Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతా రాత్రిపూటే చేయాలన్నారు... భయపడినా ఒప్పుకున్నా... నటి త్రిధ ఇంటర్వ్యూ

Advertiesment
Surya vs Surya Movie
, శనివారం, 7 మార్చి 2015 (17:03 IST)
తెలుగులో సినిమా చేయడం ఆనందంగా వున్నా... రాత్రిళ్ళు షూటింగ్‌ అంటేనే చాలా భయపడ్డానని హీరోయిన్‌ త్రిధ చౌదరి చెబుతోంది. ఆమె నిఖిల్‌ సరసన 'సూర్య వర్సెస్‌ సూర్య'లో నటించింది. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ఈ చిత్రంలో నటించినందుకు మంచి పేరు వచ్చిందంటున్న ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ.
 
ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు? 
నేను బేసిక్‌గా బెంగాలీ. బెంగాలీలో కొన్ని సినిమాలు చేశాను. డిగ్రీ పూర్తిచేశాను. అక్కడ కొన్ని మోడల్స్‌ కూడా చేశాను. తెలుగులో రావడానికి ఓ కారణముంది. నేషనల్‌ లెవల్‌లో క్లీన్‌ అండ్‌ క్లియర్‌, ఫ్రెష్‌ ఫేస్‌ హంట్‌ ద్వారా నేను బాగా ఫేమస్‌ అయ్యాను. ఎనిమిది సిటీస్‌లోని అమ్మాయిలు ఈ కాంపిటిషన్‌లో పాల్గొన్నారు. ఫైనల్స్‌ ముంబాయిలో జరిగాయి. దాని తర్వాత నేను చాలా కమర్షియల్స్‌ చేశాను. డైరెక్టర్‌ కార్తీక్‌ నేను చేసిన టి.వి. సిరీస్‌ని యూ ట్యూబ్‌లో నా యాక్టింగ్‌ స్కిల్స్‌ చూసి సెలెక్ట్‌ చేసుకున్నారు. సంజన క్యారెక్టర్‌ కోసం ఎలాంటి ఆడిషన్‌ చేయలేదు. ఈ సినిమాలో నేను టి.వి. యాంకర్‌ రోల్‌ చేశాను. ఈ రోల్‌ చెయ్యాలంటే చాలా కాన్ఫిడెన్స్‌ వుండాలి. ఆ కాన్ఫిడెన్స్‌ నాకు కార్తీక్‌ ఇచ్చారు.

 
మీ పాత్ర చెప్పినప్పుడు ఎలా అనిపించింది? 
పాత్రలో వైవిధ్యం వుందనిపించింది. తెలుగులో తొలి సినిమా. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కువ స్కోప్‌ వున్న క్యారెక్టర్‌ చేశాను. లవ్‌, ఎమోషన్స్‌, కోపంతోపాటు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌గా వుండే అమ్మాయి. ఈ సినిమాలో సంజన క్యారెక్టర్‌ని అందరూ ప్రేమిస్తారు. ఒక జెనెటిక్‌ డిజార్డర్‌తో పగలు బయటికి రాలేని అబ్బాయి, నైట్స్‌ తిరగడానికి ఇష్టపడని అమ్మాయి.. వీళ్ళిద్దరి లవ్‌స్టోరీ అంటే ఎలా వుంటుంది? అనేది కొత్తగా అనిపించింది. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. ఇంతకంటే మంచి అవకాశం రాదనిపించింది. నాతోపాటు సీనియర్‌ నటులు తనికెళ్ళ భరణిగారు చేసిన క్యారెక్టర్‌, సత్య చేసిన అరుణసాయి క్యారెక్టర్‌, హర్ష చేసిన గోలా ఐస్‌ అమ్మే కుర్రాడి క్యారెక్టర్‌ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. 
 
నిఖిల్‌తో నటించడం ఎలా అనిపించింది? 
నిఖిల్‌ ఎంతో ఎనర్జిటిక్‌గా వుంటాడు. నేను అతనితో సమానంగా ఎనర్జీ చూపించే ప్రయత్నం చేశాను. ఈ క్యారెక్టర్‌ చెయ్యడంలో నిఖిల్‌ ఎంతో హెల్ప్‌ చేశాడు. ఏ సీన్‌ చేసినా తక్కువ టేక్స్‌లో కంప్లీట్‌ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి సీన్‌ను నాకు ఎక్స్‌ప్లెయిన్‌ చేసేవాడు, ఎలా పెర్‌ఫార్మ్‌ చెయ్యాలో చెప్పేవాడు. డైరెక్టర్‌ బాధ్యతల్ని ఎన్నో తన భుజాలపై వేసుకొని హెల్ప్‌ చేసేవాడు. 
 
ఇక్కడి వాతావరణం ఎలా అనిపించింది? 
ఈమధ్య టి.వి. ఛానల్స్‌లో ప్రోగ్రామ్స్‌ చేసినపుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఎంతో ఫ్రెండ్లీగా మూవ్‌ అయ్యారు. ఆ ప్రోగ్రామ్స్‌లో తెలిసింది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ని, మహేష్‌ని ఎంతగా ప్రేక్షకులు అభిమానిస్తారో. ఆర్టిస్టుగా చాలా గౌరవిస్తారని తెలుసుకున్నాను.
 
నైట్‌ షూటింగ్‌ ఎలా ఫీలయ్యారు? 
మహిళకు నైట్‌ డ్యూటీలు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎలా వుంటుందో.. నాకు అలానే అనిపించింది. కానీ రెండు మూడురోజులు చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. మొదట ఈ కథ విన్నప్పుడు భయపడ్డాను. అంతా రాత్రిపూటే చేయాలంటే... బాడీ సహకరించదు. నిద్ర సరిగ్గా రాదు. వాతావరణం మార్చుకోవాల్సి వుంటుంది. ఐదు రోజులు అయ్యాక అలవాటయింది. నైట్‌ షూట్‌ అయినప్పటికీ అనుకున్న టైమ్‌లోనే ఎలాంటి హడావిడి లేకుండా చాలా కూల్‌గా షూట్‌ చేశాం.
 
గ్లామర్‌ రోల్స్‌ చేస్తారా? 
ఇప్పుడే ఒక్క సినిమా చేశాను. కథను బట్టి మంచి పాత్రలే వేస్తాను. అనవసరమైన గ్లామర్‌, ఎక్స్‌పోజింగ్‌ చేయను.
 
ఈ చిత్రం తర్వాత ఆఫర్లు వచ్చాయా? 
తెలుగులో రాలేదు. బెంగాలీ భాషలో వచ్చాయి. బెంగాల్‌లో ప్రముఖ దర్శకుడు కమలేశ్వర్‌ ముఖర్జీ చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu