Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నజాజి.. పాటలో సిగ్గుపడ్డా.. హీరోయిన్ అంటేనే గ్లామరే కదా : సాక్షి చౌదరి

సన్నజాజి.. పాటలో సిగ్గుపడ్డా.. హీరోయిన్ అంటేనే గ్లామరే కదా : సాక్షి చౌదరి
, శనివారం, 25 జులై 2015 (18:55 IST)
'పోటుగాడు' సినిమాతో మంచు మనోజ్‌ సరసన నటించిన భామ సాక్షి చౌదరి. ఆ తర్వాత ఇపుడు అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్‌'.. (నేనుకాదు నా పెళ్లాం..) అనే సినిమాలో నటించింది. రెండో చిత్రమే యాక్షన్‌ బేస్డ్‌ చిత్రం కావడం విశేషం. శుక్రవారమే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
 
 
* సినిమాను ఏ థియేటర్‌లో చూశారు. ప్రేక్షకులు ఎలా స్పందించారు? 
క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో శుక్రవారమే చూశాను. అల్లరి నరేష్‌ కనబడితే ఈలల మోత మోగిపోతోంది. దుబాయ్‌లో నా పాత్ర రాగానే కేకలు వేశారు. ఎక్కువగా కింది తరగతి ప్రేక్షకులు గోలగోల చేశారు. సినిమాకు మంచి స్పందన వచ్చింది. 
 
* రెండో సినిమానే మాఫియా బ్యాక్‌డ్రాప్‌ ఎలా అనిపించింది? 
కథ విన్నప్పుడు నాకే కొత్తగావుంది. ఇది హీరోయిజం బేస్డ్‌ కాన్సెప్ట్‌ కానీ దర్శకుడు కిశోర్‌ మీరైతే బాగుంటుందని.. కామెడీ చిత్రమని చెప్పారు. నటిగా ఇటువంటి పాత్ర రావడం అరుదుగా కన్పిస్తుంది. నా ఇంట్రడక్షన్‌ చాలా కొత్తగావుంది. ఇలాంటివి మరే సినిమాలోనూ సాధ్యపడవు. 
 
* డాన్‌గా, పూజగా నటించారు. ఏ పాత్రంటే ఇష్టం? 
రెండు భిన్నమైన పాత్రలే. ఒకటి ఎమోషన్స్‌.. రెండోది ఆవేశం... పూజ పాత్ర చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరంకావడం, అందుకే తల్లి సంతోషం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది. మాఫియా డాన్‌గా అలాంటివి ఉండవు. ఆమెకు గన్సే ప్రపంచంగా అందరినీ చేతిలో పెట్టుకోవాలి. సినిమా అంగీకరించడానికి ఒకరకంగా రెండు పాత్రలు కూడా కారణమే. 
 
* యాక్షన్‌ సీన్స్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా? 
ప్రత్యేకమైన కేర్‌ లేదు. నాకు జిమ్నాస్టిక్స్‌, బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం వుంది. సినిమాల్లో వాటిని ప్రదర్శించే అవకాశం దక్కింది. తక్కువ సమయంలోనే ఇటువంటి క్యారెక్టర్‌ రావడం గొప్పగావుంది. 
 
* మీకు బాగా నచ్చి యాక్షన్‌ సీన్స్‌? 
దుబాయ్‌లో ఇంట్రడక్షన్‌ ఫైట్‌, ఇంటర్‌వెల్‌లో గ్యాంగ్‌తో ఫైట్‌ సీన్‌. బాగా నచ్చాయి. 
 
* నరేష్‌ నిజంగానే పిరికివాడా? 
ఆయనకు సిగ్గు ఎక్కువ. సెట్‌లో ఉన్నప్పుడే మాట్లాడాలంటే మొహమాటపడేవాడు. రెండు మూడు రోజులు మా మధ్య మాటలు లేవు. ఉన్నా చాలా తక్కువ. తర్వాతర్వాత స్నేహితులమయ్యాం. ఫైనల్‌గా 'సన్నజాజి..' పాటలో మరింత దగ్గరయ్యాం. ఆ పాటలో నేను రౌడీ తరహాలో నటించాలి. అప్పుడు నేను సిగ్గుపడ్డాను. తనే ధైర్యం చెప్పాడు. 
 
* అసలు ఏ తరహా పాత్రలు చేయాలని భావిస్తున్నారు? 
ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తుంది. ఫలానా పాత్ర అంటూ ఏదీలేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటుఆన్నను. ఏ తరహా పాత్రలైనా సరే. కథానాయిక అంటే గ్లామర్‌ తప్పని సరి. గ్లామర్‌తోపాటు పాత్రకు ప్రాముఖ్యత వుండాలి. 
 
* తెలుగులో మీకు నచ్చిన హీరో? 
ఒక్కరి పేరు చెప్పడం కష్టమే.. అందరు హీరోలతో నటించాలనేది నా కోరిక. 
 
* దర్శకుడు మీకంటే జూనియర్‌ ఎలా డీల్‌ చేశాడు? 
తను శ్రీనువైట్ల దగ్గర పనిచేశాడు. అంటే అనుభవం వున్నట్లేగదా.. చెప్పిన కథను చెప్పినట్లుగా తీశాడు. నిర్మాతలు కూడా ఆయనకు మంచి సపోర్ట్‌ ఇచ్చారు. 
 
* కొత్త చిత్రాలు? 
ఇంతవరకు ఏ సినిమా అంగీకరించలేదు. తమిళంలో ఓ చిత్రంలో నటించాను. త్వరలో విడుదల కానుంది. హిందీలో మరో చిత్రంలో నటిస్తున్నా. 
 
* హీరోయిన్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ చేయాలని అం టారు. దీనిపై మీ కామెంట్‌? 
అది వారివారి వ్యక్తిగతం. కొంతమందికి ఇష్టం వుండదు. నాకు మాత్రం గ్లామర్‌ డాల్‌ అనిపించుకోవడం ఇష్టంలేదు. అందంతోపాటు పెర్‌ఫార్మెన్స్‌ చూపడానికి ఆస్కారం వున్న పాత్రల కోసమే ఎదురుచూస్తుంటాను. 

Share this Story:

Follow Webdunia telugu