Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్‌లాక్‌లో ట్రెండ్‌ సృష్టిస్తా... రెజీనా ఇంటర్వ్యూ

Advertiesment
Regina interview
, శనివారం, 8 నవంబరు 2014 (18:05 IST)
హీరోయిన్లు ఒకప్పుడు ముద్దు గురించి మాట్లాడాలంటే భయపడేవారు. ఏది మాట్లాడితే ఏమవుతుందోనని జంకేవారు. కానీ ట్రెండ్‌ మారింది. ప్రతి సినిమాలోనూ దాదాపు హీరోయిన్లు హీరోలకు తమ పెదాలతో ముద్దులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల అది మరీ ఎక్కువైంది. బాలీవుడ్‌లో మరీను. కాగా, తెలుగులో కూడా అడపాదడపా వస్తున్నాయి. ఈ లిప్‌లాక్‌ల గురించి నటి రెజీనా మాత్రం ధైర్యంగా చేస్తానని చెబుతుంది. ఆమె నటించిన చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం'. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. శనివారంనాడు ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...

 
'పిల్లా నువ్వు లేని జీవితం'లో లిప్‌లాక్‌ వున్నట్లు ట్రైలర్స్ చెబుతున్నాయి? 
ట్రైలర్‌ చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఇందులో లేదు. సినిమా చూశాక మీకే తెలుస్తుంది.
 
ఎక్కువగా మీ చిత్రాల్లో అవి వుంటున్నాయి. గతంలో అలా చేశారు. కారణం? 
ఇంతకుముందు ఎస్‌ఎంఎస్‌, రొటీన్‌ లవ్‌ స్టోరీల్లో చేయలేదు. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో అలా చేయడానికి కారణం. కథలో దాని ప్రత్యేకత కోసమే. దర్శకుడు సీన్‌ చెప్పేటప్పుడు ఇలాంటివి వున్నాయో లేవో అడిగేస్తాను. ఒకవేళ వుంటే... లవ్‌ చేసినప్పుడు ఆ ఫీల్‌ను ఎఫెక్టివ్‌గా చూపించాలంటే తప్పదని చెబుతుంటారు. అలాంటి సన్నివేశాల్లో నేను చేయడానికి జంకను. ఆ విషయంలో నేను ట్రెండ్‌ సృష్టిస్తాను.
 
'రారా కృష్ణయ్య'లో గ్లామర్‌ గాళ్‌గా కన్పించారు? 
నేను మామూలుగా లూజ్‌ టీ షర్ట్స్‌, ఫ్యాంట్‌ వేసుకుంటాను. అయితే సినిమాలో బాగా పాపులర్‌ అవ్వాలి. ఎక్కువ అవకాశాలు రావాలంటే.. నడుమునైనా చూపించాలని చెబుతుండేవారు. మొదట్లో నేను అవేవీ పట్టించుకోలేదు. రెండు చిత్రాల్లో ఆ ప్రస్తావనే రాలేదు. అయితే నటనా పరంగా ఏదైనా చేయాలనే పాలసీ పెట్టుకున్నాను. అందుకే గ్లామర్‌గా వుండాలని నిర్ణయించుకున్నాను.
 
గీతా ఆర్ట్స్‌ కాంపౌండ్‌ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు? 
అది అదృష్టం అనుకుంటా. ఈ బేనర్‌లోనే ముగ్గురు హీరోలతో చేశాను. 
 
అల్లు అర్జున్‌తో పనిచేయడం ఎలా వుంది? 
అల్లు అర్జున్‌తో ఓ యాడ్‌ చేశాను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా కష్టజీవి. ఓ సన్నివేశంలో ఆయనకు బ్యాక్‌ పెయిన్‌ వచ్చింది. ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం... సాయంత్రానికి పూర్తి చేయాలి. పెయిన్‌ను లెక్క చేయకుండా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెంటనే ఆ పని పూర్తిచేశారు.
 
సాయి ధరమ్‌ తేజతో నటిస్తుంటే ఎలా అనిపిస్తుంది? 
మొదటసారి ఆయన్ను చూడగానే.. చిరంజీవిగారు ఫస్ట్‌ చిత్రాలు నేను చూడ్డం వల్ల.. అచ్చం ఆయన లాగే అనిపించింది. పవన్‌ కళ్యాణ్‌ స్టైల్‌ కూడా కొన్నిసార్లు కన్పిస్తుంది. వాటిని బీట్‌చేస్తూ తనకు ప్రత్యేక ముద్ర వేసుకునేలా నటించాడు.
 
జగపతి బాబుగారితో నటించడం ఎలా వుంది? 
మొదట నేను రారాకృష్ణయ్య చిత్రంలో చేశాను. ఆయన చాలా కోపిష్టి. రిజర్వ్‌గా వుంటారని చెప్పేవారు. మొదటి సినిమాలో ఆయనతో నాకు సీన్స్‌ తక్కువ. కానీ ఈ సినిమాలో ఆయన్ను నేను కాలర్‌ పట్టుకుని నిలదీయాలి. ఆ సీన్‌ చేయాలంటే ఆయన్ను చూస్తుంటే భయమేసింది. ఆ విషయమే ఆయనతో చెబితే.. ఎందుకు... ఫ్రీ మూడ్‌లోకి వచ్చి చేయమని ఎంకరేజ్‌ చేశారు. 
 
ఇతర భాషాల్లో నటిస్తున్నారా? 
తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. కానీ తెలుగులోనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాను. ఈ ఫీల్డు అంటే నాకు చాలా ఇష్టం.
 
హీరోయిన్ల మధ్య పోటీ ఎలా వుంది? 
కాంపిటేషన్‌ అనేది తప్పనిసరిగా వుండాలి. ఇప్పటితరం రకుల్‌, పూజా మేమంతా నటనలో పోటీ పడుతుంటాం. షూటింగ్‌ అయ్యాక చాలా ఫ్రెండ్లీగా మారిపోతాం. ఆరోగ్యవంతమైన వాతావరణ వుంది. అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu