నాలో కొత్త యాంగిల్ 'బెల్లం శ్రీదేవి' : 'సుప్రీమ్' రాశీఖన్నా ఇంటర్వ్యూ
'ఊహలు గుసగుసలాడే'లో గ్లామర్ నటిగా పేరుతెచ్చుకున్న నటి రాశీఖన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 'సుప్రీమ్' సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్రలో నటించింది. శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. సాయ
'ఊహలు గుసగుసలాడే'లో గ్లామర్ నటిగా పేరుతెచ్చుకున్న నటి రాశీఖన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 'సుప్రీమ్' సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్రలో నటించింది. శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించారు. దిల్ రాజు నిర్మాత. ఈ సందర్భంగా రాశీఖన్నాతో ఇంటర్వ్యూ..
మొదటి సినిమాకు ఇప్పటికీ తగ్గారే?
అవును.. మరీ బొద్దుగా వుంటే.. తగ్గమని కొందరు సూచించారు. తగ్గాక అవకాశాలూ వస్తున్నాయి. అంతా మంచికే అనే తత్వం నాది. అయితే ఎంత తగ్గాననేది చెప్పలేను.
పోలీసు కామెడీ చేస్తే బాగుంటుందా?
దర్శకుడు కథ చెప్పకముందు పోలీసు పాత్ర అన్నారు. కానీ నెరేరషన్ చెప్పేటప్పుడు చాలా ఫన్నీగా వుంది. ఇందులో బెల్లం శ్రీదేవి అనే పాత్ర చేశాను. పోలీస్ ఆఫీసర్‌గా సిన్సియర్‌గా చేసే అంశాలు చివరికి ఎలా కామెడీ యాంగిల్‌లో మిగిలాయనేదే కథ.
ఇలా చేయడానికి కారణం?
నటిగా ఒకదాని పైనే వుండకూదడు పెర్‌ఫార్మెన్స్ పాత్రలు చేస్తూ పోవాలి. అటు గ్లామర్ ఇటు అభినయం రెండూ బ్యాలెన్స్ చేస్తేనే నటిగా తృప్తి వుంటుంది.
హీరోయిన్ కామెడీ అయితే అవకాశాలు వస్తాయంటారా?
నటిగా అవేవీ ఆలోచించను. హీరోయిన్ అయినా.. కామెడీ చేయడంలో తప్పులేదు. ఇకపై అలాంటివే వస్తాయని అనుకోను. నేను బేసిగ్గా చాలా సిగ్గరిని. అలాంటిది నేను ఇందులో కామెడీని పండించాను. నాలో నాకు తెలియని కొత్త యాంగిల్ ఇది.
ఫైట్లు కూడా వున్నాయని హీరో చెప్పారే?
ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. అవి కూడా బాగా వచ్చాయి. అవి కూడా సన్నివేశపరంగా కామెడీ వుంటుంది.
ట్రైలర్‌లో మీ పార్ట్ అంతగా ఉన్నట్టు లేదే?
హీరోయిన్ పాత్ర వుంది. కానీ ఏ ట్రైలర్‌లో ఏ హీరోయిన్‌కీ పేరు వచ్చింది చెప్పండి? నేను ఇంట్రడక్షన్ అయిన విధానం దర్శకుడు గొప్పగా తీశాడు. నటిగా సాటిఫై అయ్యాను.
సాయిధరమ్ తేజ్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?
తను చాలా కామ్‌గా వున్నట్లు అనిపించినా.. సరదాగానూ ఉంటాడు. తన డ్యాన్సు బాగా చేస్తాడు. మొదట్లో ఇతనితో డాన్స్ చేయగలనా అనిపించింది. అందుకే బాగా ప్రాక్టీస్ చేసి చేశా.
రీమిక్స్.. చిరంజీవి పాటకు 'అందం హిందోళం' స్టెప్పులేయడం ఎలా అనిపించింది?
ఒరిజినల్‌గా చిరంజీవి డాన్స్ చూసి భయపడ్డా. అందులో రాధా మేడమ్ ప్రతి షాట్‌లోనూ హీరో పక్కన డ్యాన్స్ మెప్పించింది. నేను చేయగలనా! అనిపించింది. ప్రాక్టీస్ వల్లనో.. ఏమో కానీ.. కెమెరా ముందు స్టెప్పులు వేసినప్పుడు భయం అంతా ఎగిరి పోయింది. బాగా చేశానని మెచ్చుకుంటున్నారు.
తెలుగు వచ్చినా డబ్బింగ్ చెప్పడంలేదు?
పంజాబీ అమ్మాయి అయినా హైదరాబాద్‌లో ఎక్కువగా వుండటంతో తెలుగు బాగానే మాట్లాడతాను. కానీ సినిమా డిక్షన్ కరెక్ట్‌గా రాలేదు. అది వచ్చినప్పుడు డబ్బింగ్ బాగా చెబుతాను. ప్రస్తుతానికి ప్రయత్నించడం లేదు.
మీరు కూడా హైదరాబాద్‌లో ఇల్లు కొన్నారా?
నేను కూడా కొన్నాను. ఇక్కడే సెటిల్ అవుదామనుకుంటున్నా.
ఈ సినిమాలో కొత్తదనం ఏమిటి?
సాధారణంగా హీరోకు ఇంట్రడక్షన్ వుంటుంది. కానీ నాకు ఇందులో వుంది. అలాగే హీరోయిన్లకు మంచి స్క్రిప్టులు రాయొచ్చని ఈ సినిమా ద్వారా అనిపిస్తుందని భావిస్తున్నాను. అంత మంచి పాత్ర ఇది.
ఇందులో చైల్డ్ సెంటిమెంట్ వుందన్నారు?
అది కథకు చాలా కీలకం. అందుకే ఇప్పుడు చెప్పలేను. కానీ ఆ బాబు చాలా బాగా నటించాడు. వాడు ఏడ్చే సీను ఒకటి ఉంటుంది. అందులో నిజంగానే ఏడ్చేశాడు. చూసిన మేమంతా వామ్మో అని అనుకున్నాం.
మీ తదుపరి చిత్రాలు?
గోపీచంద్‌తో ఆక్సిజన్ చేస్తున్నా. ఆ తర్వాత రవితేజతో రాబిన్‌హుడ్ చేస్తున్నా.
బాలీవుడ్‌కు వెళతారా?
ఆ ఆలోచన లేదు. వస్తే ఆలోచిస్తాను.
ఖాళీ సమయంలో మీ వ్యాపకాలు ఏమిటి?
నాకు కవితలంటే ఇష్టం. ఊహలు గుసగుసలాడే.. సినిమా కూడా ఇంచుమించు నాకు దగ్గరైన పాత్ర అది. అందులో హీరో కవిత్వంతో నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తాడు. యాదృశ్చికంగా మొదటి సినిమానే అలా దక్కింది. నేను ఖాళీ సమయాల్లో రాసే కవితల్ని ముద్రించాలనుకుంటున్నా.
హైదరాబాద్‌లో సెటిల్ అన్నారు.. పెండ్లి కూడా.. ఇక్కడవారినేనా?
దానికి చాలా టైం వుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ ముగించారు.