Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోను రేప్ చేసే క్యారక్టర్లో శ్రద్ధా దాస్ నటించిందా... 'గుంటూర్ టాకీస్'పై శ్రద్ధా దాస్ ఏమంటుంది..?

హీరోను రేప్ చేసే క్యారక్టర్లో శ్రద్ధా దాస్ నటించిందా... 'గుంటూర్ టాకీస్'పై శ్రద్ధా దాస్ ఏమంటుంది..?

Advertiesment
sradda dass interview
, గురువారం, 3 మార్చి 2016 (22:16 IST)
తెలుగులో పలువురు అగ్రహీరోలతో నాయికగా నటించిన శ్రద్దాదాస్‌.. కరాటే బ్లాక్‌ బెల్ట్‌ హోల్డ్‌ర్‌ కూడా. యాక్షన్‌ సన్నివేశాలు చేయడం చాలా ఇంట్రెస్ట్‌ అని 'అధిపతి' చిత్రంలో చెప్పింది. ప్రస్తుతం ఆమె 'చందమామ కథలు' దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో 'గుంటూరు టాకీస్‌'లో చేసింది. సిద్దు, రేష్మి, ఈమె ప్రధాన పాత్రదారులు. ఈ చిత్రంలో హీరోను కిడ్నాప్‌ చేసే సీన్‌ ఒకటి చేసింది. దాని గురించి సినిమా చూడాల్సిందే అంటోంది. ఈ నెల 4న విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆమెతో ఇంటర్వ్యూ..
 
గ్లామర్‌ పాత్రలకు దూరంగా వున్నారా? 
ఇప్పటివరకు చాలా గ్లామర్‌ పాత్రలు చేశాను. వరుసగా అవే వస్తుంటే బోర్‌ కొట్టేసింది. అందుకే భిన్నమైన క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నాను. 'గుంటూరు టాకీస్‌'లో అటువంటి కొత్తదనం కన్పించింది.
 
కథ ఏ తరహాలో వుంటుంది?
గుంటూరు టాకీస్‌ కథే కన్‌ఫ్యూజ్‌ కామెడీ. ఇద్దరు దొంగల కథ. మధ్యలో నేను ఎలా ఎంటరవుతానేది ఆసక్తికరంగా వుంటుంది.
 
ఇందులో సిద్దును రేప్‌ చేస్తారని తెలిసింది?
దర్శకుడు ప్రవీణ్‌ కాకపోతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదు. ఏ హీరోయిన్‌ చేయని సాహసం ఇందులో చేశా. రివాల్వర్‌ రాణి పాత్రలో నటించాను. చాలా స్ట్రాంగ్‌ రోల్‌. సాధారణంగా విలన్‌ అమ్మాయిని ఎత్తుకుపోతాడు. ఈ సినిమాలో నేను సిద్దూను ఎత్తుకుపోతాను. ఆ తర్వాత ఏం చేశానేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
 
రివాల్వర్‌ రాణిగా జాగ్రత్తలు ఏమి తీసుకున్నారు?
రివాల్వర్‌ రాణి పాత్ర కోసం నిజమైన తుపాకి ఉపయోగించాం. రెండు చేతుల్లో గన్స్‌ పట్టుకోవాలి. అవి చాలా  బరువుగా వుంటాయి. బులెట్స్‌ మాత్రం డమ్మీవే. కానీ ఫైర్‌ చేస్తుంటే.. పేద్ద శబ్దం వచ్చేది. ఆ సౌండ్‌కు తట్టుకోలేక చెవిలో దూది పెట్టుకొన్నాను. ఆ తర్వాత పేలాక.. మొహంపై చిన్నచిన్న దుమ్ముపడేది. అలాంటి స్థితిలో కూడా కళ్ళు తెరిచే వుండాలని దర్శకుడు చెప్పేవారు. ఇలా చేయడం చాలా కష్టమైంది.
 
దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
కథ చెప్పినప్పుడు బాగుంది. కానీ పాత్ర విషయంలో నన్నే ఎందుకు అనుకున్నారని అడిగాను. ఇప్పటివరకు మీరు ఇలాంటి పాత్రలో చేయలేదనీ. ఇది కొత్తగా వుంటుందని కన్‌విన్స్‌ చేశారు. నాకూ కొత్తగా అనిపించింది.
 
బోల్డ్‌ పాత్ర చేయడానికి కారణం?
దర్శకునిపై నమ్మకం. ఆయన గత చిత్రాలు చూశాను. సమాజాన్ని స్టడీ చేసే చిత్రాలు తీశారు. నా పాత్ర కూడా సమాజంలో కొందరు ఇలా వుంటారు అనిపిస్తుంది.
 
ఇటువంటి పాత్రకు ప్రేరణ ఎవరు?
కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ సినిమా రివాల్వర్‌ రాణి.. నుంచి స్పూర్తిగా తీసుకున్నాను. 
 
ఇందులో ఐటంసాంగ్‌ చేశారా?
ఈ చిత్రంలో 'టింగో టింగో..' పాట చేశాక.. ఐటం గాళ్‌గా ఆఫర్లు వచ్చాయి. నటించనని చెప్పాను. మంచి పాత్రలు చేయాలనేది నా ఎయిమ్‌.
 
కెరీర్‌పరంగా ఎలా వున్నారు?
చాలా సంతోషంగా వుంది. హిందీలో గ్రాండ్‌ మస్తీ, కన్నడ, బెంగాలీలో 'డాన్‌ శీను'ను రీమేక్‌ చేస్తున్నారు. ఇంకా తెలుగు.. ఇలా పలు భాషల్లో నటిస్తున్నాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu