Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రీమ్ ఫలితం తర్వాతే... బాలయ్య కథ సిద్ధం చేయమన్నారు: అనిల్‌ రావిపూడి ఇంటర్వ్యూ

అసిస్టెంట్‌ దర్శకుడిగా పలువురి వద్ద పనిచేసిన అనిల్‌ రావిపూడి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో 'పటాస్‌'తో విజయం సొంతం చేసుకున్నాడు. మళ్ళీ ఆయనతో సినిమా వుంటుందంటున్న అనిల్... బాలయ్య కూడా ఓ కథను సిద్ధం చేయమన్నారనీ.. ఏదైనా.. 'సుప్రీమ్‌' సినిమా

సుప్రీమ్ ఫలితం తర్వాతే... బాలయ్య కథ సిద్ధం చేయమన్నారు: అనిల్‌ రావిపూడి ఇంటర్వ్యూ
, బుధవారం, 4 మే 2016 (22:14 IST)
అసిస్టెంట్‌ దర్శకుడిగా పలువురి వద్ద పనిచేసిన అనిల్‌ రావిపూడి నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో 'పటాస్‌'తో విజయం సొంతం చేసుకున్నాడు. మళ్ళీ ఆయనతో సినిమా వుంటుందంటున్న అనిల్... బాలయ్య కూడా ఓ కథను సిద్ధం చేయమన్నారనీ.. ఏదైనా.. 'సుప్రీమ్‌' సినిమా ఫలితాల తర్వాతే వివరిస్తానని అంటున్నాడు. మెగా వారసుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం రేపు.. అంటే గురువారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.. 
 
రెండో సినిమా కదా ఎలా అనిపిస్తుంది?
చాలామందికి ద్వితీయ విఘ్నం అంటుంటారు. కానీ నాకు అవేవీ లేవు. ఎందుకంటే అంతకుముందు ఓ సినిమాకు పనిచేశాను. పటాస్‌ అనేది రెండో సినిమా. కాకపోతే.. ఫుల్‌ఫ్లెడ్జ్‌ సినిమా అది. ఈ కథ చాలా బాగుంది. మా టీం ఇప్పటికే సినిమా చూసింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.
 
సినిమా ఎలా ఉండబోతున్నది?
ఈ సినిమా పూర్తిగా ఫ్యామీలీ ఎంటర్‌టైనర్‌ అని చెప్పవచ్చు. సినిమా మొదలైనప్పటి నుంచీ అందరినీ ఆకట్టుకుంటుంది.
 
హీరో క్యాబ్‌ డ్రైవర్‌కు సుప్రీం పేరేమిటి?
ఎందుకంటే క్యాబ్‌ కూడా ఓ పాత్ర పోషిస్తుంది. హీరో డ్రైవర్‌ అయినా.. క్యాబ్ వల్లే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎయిర్‌పోర్ట్‌ నుంచి పికప్‌ కోసం వెళ్ళిన హీరోకు.. ఎదురైనా సంఘటన. ఆ తర్వాత ఏమిటనేది సినిమా. సుప్రీం ఏమిటనేది సినిమాలో చూడాల్సిందే. టైటిల్‌కూ కథకు సంబంధం వుంటుంది.
 
దిల్‌ రాజుతో సినిమా ఎలా వచ్చింది?
'పటాస్‌' తర్వాత ఆయన నన్ను అభినందించారు. అలా పరిచయమైన ఆయనకు 'సుప్రీమ్‌' కథ సిద్ధం అయ్యాక వెళ్లి చెప్పాను. ఆయనకు కథ నచ్చడంతో సినిమా మొదలైంది.
 
సాయి ధరమ్‌ తేజ్‌నే ముందుగా అనుకున్నారా?
'సుప్రీమ్‌' కథ విన్న తరువాత దిల్‌ రాజు గారే సాయిధరమ్‌ తేజ్‌ గురించి చెప్పారు. అప్పటివరకూ నాకు సాయిధరమ్‌ తేజ్‌ పెద్దగా పరిచయం లేదు. కానీ ఒకసారి సాయిధరమ్‌ తేజ్‌‌కు కథ చెప్పిన తరువాత అతనే ఈ కథకు సరిగ్గా సరిపోతాడని అనిపించింది.
 
రాశిఖన్నా పోలీసుగా ఎలా చేసింది?
లేడీ పోలీసు ఆఫీసర్‌ అంటే విజయశాంతి గుర్తుకువస్తుంది. పవర్‌ఫుల్‌గా నటించాలి. గ్లామర్‌ నటన వున్న అమ్మాయిగా తను ఇందులో కన్పిస్తుంది. పాత్రకు న్యాయం చేసింది. 
 
హీరో కూడా పోలీసు డ్రెస్‌వేశాడే?
ఓ సన్నివేశంలో హీరోయిన్‌ను ఆటపట్టించే సందర్భంలో వస్తుందంతే.
 
రీమిక్స్‌ పాటలను పెడుతున్నారు.. కారణం?
నేను 1980, 1990ల మధ్య వచ్చిన సినిమాలకు విపరీతంగా ప్రభావితం చెందాను. అప్పుడు ఈ పాటలకు నేను డ్యాన్స్‌ వేసేవాడిని. చిరంజీవి స్టెప్‌లు ఇష్టపడేవాడిని. ఇప్పుడు దర్శకుడు అయ్యాను కాబట్టి అప్పటి ఆ నటులకు గౌరవంగానే ఈ పాటలను రీమిక్స్‌ చేస్తున్నాను.
 
అప్పట్లో బాలక్రిష్ణతో సినిమా అన్నారు ఎంతవరకు వచ్చింది?
బాలయ్య బాబు ఏప్రిల్‌ కల్లా నన్ను పూర్తి కథ సిద్ధం చేయమని అడిగారు. కానీ 'సుప్రీమ్‌' సినిమా పనుల వలన నేను పూర్తి కథను సిద్ధం చేయలేకపోయాను. మళ్ళీ త్వరలోనే ఆయనకు కథ చెప్పే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.
 
ఇందులో హైలైట్‌?
చివరి 20 నిముషాల క్లెమాక్స్‌ హైలైట్‌. ఇంతవరకు ఏ సినిమాలోనూ రాలేదు. 6గురు నటీనటులు కన్పిస్తారు. అదే థ్రిల్‌.
 
తదుపరి చిత్రాలు?
కొన్ని లైన్స్‌ ఉన్నాయి. 'సుప్రీమ్‌' సినిమా ఫలితం పైన తరువాత సినిమా ఆధారపడి ఉంది. అయినా విభిన్న చిత్రాలు చేయడమే నా లక్ష్యం అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్స్ ఎస్.ఎస్.రాజమౌళి, క్రిష్ లకు అభినందనలు