Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ష్‌.. నేనింకా బేబీనే.... శ్వేతా బసు ఇంటర్వ్యూ

Advertiesment
swetha basu interview
, గురువారం, 22 జనవరి 2015 (21:33 IST)
'కొత్త బంగారులోకం' చిత్రంలో కథానాయికగా ముద్దుముద్దుగా కన్పించిన నటి శ్వేతబసు ప్రసాద్‌. నటనలో ఓనమాలు నేర్చుకుని తెలుగులోనే అవకాశాల కోసం ఎదురుచూసిన ఆ తర్వాత బాలీవుడ్‌ వైపు వెళ్ళింది. అయితే మరలా తెలుగులోకి వచ్చి వ్యాంప్‌ పాత్రల్లోనూ నటించింది. తాజాగా 'ఇంటలిజెంట్‌ ఇడియట్స్‌'లో ఐటంసాంగ్‌లో నటించింది. ఈ చిత్రం గురించి తన కెరీర్‌ గురించి ఆమెతో జరిపిన చిట్‌చాట్‌...
 
ఐటం సాంగ్‌ చేయడానికి ప్రత్యేకమైన కారణం? 
ఒకే విధమైన మూస పాత్రలకు పరిమితమవటం నాకు నచ్చదు. అలాంటి ఆలోచనలతో నేను సినిమాలు చేయను. కథ బాగుంటే కమర్షియల్‌, మసాలా అన్ని తరహాల చిత్రాల్లో నటిస్తా.
 
ఇందులో ఎక్స్‌పోజ్‌ చేసినట్లు స్టిల్స్‌ చెబుతున్నాయి? 
ఎక్స్‌పోజ్‌ అనే మాట అనకండి. అదికూడా నటనే. ఆర్టిస్టుగా అన్ని తరహాలు చేయాలి. కళాకారిణిగా ఫేమస్‌ నటీమణులే చేయగా లేందీ నేను చేయడంలో తప్పేమిటి. ఇటువంటి విషయాల్లో నేనింకా బేబీనే.. అంటూ... చాలాకీగా సమాధానమిచ్చింది.

 
మీరు వ్యభిచారం చేస్తున్నట్లు అరెస్టు అయ్యారు. దాని వెనుక కొంతమంది పేర్లు బయటపెడతానన్నారు? 
అలా అనలేదు. నేను అనని మాటలు మీడియాలో వచ్చేశాయి. అందుకే నేను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాను. అదంతా గడిచిపోయింది. దాని గురించి ఏమీ మాట్లాడను.
 
మరి ఇన్నాళ్ళు కామ్‌గా వుండి ఈ రోజే మీడియా ముందుకు రావడానికి కారణం? 
సినిమాలో నటించాక దాని ప్రమోషన్‌ కోసం రావాల్సిన బాధ్యత నాపై వుంది. నిర్మాత, దర్శకులు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. అయినా అప్పుడు జరిగిన సంఘటనలతో నాకు ఎలాంటి సంబంధంలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. దాని గురించి మాట్లాడటం ఇష్టంలేదు. 
 
దానిపై ఓ డాక్యుమెంటరీ తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి?   
గత ఏడాదిన్నర కాలంగా 'రూట్స్‌' పేరుతో ఓ షార్ట్ ఫిలింను తెరకెక్కించే పనిలో బిజీగా వున్నాను. కానీ అది మీరన్నట్లు ఆ కాన్సెప్ట్‌ కాదు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ లఘు చిత్రం కోసం చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఫేమస్‌ సంగీతకారులు నటించే లఘు చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాను.
 
తెలుగులో చాలామంది అవకాశాలిస్తామన్నారు? ఏఏ చిత్రాలు చేస్తున్నారు? 
నేను ఏ సినిమా చేయటం లేదు. ఇటీవల కాలంలో నాకు తమ సినిమాల్లో అవకాశాలిస్తామని చాలామంది దర్శకనిర్మాతలు. కథానాయకులు ప్రకటించారు. కానీ అందులో ఏ ఒక్కరూ నన్ను నేరుగా సంప్రదించలేదు. నాకు మేనేజర్‌ అంటూ ఎవరూలేరు. అవకాశమివ్వదలచుకున్న వారు ఎవరైనా నన్ను స్వయంగా కలవాల్సిందే. హీరో విష్ణుతో ఇటీవలే ఓ సినిమా గురించి చర్చలు జరిగాయి. అది పూర్తిగా ఫైనలైజ్‌ కాలేదు.
 
బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారా? 
బాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయి.
 
ఇప్పుడు మీరు చాలా స్లిమ్‌గా మారారు? రహస్యమేమిటి? 
థ్యాంక్స్‌. గతంలో కంటే ఇప్పుడే బాగున్నావని చాలామంది అన్నారు. నేను ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయాయం, యోగా చేస్తున్నాను. ఇలాగే బాడీని కంటెన్యూ చేయాలనుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu