Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్మ బుర్రపెట్టి తీశాడు.. మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు: మంచు మనోజ్

Advertiesment
manchu manoj interviews
, గురువారం, 31 మార్చి 2016 (19:30 IST)
మంచు మనోజ్‌, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు, వడ్డే నవీన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్ర 'ఎటాక్‌'. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకుడు. నిర్మాత సి.కళ్యాణ్‌. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. 
 
* ధూల్‌పేటలో తీయడానికి కారణం? 
ఇది వాస్తంగా జరిగిన కథ. అక్కడ పాత్రధారులు వేరు. సినిమాలో పేర్లు మార్చారు వర్మ. దాని కోసం అక్కడ ఆయన బాగా పరిశోధన చేశారు. హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీలోని ధూల్‌పేటలో దందాలు చాలా జరుగుతుంటాయి. కొన్ని గగుర్పాటు కల్గించే విషయాలు కూడా వున్నాయి. 
 
* రక్తచరిత్ర, రౌడీ.. ఇప్పుడు ఎటాక్‌.. వంటి చిత్రాలన్నీ ఒకే ఫార్మెట్‌లో వుండే కథలే కదా ప్రత్యేకం ఏమిటి? 
ఇటువంటి చిత్రాలకీ మూలం 'గాడ్‌ఫాదర్‌' సినిమా. వాటి అనుసరించే రకరకాల కథలు పుడుతున్నాయి. అయితే 'రక్తచరిత్ర'.. కంటే ఈ చిత్రం కొత్తగా ఉంటుంది. ఇదికూడా రెండు గ్రూపుల మధ్య గొడవ. 
 
* ఇందుల ప్రకాష్‌రాజ్‌ పాత్ర ఎలా వుంటుంది? 
తను మా నాన్నగా చేశారు. ఆయనకు కొడుకులుగా జగపతిబాబు, వడ్డేనవీన్‌ నేను నటించాం. 
 
* అసలు మీ పాత్ర ఏం చేస్తుంటుంది? 
గొడవలు ఏమీ గిట్టని పాత్ర నాది. అనుకోని స్థితిలో అందులో ఇన్‌వాల్వ్‌ కావాల్సి వస్తుంది. 
 
* ఇందులో సీరియస్‌గా నటించారే? 
నా పెండ్లికి ముందు మొదలైంది. పెండ్లయ్యాక జోవియల్‌గా వుండలేకపోయాను. అది సినిమాపై బాగా ఎఫెక్ట్‌గా కన్పిస్తుంది. అందుకే సీరియస్‌గా ఉండటానికి పాత్ర చాలా తోడ్పడింది. 
 
* అంటే మిమ్మల్ని ఎంజాయ్‌ చేయనీయకుండా వర్మ అడ్డుకున్నారా? 
అసలు ఈ సినిమా కథే సీరియస్‌. దానికితోడు. నా ఫ్యామిలీ లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయకుండా షూటింగ్‌ అనేసరికి కాస్త సీరియస్‌ అవడం మామూలే. నాకు వర్మకున్న సన్నిహితం మధ్య.. సీరియస్‌గా అలానే చేసేయ్‌ అన్నారు. ఇంకో విషయం చెప్పాలి. నాకు ఈ సినిమా నిర్మాతను నేనేనని వర్మ చెప్పారు. నా కోసం చేయ్‌ అని అడిగారు. కానీ ఆ తర్వాత తెలిసింది.. సి.కళ్యాణ్ నిర్మాత అని. 
 
* ఎందుకని ఆయన పేరు చెప్పుకోలేదు? 
ఏవో పాత బాకీలు ఎవరైనా అడుగుతారేమోనని మొదట్లో అలా చెప్పుకున్నట్లు తెలిసింది. 
 
* సినిమా చాలా ఆలస్యమైందికదా? 
ఆలస్యమైనా సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. 
 
* సినిమాలు గ్యాప్‌ ఇచ్చారే? 
అన్నీ రొటీన్‌ కథలే వస్తున్నాయి. 'బిందాస్‌' తరహా చేసుకోవచ్చు. కానీ కొత్తగా వుండాలని.. అందుకే ఇలాంటి కథల్ని చేస్తున్నా. 
 
* వర్మ అన్ని సినిమాలు ఒకేలా తీస్తారుకదా? ఇందులో ప్రత్యేకత ఏమిటి? 
అసలు ఆయన మనస్సు, బుర్ర పెట్టి తీస్తే ఆయనలా ఎవ్వరూ సినిమా తీయలేరు. ఈ సినిమాకు అవి పెట్టి తీశారు. 
 
* వర్మ.. కాంట్రవర్సీ అంటారు.. మరి మీ దృష్టిలో ? 
వర్మ స్ట్రెయిట్‌ ఫార్వోడ్‌తోపాటు కాంట్రవర్సీ మనిషి. అయితే అన్నింటిలో చాలా క్లారిటీగా వుంటాడు. ఆయనకు ప్రేక్షకుల పల్స్‌ ఎలా పట్టుకోవాలో తెలుసు. అదేవిధంగా మీడియా పల్స్‌ కూడా తెలుసు. అందుకే పబ్లిసిటీలు ఏదో సందర్భంగా వాడుకుంటుంటాడు. 
 
* నాన్నగారి జనరేషన్‌కు మీ జనరేషన్‌కు తేడా గమనించారా? 
నాన్నగారి జనరేషన్‌తో మమ్మల్ని పోల్చవచ్చు. వారు ఎన్నో కష్టాలు, బాధలు పడి ఈ స్థాయికి వచ్చారు. మా జనరేషన్‌ వేరు. 
 
* కొత్త చిత్రాలు? 
త్వరలో రెండు చిత్రాల్లో నటించనున్నా. ఆ వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu