Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరు... దర్శకుడు బాబీ ఇంటర్వ్యూ

Advertiesment
sardar gabbar singh director babi interview
, శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (20:34 IST)
'బాడీ గార్డ్‌', 'మిస్టర్‌ పెర్ఫెక్ట్‌', 'డాన్‌ శీను' చిత్రాలకు స్క్రీన్‌ రైటర్‌గా పనిచేసి 'పవర్‌' సినిమాతో దర్శకుడిగా మారిన కె.ఎస్‌.రవీంద్ర(బాబీ), పవన్‌ కళ్యాణ్‌తో 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' తెరకెక్కించాడు. ఈ నెల 8న విడుదలకు సిద్ధంగా ఉందీ ఈ చిత్రం. ఈ సందర్భంగా బాబీతో ఇంటర్వ్యూ విశేషాలు.
 
పవన్‌తో సినిమాకు ఎలాంటి గ్రౌండ్‌‌వర్క్‌ చేశారు?
నేను డైరెక్ట్‌ చేసిన 'పవర్‌' సినిమా 2014 సెప్టెంబర్‌లో రిలీజ్‌ అయింది. అదే సంవత్సరం నవంబర్‌లో నిర్మాత శరత్‌ మరార్‌ ఫోన్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ గారితో సినిమా చేస్తారా! అని అడగటంతోటే నాకు కలలా అనిపించింది. అఫీషియల్‌ అనౌన్స్మెంట్‌ వచ్చేవరకు నేను కలనే అనుకున్నాను. కళ్యాణ్‌ గారు చెప్పిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోవడానికి సుమారుగా నాకు 5 నెలలు సమయం పట్టింది. 2015 ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. సినిమా చేయడానికి సంవత్సరన్నర కాలం పట్టింది.
 
పవన్‌తో సినిమా అంటే భయపడ్డారా?
పవన్‌ కళ్యాణ్ కథ చెప్పే ముందు చాలా భయపడ్డాను. గబ్బర్‌ సింగ్‌ పేరుతో సినిమా వస్తోంది. ఆ సినిమాకు మించి ఈ కథ ఉండాలి. కాని కథ విన్న వెంటనే తృప్తిగా అనిపించింది. పెద్ద స్పాన్‌ ఉన్న సినిమా. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. 
 
పవన్‌, కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వం చేశారనే వార్తలు విన్పిస్తున్నాయి?
ఆయన కథ, స్క్రీన్‌ప్లేలోనే కలుగచేసుకున్నారు. సినిమా దర్శకత్వం విషయంలో పవన్‌ గారు ఇన్వాల్వ్‌ అయ్యారని వార్తలు వినిపించాయి. రచయితగా ఆయన సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎంతో హెల్ప్‌ చేశారు. కాని డైరెక్షన్‌, ఫోటోగ్రఫీ పనుల్లో ఇన్వాల్వ్‌ అవ్వలేదు. డైరెక్టర్‌గా నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు.
 
ఆయన ఎవరికీ సింక్‌ కారంటారు. మీరెలా సింక్‌ అయ్యారు?
పవన్‌ గారికి నాకు ఆలోచనలు మ్యాచ్‌ కాకపోతే ఆయనకు నన్ను భరించాల్సిన అవసరం లేదు. వెంటనే వేరే నిర్ణయం తీసుకుంటారు. కాని మాకు ఆ సమస్య రాలేదు. మా ఆలోచనలు కరెక్ట్‌గా వున్నాయి. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి వర్క్‌ చేయడం అంత సులువు కాదు. ఆయనతో పని చేసిన తరువాత నాలో సహనం పెరిగింది. ఆయన్ను తట్టుకుంటే వచ్చే కిక్కే వేరు. ఆయన అభినందన, పొగడ్త, బలం వేరేగా ఉంటుంది.
 
చిరంజీవి సెట్లో కలిశారు? ఏమి చెప్పారు?
 నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన దగ్గరకు వెళ్లి పవన్‌ కళ్యాన్‌ గారు బాబీ చాలా బాగా డైరెక్ట్‌ చేస్తున్నాడని.. నువ్వు కూడా తనతో సినిమా చెయ్‌ అన్నయ్యా అని చెప్పారంట. అదే పెద్ద అప్రిసియేషన్‌ నాకు.
 
షూటింగ్‌ అనుభవాలు?
2015 ఏప్రిల్‌ నుండి 2016 జనవరి వరకు సినిమా షూటింగ్‌ ఆడుతూ పాడుతూ చేశాం. చాలా రిస్కీ షాట్స్‌ ఆయన జాగ్రత్తగా చేశారు. రామ్‌లక్ష్మణ్‌ ఫైట్స్‌ కూడా జాగ్రత్తగా కంపోజ్‌ చేశారు. కొన్నిసార్లు డూప్‌ లేకుండా చేసేవారు. ఆయన ఉపయోగించిన గుర్రం ఆయనకు బాగా దగ్గరైంది కూడా.
 
ఈ నెల 8నే రిలీజ్‌. మరి ఇంకా పాటలు తీస్తున్నారు?
రీసెంట్‌గా సెన్సార్‌కి వెళ్లాం. సాంగ్స్‌ బ్యాలన్స్‌ ఉన్నాయనే మాట అవాస్తవం. నిన్ననే స్విట్జర్‌‌ల్యాండ్‌లో సినిమా పాటలు షూటింగ్‌ అయిపోయాయి. దాన్ని ఎప్పటికప్పుడు ఎడిట్‌ కూడా చేసేసాం. సెన్సార్‌ సభ్యుల నుండి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
 
హిందీలో కూడా 'సర్దార్‌..' చేస్తున్నారా?
ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్‌ చేయాలని కళ్యాన్‌ గారు, ప్రొడ్యూసర్‌ శరత్‌ గారు అనుకున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఒక టీంను కూడా నియమించాం.
 
పవన్‌తో సినిమా అని మొదట ఎవరికి చెప్పారు?
ఈ సినిమాకు డైరెక్టర్‌‌గా కన్ఫర్మ్‌ అయిన వెంటనే నేను మొదట రవితేజ గారినే కలిశాను. ఆయన నన్ను సొంత తమ్ముడుగా చూస్తారు. చాలా సంతోషించారు.
 
పవన్‌ గారి నుంచి ఏం నేర్చుకున్నారు?
కళ్యాణ్ గారు మల్టీ టాస్కింగ్‌ పర్సన్‌. సినిమాలో నటిస్తూనే.. ప్రజల సమస్యల గురించి కూడా ఆలోచిస్తారు. నేను ఆయన దగ్గర నేర్చుకున్న విషయమేమిటంటే మల్టీ టాస్కింగ్‌.
 
మరి పొలిటికల్‌ డైలాగ్స్‌ వున్నాయా?
ఈ సినిమాలో ప్రత్యేకంగా పొలిటికల్‌ డైలాగ్స్‌ అయితే లేవు. కాని ఆయనొక పార్టీకు లీడర్‌ కాబట్టి వినేవారికి డైలాగ్స్‌ అలా కనెక్ట్‌ అవ్వొచ్చు.
 
చిరంజీవి సినిమాలోని పాట పెట్టారే?
ఈ సినిమాలో చిరు గారిని టచ్‌ చేసేలా ఏదైనా చేయాలనుకున్నాం. చిరంజీవి గారి పాట చూపించాలనుకున్నాం. ఆయన చేసిన వీణ స్టెప్‌ బాగా ఫేమస్‌. ఆ స్టెప్‌ కళ్యాణ్ గారు చేస్తే ఎలా ఉంటుందో.. స్క్రీన్‌ విూద చూపించాం.
 
తదుపరి చిత్రం ప్లాన్‌లో వుందా?
ఈ సినిమా తరువాత ఒక నెల రోజులు రెస్ట్‌ తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యాను. నా భార్యకు కాస్త టైం కేటాయించాలని అనుకుంటున్నాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu