Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూ ఇయర్‌ స్నేహితులతో గడిపా... లావణ్య త్రిపాఠి

Advertiesment
lavanya tripathi interview
, గురువారం, 7 జనవరి 2016 (21:54 IST)
డెహ్రాడూన్‌కు చెందిన నటి లావణ్య త్రిపాఠి. 'అందాల రాక్షసి'లో తొలిసారిగా తెలుగులో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. తెలుగులో పెద్దగా స్నేహితులు లేరనీ, స్కూల్‌ డేస్‌లోని స్నేహితులతో ఎక్కువగా గడుపుతానని అంటోంది. ఈసారి న్యూ ఇయర్‌ను స్నేహితులతో గడిపాననీ.. కొత్త ఏడాది మరిన్ని చిత్రాలు చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. తాజాగా ఆమె 'సోగ్గాడే చిన్నినాయన'లో నటించింది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో ఇంటర్వ్యూ..
 
ఈ చిత్రంలో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు ?
'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో తెల్ల చీరకట్టుకుని సాంప్రదాయంగా వుంటాను. రాము అనే పాత్రకు పెయిర్‌గా చేశాను.   సినిమా మొదలయినప్పటినుండి చివరి వరకు నేను చీరల్లోనే కనిపిస్తాను. సినిమాలో మంచి ఎమోషన్స్‌ ఉంటాయి. అందుకే సెలక్ట్‌ చేసుకున్నాను. రెగ్యులర్‌ హీరోయిన్‌లా కాకుండా నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉంటాయి.
 
నాగార్జునతో నటిచండం ఎలా అనిపించింది?
నాగార్జున గారితో సినిమా అనగానే చాలా ఆనందం కల్గింది. మరో పక్క  చాలెంజింగ్‌గా అనిపించింది. మొదట్లో నన్ను చూసి.. చాలా ఫ్రీగా వుండాలని సూచించారు. డైలాగ్‌లు ముందే చెప్పడం.. ఎలా చేయాలో కొద్దిగా రిహార్సల్‌ చేయించడం జరిగింది. నాగార్జున చాలా కేర్‌ తీసుకున్నారు. నటనలో ఆయన ఎంతో సపోర్ట్‌ చేశారు.  
 
నాగార్జున రెండు పాత్రల్లో వేరియేషన్‌ ఎలా వుంటుంది?
సినిమాలో నాగార్జున గారు బంగార్రాజు, రాము అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. బంగార్రాజు అమ్మాయిలతోనే ఎక్కువగా ఉంటాడు. రాము వచ్చేసరికి అసలు అమ్మాయిల జోలికే వెళ్ళడు. చాలా సిగ్గుపడే మనత్తత్వం. తన సొంత భార్యకు తన ప్రేమను వ్యక్తం చేయలేని అమాయకుడు.
 
ఆ ఇద్దరిలో ఎలాంటివారు మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు?
నన్ను నన్నుగా ప్రేమించాలి. చాలా ఫ్రాంక్‌గా మాట్లాడాలి. నాకు భర్తగా వచ్చే మనిషిలో బంగార్రాజు, రాము ఇద్దరి ఆలోచనలు కలిసి ఉండే వ్యక్తి కావాలి.  
 
రమ్యకృష్ణతో నటించడం ఎలా అనిపించిది?
రమ్యకృష్ణ లాంటి సీనియర్‌ నటితో కలిసి పని చేశాను. ఆమె చాలా ఓపెన్‌గా ఉండే మనిషి. నన్ను చాలా ఎంకరేజ్‌ చేశారు. ఇద్దరం ఫ్రెండ్స్‌ లాగా కలిసి వర్క్‌ చేసేవాళ్ళం. ఎన్నో విషయాల్లో నాకు హెల్ప్‌ చేశారు.
 
కొత్త దర్శకుడు ఎలా చేశారు?
కళ్యాన్‌ కృష్ణ కొత్త డైరెక్టర్‌ అని నాకు అనిపించలేదు. సెట్స్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. తనకు ఏం కావాలనే విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు.
 
ఎలాంటి నటిగా వుండాలనుకుంటున్నారు?
సినిమా సక్సెస్‌ అయితే హీరో, హీరోయిన్లు ఇద్దరికి మంచి పేరు వస్తుంది. అదే ఫెయిల్‌ అయితే ఈ అమ్మాయి ఐరన్‌ లెగ్‌ అంటుంటారు. నాకు అలా అనిపించుకోవాలని లేదు. అందుకే గ్యాప్‌ తీసుకొని మంచి స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేస్తున్నాను. 
 
లచ్చిందేవికి సినిమా ప్రమోషన్‌కు సహకరించడంలేదా?
ప్రమోషన్‌కు నేను ఎప్పుడూ రెడీనే.. ఈ నెల 28న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' సినిమా విడుదలవుతుంది. మూడు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటించాను. అంకాలమ్మ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అందులో అందరిని భయపెట్టే ఒక పాట ఉంటుంది. ఆ సినిమా రిలీజ్‌ కోసం చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నాను. క్రైమ్‌, కామెడీ నేపధ్యంలో సాగే కథ.
 
సంక్రాంతి అంటే తెలుసా?
తెలుసు.. ఇక్కడ చక్కగా ముగ్గులతో.. చలిమంటలతో ప్రజలు పండుగ చేసుకుంటారు. మాకు ఇలాంటివి లేకపోయినా.. అమ్మ పాయసం వంటి వంటకాలు వండుతుంది. ఈసారి పండుగ నాడు ఇక్కడే వుంటాను. సినిమా విడుదలలు వున్నాయి కాబట్టి.
 
కొత్త సినిమాలు కమిట్‌ అయ్యారా?
అల్లు శిరీష్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను. అందులో కాలేజీకు వెళ్ళే అమ్మాయి పాత్ర. డిఫరెంట్‌ రోల్‌ అని చెప్పలేను కాని నేను కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu