రాంచరణ్ ధ్రువ చూశాకే సినిమా చేస్తా: ఆర్పీ పట్నాయక్ ఇంటర్వ్యూ
శ్రీను వాసంతి లక్ష్మి, బ్రోకర్, కామన్‌మేన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్ర పోషించిన నటుడు, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్. ప్రస్తుతం సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైందనీ, దాన్ని కొందరు ఈగోయిస్టుల వల్ల నిజాన్ని చెప్పకుండా అబద్దాల్ని
శ్రీను వాసంతి లక్ష్మి, బ్రోకర్, కామన్‌మేన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్ర పోషించిన నటుడు, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్. ప్రస్తుతం సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైందనీ, దాన్ని కొందరు ఈగోయిస్టుల వల్ల నిజాన్ని చెప్పకుండా అబద్దాల్ని సెన్సేషనల్స్ చేస్తూ సమాజాన్ని నాశనం చేస్తున్నారని వాపోతున్నారు. మీడియాపై 'మనలో ఒకడు' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో హీరో ఆయనే. అనిత కథానాయిక. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి.జగన్ మోహన్ నిర్మించారు. ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
మీడియాపై సినిమాలో ఏముంటుంది?
మీడియాలో ఈగోయిస్టులున్నారు. వారు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. చాలా విషయాల్లో నిజాల్ని తెలుసుకోకుండా ఏవేవో కట్టుకథలు అల్లేస్తున్నారు. అది మీడియా కాదు. అందుకే నేను ఈ సినిమా చేశాను.
మీరు ఫేస్ చేసిన సందర్భాలున్నాయా?
చాలా వున్నాయి. ఇటీవలే కమెడియన్ వేణుమాధవ్ చనిపోయినట్లు ఓ ఛానెల్‌లో వార్త వచ్చింది. ఆ తర్వాత తాను బ్రతికే ఉన్నానంటూ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంతేకాకుండా తన వార్తను నిజం చేసుకోవడానికి 'మీడియానే తననెక్కడో చంపేస్తుందోనని భయపడి గవర్నర్‌ను రక్షణ కోరడానికి వచ్చానని' చెప్పారు. అలాగే ఎం.ఎస్.నారాయణగారు చనిపోవడానికి ముందు రోజే ఆయన చనిపోయినట్లు ప్రముఖ ఛానల్‌లో వార్త వేసింది.
కానీ అరగంట తర్వాత అన్నీ చానెల్స్‌లో ఆ వార్తను తొలగించారు. కానీ ఒకరిద్దరు రిపోర్టర్స్ మాత్రం వారి కుటుంబ సభ్యులు కనపడితే ఏం జరిగిందంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ తమ వార్త నిజం కావాలనుకుని తాపత్రయపడ్డారే తప్ప ఇంకేం లేదు. వార్త సేకరించడం తప్పు కాదు. ఏదీ నిజమో దాన్నే చెప్పమనే ఈ సినిమాలో చూపిస్తున్నాం.
వార్త కోసం మేనేజ్‌మెంట్ ఒత్తిడి చేస్తున్న సందర్భాలున్నాయికదా? వీటిని డీల్ చేశారా?
వార్తల్ని తీసుకువచ్చే పని విలేకరిది. దాన్ని సెస్సేషనల్‌గా వుండాలని మేనేజ్‌మెంట్ ఒత్తిడి చేయడం తప్పే. దాన్ని కూడా నేను నా కోణంలో చెప్పాను.
దీనివల్ల మీకు ఇబ్బందులు తలెత్తవా?
తలెత్తినా నేను దాన్ని సాల్వ్ చేయడానికి రెడీగా వున్నాను. జర్నలిజం అంటే ఏమిటి? అనేది అస్సలు చాలామందికి తెలీదు. తెలిసినా దాన్ని పక్కన పెట్టేసి.. సెస్సేషనల్ జర్నలిజం అనేట్లుగా చేయడం చాలా దారుణం.
వ్యక్తిగతంగా మిమ్మల్ని బాధించిన సందర్భాలు?
చాలా సందర్భాలున్నాయి. వేణుమాధవ్‌తో పాటు ఎం.ఎస్.నారాయణ ఉదంతాలు. ఆమధ్య ఓ న్యూస్‌లో 22మంది చనిపోయారని. ఒకరు చెబితే.. మరో ఛానల్ 20 మంది చనిపోయారని చెప్పింది. దానిపై పెద్ద చర్చ కూడా పెట్టారు. అసలు చనిపోయింది ఎంతమంది అనేది ఇదమిత్థంగా తెలీదు. కానీ ఆ సబ్జెక్ట్ పైన చర్చలు జరుపుతుంటే చాలా బాధేసింది.
మీడియా అంటే వార్తపత్రికలు కూడానా?
నేను వాటిని టచ్ చేయలేదు. ఓన్లీ ఛానల్స్ మాత్రమే. ఇందులో హీరో కృష్ణమూర్తి ఓ లెక్చరర్. అతని జీవితం ఈ మీడియా వల్ల ఎటువంటి పరిణామాలకు లోనయిందనేది కథ.
జాతీయ స్థాయిలో మీడియాలను పరిశీలించారా?
అన్నీ అలానే వున్నాయి. ఆమధ్య కర్నాటకలో ఓ అడవిమనిషి బయకుట వచ్చాడు. దానికి ఓ మీడియా పిలిచింది. ఆ తర్వాత వరుసపెట్టి అన్ని మీడియాలు ఆయనపై రకరకాలుగా ఒత్తిడులు తీసుకువచ్చారు. ఆఖరికి వీరి ఒత్తిడికి తట్టుకోలేక చనిపోయాడు. అలాగే తమిళనాడులో ఇంతలేదు. రెండే పార్టీలు.. వాటిచుట్టూనే చర్చ జరుగుతుంది. తెలుగులో అలాకాదు. పేపర్‌కో పార్టీ.. పార్టీకో పేపరు అన్నట్లుగా.. తెగ మీడియా సంస్థలు ఇక్కడే వున్నాయి.
కన్నడలో కూడా రిలీజ్ చేస్తున్నారా?
లేదు. కన్నడలో సాయికుమార్ హీరోగా రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. దర్శత్వం నేనే చేస్తాను.
మీడియాపై కసరత్తు చేశారా?
చేశాను. చాలావరకు వాస్తవ ఘటలను ఆధారంగా చేసుకున్నాం. అందుకోసం కావాల్సిన అవుట్‌పుట్స్‌ను మీడియా మిత్రులే ఇచ్చారు. సినిమాలో చూపించేదేది పర్సనల్ కాదు.. జనరలైజ్‌గా జరుగుతున్నదే చూపించాం.
టైటిల్ జస్టిఫికేషన్?
కృష్ణమూర్తి అనే కామన్‌మేన్ క్యారెక్టర్ చేశాను. ఓ సాధారణ వ్యక్తికి మీడియా వల్ల ఎలాంటి సమస్య వచ్చింది. దానివల్ల అతనెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దానికి అతనెలా ఎదురుతిరిగాడు.. అనేవి ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. 'మనలో ఒకడు' అంటే మనం ప్రతిరోజు మన జీవితంలో కలిసే ఎవరో ఒక వ్యక్తి. అందుకే మనలో ఒకడు అనే టైటిల్‌ను పెట్టాం.
సెన్సార్ ఇబ్బందులు తలెత్తలేదా?
నిర్మాతగారే ముందు భయపడ్డారు. కానీ సెన్సార్ చూసినవారు మెచ్చుకుని మంచి సినిమా తీశావ్ అని చెప్పారు.
రామోజీరావును కలిసినట్లున్నారు?
అవును. రామోజీరావుగారికి మీడియా ఈగోపై కథ నడుస్తుందని చెప్పాను. వార్తను హైలెట్ చేయడానికి నిజాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంచి కథను ఎన్నుకున్నారని ప్రశంసించారు. అలాగే సినిమాను కొంతమంది మిత్రులకు కూడా చూపించాను. సినిమా చూసిన తర్వాత అందరూ లేచి నిలబడి మెచ్చుకున్నారు. ఒకాయనైతే ఇన్ని రోజులు మంచి సినిమాలే చేశావురా.. ఈరోజు గొప్ప సినిమా చేశావు అని అనడం మరచిపోలేను.
పెద్ద మీడియా సంస్థలే సెన్సేషనల్స్ చేస్తున్నారు కదా దాన్ని ఎలా డీల్ చేశారు?
ఎం.ఎస్. నారాయణ ఇష్యూను. నెంబర్ 1 మీడియానే ముందుగా చెప్పింది. ఆతర్వాత అన్నీ.. కాసేపటికి ఆ వార్తను తీసేశారు. కానీ కొన్ని ఛానల్స్.. ఓసారి ఓల్డ్‌సిటీలో అల్లర్లు జరుగుతున్నాయని వార్త వేసి.. ఆ రోజంతా చూపించింది. విశ్లేషిస్తే.. కేవలం మా ఛానల్ రేటింగ్ కోసం మేం అలా చూపిస్తామని వారు సమాధానం చెప్పాక ఆశ్చర్యపోయా.
మరి వీటిని ఏవిధంగా కంట్రోల్ చేయబోతున్నారు?
అవన్నీ సినిమాలో వున్నాయి. చూశాక.. మీరు అభినందిస్తారు.
కొత్త సినిమాలు?
మెడికల్ మాఫియాపై సినిమా చేయబోతున్నా.
అంటే ఏ కోణంలో చూపించబోతున్నారు?
సహజంగా మెడికల్ ప్రయోగాలకు ఎలుకలు, పిల్లులు వంటి వాటిని వుపయోగిస్తారు. కానీ మన ఇండియాలో మాత్రం చాలా చోట్ల.. మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారు. చాలామందికి తెలీని కోణమది. విదేశాల్లో నిషేధించిన మందుల్ని ఇండియాలో స్వేచ్ఛగా అమ్మేస్తున్నారు. అవి వేసుకున్న ప్రతి మనిషిలో ఏదో ఒక జబ్బు బయటపడుతుంది. కొత్తకొత్త జబ్బులు వస్తున్నాయ్ అంటారు. అవే ఇవి. వీటి కోసం విదేశాల్లో వున్న మన మిత్రుల్ని కలిశాను. నమ్మలేని నిజాల్ని చెప్పారు. ఆశ్చర్యపోయాను. ఇండియా నుంచి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెబుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంది. ఇక్కడి ఒత్తిళ్ళు వల్ల ఇమడలేక హాయిగా వచ్చేశామని అన్నారు. ఇలా చాలా పాయింట్లు.. వున్నాయి.
మరి ఎప్పుడు ఆరంభిస్తారు?
'ధ్రువ' సినిమాను బట్టి ఆలోచిస్తాను.
అంటే ధ్రువ అలాంటి కాన్సెప్టా?
ఏది ఏమైనా.. ధ్రువ చూశాక.. నేను ఏం చేయాలనేది ఆలోచిస్తా.. ఇంతకంటే ఏం చెప్పలేను.. అని ముగించారు.