై మీ అభిప్రాయం?
భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సినిమా. ఈ సినిమాలో ప్రధానంగా ఏడు పాత్రలుంటాయి. ఆ పాత్రల చుట్టూనే ఓ బలమైన కథ నడుస్తూంటుంది. పీరియడ్‌ సినిమా కావడంతో ఈ సినిమాలో పాత్రలన్నీ నిజజీవిత సాధారణ పాత్రలకంటే మరింత లార్జ్‌గా కనిపిస్తూ, ప్రవర్తిస్తూ ఉంటాయి. సినిమా చరిత్రలో ఓ వండర్‌ సృష్టిస్తుందని చెప్పగలను.
 
ఇందులో మీ పాత్ర ఎలా వుంటుంది?
అవంతిక అనే యువరాణిగా కనిపిస్తా. నేనిప్పటివరకూ చేయని పాత్ర. చెప్పాలంటే మొదట్లో అంతా అయోమయంగా ఉండేది. ఒక్కసారి అంతా సెట్‌ అయిపోయాక ఈ సినిమా చేయడం చాలా సరదాగా ఈ క్యారెక్టర్‌ చేసేశా. ఇందులో యుద్ధ సన్నివేశాల్లోనూ కనిపిస్తా. ఒక మెయిన్‌ స్ట్రీమ్‌ కమర్షియల్‌ సినిమాలో ఇలాంటి విలక్షణ పాత్ర దొరకడం నా అదృష్టం.
 
తోటి నటీనటుల సహకారం ఎలా అనిపించింది?
ప్రభాస్‌, రానా అందరూ బాహుబలిపై ప్రేమతో పనిచేశారు. నాకైతే ఇప్పటికీ రోజూ బాహుబలి షూటింగ్‌ గుర్తొస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో అందరం కలవడం సంతోషంగా ఉంది. నిర్మాతైన శోభు గారు, ప్రసాద్‌ గారు లేకపోతే ఈ సినిమా లేదు.
 
డబ్బింగ్‌లో సినిమా చూశారా?
కేవలం నా పార్ట్‌ వరకు మాత్రమే చూశా. అది కూడా హిందీ వెర్షన్‌ డబ్బింగ్‌ చెప్పేప్పుడు చూశా. చాలా నచ్చింది. విజువల్‌ వండర్‌. అందరిలానే సినిమా చూడటానికి నేనూ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
webdunia
 
మీ కెరీర్‌కి ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు?
నా కెరీర్లో మరచిపోలేని సినిమాగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా రావడమనేది నా అదృష్టం. 'పయ్యా', '100% లవ్‌' సినిమాల తర్వాత నాకు బాగా కనెక్ట్‌ అయిన సినిమా ఇదే.
 
కొత్త చిత్రాలు?
ప్రస్తుతం నాగార్జున-కార్తీల సినిమా, రవితేజ 'బెంగాల్‌ టైగర్‌' చేస్తున్నా. మంచి సినిమాలు చేస్తూ పోవడమన్నదే నా అజెండా. అది ఏ భాషా సినిమా అని ప్రత్యేకించి చూడను అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu