Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవసరాన్ని బట్టి బికినీ వేస్తా.. లిప్‌లాక్‌కూడా చేస్తా!‌: శ్రుతిసోది

Advertiesment
Patas heroine Shruti Sodhi Special interview
, సోమవారం, 26 జనవరి 2015 (18:56 IST)
నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'పటాస్‌'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇందులో కళ్యాణ్‌రామ్‌ సరసన శృతిసోది నటించింది. ఈ పంజాబీ అమ్మాయి తొలి సినిమాతో పేరుతెచ్చుకుంది. ఈ సందర్భంగా శృతిసోదితో చిట్‌చాట్‌.. 
 
ప్రశ్న: మీ నేపథ్యం? 
జ: పంజాబ్‌లో పుట్టాను. తండ్రి బ్యాంక్‌ ఎంప్లాయ్‌. తల్లి గృహిణి. ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. సైకలాజీలో డిగ్రీ చేశాను. తర్వాత జర్నలిజంపై ఆసక్తితో ఆ కోర్సు చేయడంతోపాటు. కాలేజీ డేస్‌లోనే చిన్న చిన్న స్కిడ్స్‌ చేసేదాన్ని. అదే నన్ను న్యూస్‌ ప్రెజంటర్‌గా, లైవ్‌ షోలు చేస్తూ జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేశాను. జీటీవీ, న్యూస్‌ ఎక్స్‌ ఛానల్స్‌లో పనిచేశాను. 
 
ప్రశ్న: సినిమారంగంలోకి ఎలా ప్రవేశించారు?
జ: నాకున్న ఆసక్తిని గమనించి ఇంటిలోనివారు ప్రోత్సహించారు. ఇబ్బంది కల్గించే విధంగా వుండవద్దని సూచించారు. న్యూస్‌ ఎక్స్‌లో వున్నప్పుడు స్క్రిప్ట్‌ను రాసుకునేదాన్ని కల్చర్‌ ప్రోగ్రామ్స్‌లు నిర్వహించేదాన్ని అది చూసిన పంజాబీ దర్శకుడు అప్రోచ్‌ అయ్యారు. తొలుతగా 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 420' చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించాను. అలా మూడు సినిమాలు చేశాను. 
 
ప్రశ్న: తెలుగులో ఎలా అవకాశం దక్కింది? 
జ : కల్యాణ్‌రామ్‌ సరసన ఓ కొత్త హీరోయిన్‌ను వెతుకుతున్నారని తెలుసుకున్న నా మేనేజర్‌ నా ఫోటోలను పంపారు. నా లుక్‌ నచ్చడంతో హీరోయిన్‌గా ఎంపికచేశారు. చాలా ఈజీగా పెద్ద సంస్థలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. 
 
ప్రశ్న: తెలుగు సినిమాల గురించి అవగాహన వుందా? 
జ : నేను హిందీ ఛానెల్స్‌లో వచ్చే తెలుగు డబ్‌ సినిమాలను చూసేదాన్ని అలా తెలుగు సినిమా లంటే కొంత తెలుసు. తెలుగులో మొదటి సినిమాయే నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌లో చేయడం చాలా ఆనందంగా వుంది. 
 
ప్రశ్న: సెట్‌లో కళ్యాన్‌రామ్‌ ఎలా వుండేవారు? 
జ : కల్యాణ్‌ రామ్‌ చాలా టాలెంటెండ్‌ ప్రొఫెషనల్‌. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కోసం ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర నుండి చూశాను. చాలా సాఫ్ట్‌. డైలాగ్స్‌ చెప్పేటప్పుడు చాలా సహాయం చేశారు. 
 
ప్రశ్న :  గ్లామర్‌ ఫీల్డులో బికినీలు లిప్‌లాక్‌లు చేయాల్సివస్తే? 
జ : ఈ ఫీల్డులో వచ్చేటప్పుడు చాలా మంది నాకు ఇటువంటివి వుంటాయని చెప్పారు. ఇప్పటివరకు రాలేదు. నటిగా చేయాలనుకుంటే తప్పకుండా బికినీ వేస్తాను. నటనకు అవకాశమున్న పాత్రలతోపాటు గ్లామర్‌ రోల్స్‌ కూడా కూడా చేస్తాను. స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకు లిప్‌లాక్‌ చేయడానికీ నేను సిద్ధమే. అవసరమైతే బికినీ వేయడానికి సిద్ధంగా ఉన్నాను. 
 
ప్రశ్న: 'పటాస్‌' తర్వాత ఆఫర్లు వచ్చాయా? 
జ : వెంటవెంటనే సినిమాలు చేయాలనుకోవడంలేదు. పాత్రల ఎంపికలో తొందరలేకుండా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని చేస్తాను. అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu