Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గ్రీకువీరుడి'తో పడిపోయాను: నిత్యా శెట్టి ఇంటర్వ్యూ

Advertiesment
Nitya Shetty interview
, సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (19:02 IST)
చిన్నప్పటి నుంచి నాగార్జున ఫ్యాన్‌ను. గ్రీకువీరుడు సాంగ్‌తో ఆయనకు పడిపోయానంటూ నూతన నాయిక నిత్యాశెట్టి అంటోంది. తను కొత్తగా నటించిన సినిమా 'పడేసావే'. నాగార్జున ప్రోత్సాహంతో చునియా దర్శక నిర్మాతగా నిర్మించింది. వైజాగ్‌ పంపిణీదారుడు రాజుగారి కుమారుడు కార్తిక్‌ రాజు హీరోగా నటిస్తున్నాడు. సమీరా మరో నాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిత్యాశెట్టితో చిట్‌చాట్‌.
 
బాలనటిగా ఏయే సినిమాల్లో నటించారు?
'దేవుళ్ళు', 'అంజి', 'హరివిల్లు' వంటి దాదాపు 25 సినిమాల్లో నటించాను. ఓ తమిళ సినిమాలోనూ నటించాను.
 
మీ నేపథ్యం?
నేను పుట్టింది బెంగుళూరులో. కానీ చదువంతా హైదరాబాద్‌లోనే. తల్లిదండ్రులు ఇక్కడే వుంటారు. నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి.
 
నటిగా అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?
అప్పుడు ఓ సీన్‌లో బాగా చేయాలంటే.. చాక్లెటు ఇచ్చేవారు. బాగా ఏడ్చే సీన్‌లో ఇంకా ఎక్కువ చాక్లెట్లు వచ్చేవి. కానీ కథానాయికగా అయ్యాక ఏడిస్తే అందంగా వుండాలంటున్నారు. అందం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
ఇద్దరమ్మాయిల ప్రేమకథనా?
సాధారణగా ముక్కోణపు ప్రేమకథ అంటే ఇద్దరబ్బాయిలు ఒక అమ్మాయి.. కథతో చిత్రాలు వస్తుంటాయి. కానీ తొలిసారిగా.. ఇద్దరమ్మాయిలు. ఓ అబ్బాయి కథే ఇది. ఇందులో నీహారిక అనే పాత్రలో నటించాను. కొత్త కథేమీ కాదు. సింపుల్‌ లవ్‌ స్టొరీ. ప్రేమలో చాలా కన్ఫ్యూజన్స్‌ ఉంటాయి. అందుకే ప్రేమ అనేది జిగ్సా పజిల్‌ లాంటిదనే కోణంలో టైటిల్‌ను పజిల్‌పై సింబాలిక్‌గా వేశారు.
 
మహిళా దర్శకురాలైతే ప్రయోజనాలేమిటి?
చాలా వున్నాయి. కొన్ని విషయాల్లో ఇది బాగోలేదని చెప్పేవచ్చు. డ్రెస్‌ విషయంలో ఇది వేసుకుంటే చాలా ఇబ్బందిగా వుంది అని చెబితే వెంటనే తను అర్థం చేసుకుంటుంది. అదే విషయాన్ని వేరేవారికి చెప్పాలంటే.. అర్థమయినా కానట్లు.. బిహేవ్‌ చేస్తారు. అదో పెద్ద ప్రాసెస్‌. చునియా దర్శకురాలే కాదు స్నేహితురాలు కూడా. ఆమెతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఫీల్‌ అయ్యాను. నాకు చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. వర్క్‌ పట్ల డెడికేషన్‌ ఉన్న పెర్సన్‌. పెర్ఫెక్షన్‌ విషయంలో అసలు కాంప్రమైజ్‌ అవ్వరు.
 
తోటి నటీనటుల గురించి?
కార్తీక్ మంచి ఎంటర్టైనింగ్‌ పెర్సన్‌. సెట్స్‌లో ఎంతో ఫన్‌ చేసేవాడు. మరో లీడ్‌ రోల్‌లో నటించిన సమీరా నాకు మంచి ఫ్రెండ్‌ అయిపోయింది. ఎక్కడకి వెళ్ళినా మేమిద్దరమే ఉండేవాళ్ళం. తను కాశ్మీర్‌ అమ్మాయి. తెలుగు అనే భాష వుందని కూడా ఆమెకు తెలీదు. కానీ నా సహచర్యంతో తెలుగు గ్రహించి.. చాలా చక్కగా డైలాగ్స్‌ చెప్పింది.
 
మీ ఫేవరేట్‌ హీరో ఎవరు?
నాకు చిన్నప్పటినుండి నాగార్జున గారంటే చాలా ఇష్టం. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ కూడా. గ్రీకువీరుడు అనే సాంగ్‌కు నేను పడిపోయాను. అలాంటిది ఆయన ప్రోత్సాహంతో వస్తున్న ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
 
కొత్త చిత్రాలు
రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా నటిస్తోన్న 'శోభన్‌ బాబు' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu