Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాజిటివ్ మౌత్ టాక్ కోసం 'పెళ్లి చూపులు' చూపిస్తున్నాం‌: దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌

సినిమా రంగంలోకి కొత్తగా ప్రవేశించే దర్శకులకు ఇప్పటి సినిమాలు పరమ రొటీన్‌గా వుంటున్నాయనీ, అందుకే కొత్త ప్రయోగాలు చేసి.. ముందుగా షార్ట్‌ ఫిలింలు తీసి.. మెప్పించాక సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారని.. నూతన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెలియజేస్తున్నా

Advertiesment
#Pellichoopulu
, గురువారం, 28 జులై 2016 (21:35 IST)
సినిమా రంగంలోకి కొత్తగా ప్రవేశించే దర్శకులకు ఇప్పటి సినిమాలు పరమ రొటీన్‌గా వుంటున్నాయనీ, అందుకే కొత్త ప్రయోగాలు చేసి.. ముందుగా షార్ట్‌ ఫిలింలు తీసి.. మెప్పించాక సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారని.. నూతన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తెలియజేస్తున్నాడు. తాను అలాగే వచ్చాని... తాను తీసిన షార్ట్‌ఫిలిం 'సైమా' చూశాక.. సురేష్‌ బాబు అవకాశం ఇచ్చారని అదే 'పెళ్లి చూపులకు' నాంది పలికిందని తెలియజేశారు. డి.సురేష్‌ బాబు సమర్పణలో రాజ్‌ కందుకూరి (ధర్మ పథ క్రియేషన్స్‌), యష్‌ రంగినేని (బిగ్‌ బెన్‌ సినిమాస్‌) నిర్మాతలుగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవర కొండ, రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం 'పెళ్ళిచూపులు'. ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్‌తో ఇంటర్వ్యూ.
 
మీ నేపథ్యమేమిటి?
తండ్రిగారిది వరంగల్‌. అమ్మ తిరుపతి. భీమవరంలో స్నేహితులు ఉన్నారు. అందుచేత నాకు వరంగల్‌ యాస, తిరుపతి యాస, భీమవరం యాస తెలుసు. ఒక్కోచోట ఒక్కో యాస ఉంది. అయితే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే సినిమాలపై మక్కువతో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ తీశాను. నేను తీసిన 'డ్రామా' అనే షార్ట్‌ ఫిల్మ్‌ చూసి నిర్మాత  రామ్మోహన్‌ గారు పిలవడంతో ఆయన దగ్గర సంవత్సరం పాటు పని చేసాను. ఆ తర్వాత కొత్తగా చేయాలని 'సింక్‌ సౌండ్‌'లో 'సైన్మా' అనే షార్ట్‌ ఫిల్మ్‌ చేశాను. తెలంగాణ నేటివిటీకి తగ్గట్టు కొత్త పంథాలో వుండటంతో అభినందనలు రావడంతో సినిమాలు తీయగలను అనే నమ్మకం నాలో కలిగింది.
 
పెళ్ళి చూపులుకు నాంది ఎలా మొదలైంది?
కథ రాసుకున్న తర్వాత సురేష్‌ బాబుకు చెప్పాను. పూర్తిగా విన్నాక సెకండాప్‌లో ఇంకాస్తా బెటర్‌మెంట్‌ చేయమన్నారు. చేసి మరలా వినిపించాను. ఆ తర్వాత రాజ్‌ కందుకూరి అనే నిర్మాతతో మాట్లాడి.. నా కథ వినమన్నారు. ఆయన కథ విన్న వెంటనే ఈ సినిమాని నిర్మిస్తానన్నారు. ఏదో సరదాగా చేస్తున్నారనుకున్నాను, కానీ ఆయన సీరియస్‌ గానే చెప్పారని తర్వాత తెలిసింది. దాంతో పెళ్ళిచూపులు అలా మొదలైంది.
webdunia
 
రిలీజ్‌కు ముందే చాలామంది చూపించారు. అంత కాన్పిడెన్సా?
అవును.. సినిమా అంతా చూశాక.. దీన్ని ప్రముఖులైన అందరికీ చూపిద్దామని సురేష్‌ బాబుగారే అన్నారు. అలా వారంరోజులుగా చూపిస్తున్నాం. ఇది చూసి పాజిటివ్‌ మౌత్‌టాక్‌తో అందరికీ చేరుతుందనే నమ్మకముంది.
 
సింపుల్‌ కథను తీసుకున్నారే. దీనికి ప్రేరణ?
చాలా సింపుల్‌ కథ. ప్రేరణ అనేవి కొన్ని చిత్రాలే. తెలుగులో ఎక్కువగా రొటీన్‌ సినిమాలు వస్తున్నాయి. సహజత్వానికి దగ్గరగా తమిళ, బాలీవుడ్‌ చిత్రాలుంటున్నాయి. మనమెందుకు తీయలేం. అనే ఆలోచనతో పలు సినిమాలు చూశాక ఆ లోచన వచ్చింది. ఆమధ్య వచ్చిన 'రఘువరన్‌ బి.టెక్‌'లా ఎందుకు లేవని ఆలోచించాను. ఆ ఆలోచనల నుండి పుట్టిన కథే పెళ్ళిచూపులు.
 
సింక్‌ సౌండ్‌ అనే కొత్త సిస్టమ్‌ను పరిచయం చేశారా?
అవును. ఇది బ్లాక్‌ అండ్‌ వైట్‌ సి నిమాల్లోని ఫార్మేట్‌. దాన్ని ఇప్పటివారు రిస్క్‌ అని వాడటంలేదు. ఇంతకుముందు 'సైన్మా' అనే షార్ట్‌ ఫిల్మ్‌ను సింక్‌ సౌండ్‌ చేసిన స్టయిల్‌లోనే 'పెళ్ళిచూపులు' చేశాను. యాక్టింగ్‌తోపాటు వారు చెప్పే డైలాగ్స్‌ డైరెక్టర్‌గా సౌండ్‌లో వుంచేస్తాం. ఆ తర్వాత ఓ సాఫ్ట్‌వేర్‌ సాయంతో నాయిస్‌ వచ్చినవాటిన డిలీజ్‌ చేస్తాం. అయితే కొత్తవారు డైలాగ్‌ చెప్పేటప్పుడు ఈ విధానంలో లేట్‌ అవుతుంది. అందుకని సందర్భానికి తగినట్లు వాళ్లు ఎలా రియాక్ట్‌ అవుతారో అలా చెప్పమన్నాను. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోననే భయపడ్డాను. అయితే సురేష్‌ బాబుగారు సినిమా చూసిన తర్వాత ఏం టెన్షన్‌ పడద్దు అంతా బావుందని ధైర్యం చెప్పారు. 
 
టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?
నేను చేసిన షార్ట్‌ ఫిలిం 'అనుకోకుండా' టైటిల్‌నే ఈ సినిమాకు పెట్టాలనుకున్నాం. అయితే వేరే వాళ్ళు ఆ టైటిల్‌ను రిజిష్టర్‌ చేశారు. అప్పుడు 'వివాహ భోజనంబు' అనే టైటిల్‌ అనుకున్నాం కానీ చివరగా కథకు 'పెళ్లిచూపులు' టైటిల్‌ కరెక్ట్‌గా సరిపోతుందనిపించడంతో ఆ పేరు పెట్టేశాం.
 
తదుపరి చిత్రాలు...
నా తదుపరిచిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే ఉంటుంది. కంట్రోల్‌ బడ్జెట్‌లో డిఫరెంట్‌ మూవీస్‌ చేయాలనుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అవార్డ్... న‌ట‌న‌లో కాదు... ఎందులో...?