Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్ లాక్, బికినీ, గ్లామరస్ రోల్స్ చేయను.. నాకు సూట్ కావ్!: శ్రీదివ్య

Advertiesment
Sri Divya says no to lip-locks and bikini scenes
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (12:04 IST)
తెలుగు నటి అయినా తమిళంలో పలు ఆఫర్లను సొంతం చేసుకుంటున్న నటి శ్రీదివ్య. తొలిసారిగా  'మనసారా'లో నటించింది. తర్వాత మారుతీ దర్శకత్వంలో బస్టాప్‌లో చేసింది. తాజాగా 'వారధి'లో నటించింది. ఈ చిత్రం విడుదలయిన సందర్భంగా ఆమెతో చిట్‌ చాట్‌. 
 
ప్రశ్న: 'వారధి' చిత్రం ఎలా అనిపించింది? 
జ : చూసినవాళ్ళంతా నా పాత్ర బాగుందని మెచ్చుకుంటున్నారు. 
 
ప్రశ్న: ఇందులో మీకు నచ్చిన అంశం? 
జ : తెలుగు సినిమాల్లో ఇలాంటి స్పెషల్‌ పాత్రలు రావడం చాలా అరుదు. ఆఅ అవకాశం నాకు వచ్చింది అందుకే వదులుకోలేదు. 
 
ప్రశ్న: గ్లామరస్‌ పాత్రలు చేస్తారా.? 
జ : అస్సలు చెయ్యను.. నాకు ట్రెడిషనల్‌ గర్ల్‌ పాత్రలు చేయడం అంటే బాగా ఇష్టం. అలాగే హోమ్లీ గర్ల్‌ పాత్రలని చాలా ఎనర్జిటిక్‌ గా చేయగలనని నమ్ముతాను. ఆన్‌ స్క్రీన్‌ లిప్‌ కిస్‌‌లకి, పూర్తి గ్లామరస్‌ పాత్రలకి నేను విరుద్ధం. అస్సలు నాకు అవి సూటుకావు. 
 
ప్రశ్న: 'కేరింత' ఏ త రహా పాత్ర? 
జ : అది చాలా భిన్నమైన పాత్ర. సాయి కిరణ్‌ అడవి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి వరకూ అన్ని పాత్రలకంటే చాలా డిఫరెంట్‌ గా ఉంటుంది. కేరింత రిలీజ్‌ కి సిద్దమవుతోంది. అలాగే తమిళంలో కొన్ని ఆఫర్స్‌ ఉన్నాయి. త్వరలోనే సైన్‌ చేస్తాను. 
 
ప్రశ్న: ఎలాంటి పాత్ర చేయాలని వుంది? 
జ : అలనాటి నటి గౌతమి తన సినిమాల్లో చేసిన పాత్రల్లాంటివి చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర వస్తే ఎగిరి గంతేసి మరీ చేస్తాను. 
 
ప్రశ్న:  తెలుగులో తగ్గించుకున్నారా? 
జ : అదేంలేదు.. అవకాశాలు వుంటే తప్పకుండా ఇక్కడా చేస్తాను. ప్రస్తుతం తమిళంలో చేస్తున్నాను. 

Share this Story:

Follow Webdunia telugu