Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓకే బంగారం: మణిరత్నం- రెహమాన్ ఇంటర్వ్యూ.మనస్సుకు వయస్సుతో..

Advertiesment
One can experiment within mainstream cinema: Mani Ratnam
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (13:09 IST)
మణిరత్నం దర్శకత్వం వహించిన 'కాదల్‌ కన్మణి' తెలుగులో 'ఓకే బంగారం'గా వస్తోంది. మమ్ముట్టి కొడుకు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, నిత్యమీనన్‌ హీరోయిన్‌గా రూపొందింది. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌లు ఇద్దరూ తమ మనస్సులోని భావాలు ఇలా చెబుతున్నారు.
 
మణిరత్నం
ప్రశ్న :  ముంబై బ్యాక్‌డ్రాప్‌ తీసుకుంటారు ఎందుకు?
జ :  నేను అక్కడ కొంతకాలం చదువుకున్నాను. అంతేకాకుండా ఇండియాలోని పెద్ద మెట్రో పాలిటన్‌ సిటీ కావడం కూడా ఒక కారణం. కొన్ని కథలు కోల్‌కత్తాలో సెట్‌ కావచ్చు. కొన్ని కథలు మరో సిటీలో సెట్‌ కావచ్చు. ప్రతి సిటీకి ఒక ఓన్‌ క్యారెక్టర్‌ వుంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ ముంబైకి బెస్ట్ కావడంతో అక్కడే తీయడం జరిగింది. 
 
ప్రశ్న : 60 ఏళ్ళు వచ్చినా యువత ప్రేమ చిత్రాలు ఎలా తీస్తారు?
జ : వయస్సుకు, మనస్సుకు సంబంధంలేదు. అంటూ నవ్వేస్తూ.. నేనింకా 22 ఏళ్ళ కుర్రాడినే అన్నారు.
 
ప్రశ్న: మీ సినిమాలో ఏదైనా సందేశం వుందా? 
జ : ఈ రోజుల్లో యువతీ యువకుల యాటిట్యూడ్‌ గురించి చెప్పే కథ ఇది. ప్రస్తుతం సమాజంలోని యువత కావచ్చు, పెద్దవారు కావచ్చు వారి యాటిట్యూడ్‌ ఎలా వుంది అనేది రిప్రజెంట్‌ చేసే విధంగా ఈ సినిమా వుంటుంది. అలాగే యూత్‌కి మంచి సందేశం కూడా వుంటుంది. 
 
ప్రశ్న: కథ కోసం ఏదైనా కసరత్తు చేశారా?
జ : మన నిత్య జీవితంలోనే రీసెర్చ్‌ అనేది ఒక పార్ట్‌ అయిపోయింది. మనకు వచ్చే ఇన్‌పుట్సే రీసెర్చ్‌లో ఒక పార్ట్‌లా వుంటుంది. ఒక విషయం గురించి పర్టిక్యులర్‌గా తెలుసుకోవాలనుకున్నప్పుడు రీసెర్చ్‌ అనేది అవసరం అవుతుంది. జీవితంలోని ఎమోషన్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యాల్సిందే తప్ప రీసెర్చ్‌ అవసరం లేదు. 
 
ప్రశ్న : సహజీవనం అనేది కాంట్రవర్సీ కాన్సెప్ట్‌.  దీనివల్ల సొసైటీపై ప్రభావం వుండదంటారా?
జ : ఈ సినిమా లివింగ్‌ రిలేషన్‌ గురించి మాత్రమే కాదు, పెళ్ళి గురించి, మనిషి యాటిట్యూడ్‌ గురించి వుంటుంది. వ్యక్తిగతంగా వున్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వుంది. 
 
ప్రశ్న: పి.సి.శ్రీరామ్‌ కెమెరా పనితనం ఎలా వుంది?
జ : మేం మళ్ళీ కలిసి చెయ్యడమనే క్వశ్చన్‌ లేదు. ఎందుకంటే నా సినిమాలో అతను కూడా ఒక పార్ట్‌. ఎందుకంటే అతను నా సినిమాకి పనిచేయకపోయినా నా ప్రతి స్క్రిప్ట్‌ అతనికి తెలుసు. అతను నాకు మంచి ఫ్రెండ్‌. సినిమాలన్నింటి గురించి డిస్కస్‌ చేస్తాడు. 
 
ప్రశ్న: సీతారామశాస్త్రిగారితో పాటలు రాయించుకున్నారు. ఆయన అనుభవం ఎలా వుంది?
జ : సీతారామశాస్త్రిగారు కూడా వేటూరిగారిలాగే చాలా గొప్ప పాటలు ఇచ్చారు. వేటూరిగారి పాటల్లో వున్న ఫ్లేవర్‌ శాస్త్రిగారి పాటల్లో కూడా కనిపించింది. ఆయనతో ఈ సినిమా పాటలు రాయించుకోవడం గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. 
 
ప్రశ్న: మమ్ముట్టి కుమారుడితో సినిమా తీశారు. తండ్రీ కొడుకుల మధ్య మీరు గమనించిన తేడా ఏమిటి? 
జ : వాళ్ళిద్దరూ పూర్తి ఆపోజిట్‌గా వుంటారు. ఒక మహానటుడి కుమారుడిగా అతని ఇన్‌ఫ్లుయెన్స్‌ అతని మీద పడకుండా పెరగడం అనేది చాలా కష్టం. దుల్కర్‌ అతని తండ్రిని ఇన్‌ప్లుయెన్స్‌ లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పరుచుకున్నాడు. అతను ఈ సినిమా చెయ్యడం నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. 
 
మా అబ్బాయి పాట నచ్చింది: ఎ.ఆర్‌.రెహమాన్‌ 
 
ప్రశ్న: మీ అబ్బాయినే ఎందుకు పరిచయం చేశారు?
జ : నేను ఎవరినైనా పరిచయం చేస్తాను. ఓ సందర్భంలో తను చేసిన ట్యూన్‌ నచ్చింది. నేను మా ఫ్యామిలీ కోసం ఒక పాట చేశాను. అది మణిసర్‌ విన్నారు. ఆ పాట నాకు కావాలి, నా సినిమాలో వాడుకుంటానని చెప్పారు. దాన్ని మ్యూజిక్‌ వీడియో చెయ్యాలనే ఆలోచన వుంది. అయితే ఆ పాటను ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు. 
 
ప్రశ్న : మణిరత్నంతో జర్నీ ఎలా అనిపిస్తుంది?
జ : మణిరత్నంగారికి యునీక్‌ క్వాలిటీ మ్యూజిక్‌ తీసుకోవడం తెలుసు. దాని వల్లే నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి వర్క్‌ చేయగలిగాను. ఆయనకు సినిమా హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేదు. మంచి క్వాలిటీతో సినిమాగానీ, మ్యూజిక్‌గానీ రావాలని కోరుకుంటారు. హీరోల విషయంలో కూడా అంతే. సినిమా ఫ్లాప్‌ అయినా ఆయన పట్టించుకోరు. ఎంత బాగా హీరో పెర్‌ఫార్మ్‌ చేశారనేదే ఆయన దృష్టిలో వుంటుంది. మిమ్మల్ని ఎక్కడైనా రిజెక్ట్‌ చేస్తే ఆయన దగ్గరికి వెళ్లండి. ఆయన మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. అది ఆయనలో వున్న బ్యూటిఫుల్‌ థింగ్‌. 
 
ప్రశ్న: ఎప్పుడైనా మీ ట్యూన్‌ నచ్చలేదని చెప్పారా?
జ : ఏదో ఓ సందర్భంలో అన్నా.. దాన్ని మార్చుకుని చేస్తాను. సినిమా చూసిన తర్వాత ఒక పాట సినిమా స్పీడ్‌ని తగ్గిస్తుందేమో అని మణి సర్‌కి అనిపించింది. ఆ పాట తీసేద్దామని అన్నాను. ఎందుకని అడిగారు మణిసర్‌. దానికంటే బెటర్‌ సాంగ్‌ చేద్దామని చెప్పాను.

Share this Story:

Follow Webdunia telugu