మహిళతో రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తే... సన్నీ లియోన్‌తో చేస్తా.. చూస్తే టెంప్టై పోవాల్సిందే: శ్రద్ధాదాస్
నటి శ్రద్ధాదాస్.. మహారాష్ట్రకు చెందిన భామ అయినా.. దక్షిణాదిలో పలు భాషల్లో నటించింది. ఆరడుగుల ఎత్తు, కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ను సంపాదించిన తను.. తెలుగులో యాక్షన్ చిత్రాల్లోనూ నటించింది.
నటి శ్రద్ధాదాస్.. మహారాష్ట్రకు చెందిన భామ అయినా.. దక్షిణాదిలో పలు భాషల్లో నటించింది. ఆరడుగుల ఎత్తు, కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ను సంపాదించిన తను.. తెలుగులో యాక్షన్ చిత్రాల్లోనూ నటించింది. ఈమధ్య ఎక్కువగా హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ సినిమా కోసం ఫొటో షూట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సంగతులు..
* మాస్ మీడియా చేసి ఈ రంగంలోకి ఎలా వచ్చారు?
నాకు చిన్నప్పుడే కెమికల్ ఇంజనీర్ అవ్వాలనుండేది. మాథ్స్, సైన్స్‌లో 99 మార్కులు వచ్చేవి. మహారాష్ట్ర టాపర్‌గా అప్పట్లో నిలిచాను. దాంతో రుయా కాలేజీలో సైన్స్ గ్రూప్ తీసుకున్నాను. నా ట్వెల్త్ స్టాండర్డ్‌లో అనుకోని యాక్సిడెంట్ జరగడంతో పూర్తిగా మారిపోయింది. గత్యంతరంలేక మాస్ మీడియాలో వచ్చాను. ఈ రంగంలోకి వచ్చాక నలుగురితో ఎలా మాట్లాడాలి.. అనే విషయాలు తెలుసుకున్నాను.
* హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ చిత్రాల్లో నటించారు కదా.. ఏది ఇంట్రెస్ట్‌గా అనిపించింది?
భాష అనేది నటికి ప్రధానం కాదు. పాత్ర ఎలాంటిది అనేది ముఖ్యం. ఏదిఏమైనా దక్షిణాదికి వస్తే ఇంటికి వచ్చినంత ఫీలింగ్ కలిగేది. దాదాపు 25 సినిమాల్లో నటించాను. బెంగాలీ నా మాతృభాష. అక్కడ నటిస్తే నాన్నగారు ఎంతో సంతోషించేవారు. ఇక హిందీలో తరచుగా నటిస్తూనే వుంటాను. ఎందుకంటే పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. ప్రతి పాత్ర, ప్రతిభాష కొత్త అనుభూతిని ఇచ్చింది.
* గ్రేట్ గ్రాండ్ మస్తీలో ఛాన్స్ ఎలా వచ్చింది?
దర్శకుడు ఇంద్రకుమార్‌ను నేనే కలిశాను. అప్పటికే కాస్టింగ్ అంతా దాదాపు అయిపోయిందని తెలిసింది. ఆ తర్వాత మామూలుగా వచ్చేశాను. కొద్దిరోజుల తర్వాత షడెన్‌గా కాల్ వచ్చింది. అప్పుడు వేరే సినిమా షూటింగ్‌లో వున్నా.. వెంటనే పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. వెంటనే ఓ సీన్‌పేపర్ ఇచ్చి డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాక.. వెంటనే నన్ను ఎంపిక చేసేశారు. ఇందులో అమాయకత్వంతోకూడిన మహిళగా నటిస్తున్నాను.
* మీ ఫేవరేట్ హాలీడే స్పాట్స్ ఏమిటి? ఈమధ్యనే ఎక్కడికైనా వెళ్ళారా?
సెలవులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించగానే.. స్కాట్‌లాండ్‌కు వెళతాను. లాస్ట్ ఇయర్ వెళ్ళాను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. జపాన్ కూడా వెళుతుంటాను. బుద్ధిజం తీసుకోవడంతో లాస్‌వెగాస్.. ఇలాంటి కొన్ని ప్రాంతాలను పర్యటించాను. ఒకేఒకసారి సోలోగా భూటాన్ కూడా వెళ్ళివచ్చాను.
* పర్సనల్‌గా వస్తే.. ఇప్పటివరకు ఎవరితోనై డేటింగ్‌లో ఉన్నారా?
లేదు. రొమాన్స్, డేటింగ్ అనే విషయాలు ఇప్పటివరకు నా మైండ్‌లో లేవు. ఎప్పుడూ నా పనిమీదనే దృష్టి పెడతాను. బుద్ధిజంలోకి వచ్చాక.. మైండ్‌సెంట్ అంతా మారిపోయింది. నన్ను బాగా ప్రభావితం చేసే వ్యక్తి వస్తే.. ఎలా వుంటుందో చెప్పలేను.
* ఒక వేళ మహిళతో రొమాన్స్ చేసే సన్నివేశం వస్తే కోస్టార్‌గా ఎవర్ని ఇష్టపడతారు?
ఇంకెవరు. సన్నీలియోన్.. ఆమె మహిళ అయినా.. టెంప్ట్ చేసేట్లుగా వుంటుంది (పెద్దగా నవ్వుతూ)
* మీ కొత్త చిత్రాలేమిటి?
రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న గ్రేట్ గ్రాండ్ మస్తీ.. ఆ తర్వాత ఇండో-బంగ్లాదేశ్ మూవీ. ఈ రెండు సినిమాలో నా చేతిలో ఉన్నాయి.