Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి 2కి ఎప్పుడు పిలుస్తారో తెలీదు... చిరు చిత్రానికి ఎవ్వరూ అడగలేదు... తమన్నా ఇంటర్వ్యూ

ఏడాదికి పది సినిమాలు చేసేసి బిజీ ఆర్టిస్టు అనే పేరుకన్నా.. మంచి సినిమాలు చేయాలనే తపనతో తాను నెమ్మదిగా సినిమాలు చేస్తున్నానని నటి తమన్నా భాటియా చెబుతోంది. దాదాపు అగ్రహీరోలతో సినిమాలు చేసినా ఆమె తనకు బాగా నచ్చిన సినిమా ''మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌' అంటోంది.

Advertiesment
tamanna bhatia interview
, మంగళవారం, 15 మార్చి 2016 (18:58 IST)
ఏడాదికి పది సినిమాలు చేసేసి బిజీ ఆర్టిస్టు అనే పేరుకన్నా.. మంచి సినిమాలు చేయాలనే తపనతో తాను నెమ్మదిగా సినిమాలు చేస్తున్నానని నటి తమన్నా భాటియా చెబుతోంది. దాదాపు అగ్రహీరోలతో సినిమాలు చేసినా ఆమె తనకు బాగా నచ్చిన సినిమా ''మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌' అంటోంది. అందులో ఛాన్స్‌ వస్తే... డేట్స్‌ కదరక చేయలేకపోయా.. కానీ 'బాహుబలి'లాంటి సినిమాలో ప్రభాస్‌ పక్కన చేయడం కలిసివచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అంటోంది. తాజాగా కార్తీ, నాగార్జున కాంబినేషన్‌లో 'ఊపిరి'లో నటించింది. వంశీ పైడిపల్లి దర్శకుడు. పివిపి నిర్మాత. ఈ నెల 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా తమన్నాతో చిట్‌చాట్‌.
 
ఈమధ్య సినిమాలు తగ్గించినట్లున్నారే?
నిదానమే ప్రదానం.. ఏడాదికి పది సినిమాలు చేసేసి.. ఊపిరి సలపని బిజీగా వుండటం ఇష్టంలేదు. మంచి కథ వున్న చిత్రం ఆలస్యమైనా పర్వాలేదు.
 
ఏడాదికి.. రెండేళ్ళకు ఓ సినిమా చేయడానికి కారణమదేనా?
ఇక్కడ రెండు భాషలు మూడు భాషల్లో సినిమాలు ఒకేసారి తీయడం వల్ల చాలా గ్యాప్‌ వస్తుంది. ఊపిరి సినిమాను ఏడాదికి పైగా తీశారు. ఆ సినిమాలో వుండగా మరో సినిమా ఒప్పుకోలేదు. అంతకుముందు బాహుబలి కూడా అంతే. ఇప్పుడు బాహుబలి-2 కూడా వుంది. కానీ ఎప్పుడు పిలుస్తారో తెలీదు. అయినా వారికి చెప్పేశాను. నా పాత్ర చిన్నదట.. ఇంకో పక్క.. ప్రభుదేవాతో మూడు భాషల్లో రూపొందే సినిమాలు చేస్తున్నా.  
 
'ఊపిరి' ఒరిజినల్‌ సినిమా చూశారా?
చూడలేదు. నేను తప్ప యూనిట్‌లోని వారంతా ఫ్రెంచ్‌ సినిమా 'ఇన్‌టచ్‌బుల్స్‌' చూశారు. నాకు కథా చర్చల్లో పాత్ర గురించి వివరించారు. అందులోని పాత్ర కంటే కొత్తగా ట్రీట్‌మెంట్‌ చేశారు. ఫ్రెంచ్‌ సినిమాకు ఊపిరి రీమేక్‌ కాదు. కేవలం స్పూర్తిగా తీసుకునే కథను తయారుచేశారు. 
 
ఇందులో మీ పాత్ర ఏమిటి?
ఇందులో మిలియనీర్‌కు పర్సనల్‌ అసిస్టెంట్‌ కీర్తి పాత్ర చేశాను. బాగా చదువుకుని, హుందాగా, బాధ్యత గల పాత్ర. అలాగే మిలియనీర్‌ నాగార్జునకు, కార్తీకి మధ్య వారధిలా వ్యవహరిస్తాను. కథ వినగానే పాత్ర కొత్తగా వుండడంతో చేయాలనిపించింది.
 
ఒరిజినల్‌కు దీనికి తేడా ఏమిటి?
దర్శకుడు వంశీ పైడిపల్లి నా పాత్ర పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. లుక్‌ విషయంలో దుస్తులు, కేశాలంకరణ ఇలా అన్నింటిలోనూ రిచ్‌ లుక్‌గా కన్పించాలి. దీనివల్లే పాత్ర కొత్తగా కన్పిస్తుంది.
webdunia
 
డబ్బింగ్‌ మీరు చెప్పడానికి కారణం?
పాత్రపై దర్శకుడు అంత కేర్‌ తీసుకున్నప్పుడు వాయిస్‌ కూడా నాదే అయితే బాగుంటుందని తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను. తమిళంలో చెప్పలేదు. 
 
నాగార్జున గారితో నటించడం ఎలా అనిపించింది?
కదలకుండా వీలు చైర్‌లో కూర్చొని నటించాలంటే చాలా కష్టమే. ప్రక్కన సన్నివేశాలు నటించేలా చేస్తాయి. కానీ వాటిని కంట్రోల్‌ చేసుకోవాలి. ఏమాత్రం కదలకుండా జాగ్రత్తపడాలి. తను కదులుతున్నాడా... లేదా? అనే విషయాలు పరిశీలించడానికి దర్శకుడు ఇద్దరు అసిస్టెంట్లను కూడా పెట్టారు. తెలుగులో ఇలాంటి పాత్ర నాగార్జున చేయడం గొప్ప విషయం. తెలుగు సినిమా పోకడ మారింది. కొత్తకొత్త కథలు, పాత్రలు పుట్టుకొస్తున్నాయి. నాగార్జున చేసిన ఈ పాత్రను మరికొందరు స్పూర్తిగా తీసుకుని చేయవచ్చు.
 
మీకు బాగా నచ్చిన సినిమా? 
'మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌' సినిమాలో మొదట నటించమని అడిగారు. కానీ ఆ సమయంలో కుదరలేదు. పర్సనల్‌గా ఆ సినిమా అంటే చాలా ఇష్టం.
 
చిరంజీవి 150వ సినిమాలో మిమ్మల్ని అడిగినట్లు తెలిసింది?
నవ్వుతూ.. నా కంటే మీకే విషయాలు ఎక్కువగా ఎలా వస్తాయో తెలీదు.
 
ఊపిరి సినిమాలో ముందుగా శ్రుతి హాసన్‌తో చేశారు? ఆ తర్వాత మీతో చేశారు? కారణం?
శ్రుతిహాసన్‌ చేసినట్లు నాకు పెద్దగా తెలీదు. నా పాత్రను రీషూట్‌ చేస్తున్నట్లు చెప్పలేదు.
 
నాగ చైతన్యతో చేశారు. ఆయన తండ్రితో నటించారు? ఎలా ఫీలవుతున్నారు?
ఇద్దరితోనూ నటించాను. నాగార్జున మెచ్యూర్డ్‌ పర్సన్‌. చాలా సింపుల్‌గా వుంటాడు.
 
ప్రత్యేక సాంగ్‌లు చేస్తున్నారా?
నన్నెవరూ అడగలేదు. ఒకవేళ అడిగితే.. నచ్చితే చేస్తాను. అందుకని.. వాటికోసం ప్రత్యేకంగా ఎదురుచూడను.
 
కార్తీతో నటించడం ఎలా అనిపించింది?
తనతో ఇది మూడో సినిమా.. చాలా మెచ్యూర్డ్‌ అయ్యాడు. చాలా బ్యాలెన్స్‌గా నటిస్తాడు అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu