Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్య ఎగ్జ‌యిట్ అయ్యింది... క్రిష్‌ ఇంటర్వ్యూ

నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ప్రతిష్టాత్మకంగా తెర

Advertiesment
నా భార్య ఎగ్జ‌యిట్ అయ్యింది... క్రిష్‌ ఇంటర్వ్యూ
, సోమవారం, 16 జనవరి 2017 (22:34 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా 12న ప్రేక్షకుల వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌తో ఇంట‌ర్వ్యూ...
 
బాలయ్య ఫీలింగ్ ఎలా ఉంది?
సినిమాను చూసిన వారంద‌రూ సినిమా స‌క్సెస్ కోసం త‌మ వంతుగా స‌పోర్ట్ చేసినందుకు థాంక్స్‌. ఫ‌స్ట్ కాంప్లిమెంట్‌ను బాల‌కృష్ణ‌గారు ఇచ్చారు. బాల‌కృష్ణ‌గారితో ప్రీమియ‌ర్ షో చూస్తున్న‌ప్పుడే తెలిసింది. సినిమా చివ‌ర్లో నా చేతిని నొక్కి బావుందని అన్నారు. బాల‌కృష్ణ‌గారు ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంగా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చేసిన‌ప్పుడు ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాన‌ని అనిపించింది. అలాగే త‌ర్వాత మా అమ్మగారు, భార్య‌తో క‌లిసి సినిమా చూసిన‌ప్పుడు ఇంట‌ర్వెల్ స‌మయానికి నా భార్య ఎగ్జ‌యిట్ అయ్యింది. చివ‌రి క్లైమాక్స్ వ‌చ్చిన‌ప్పుడు నావైపు తిరిగి ఈ సినిమా కోసం కేటాయించిన ఈ సమ‌యం చాలా విలువైంద‌ని అన‌డం చాలా గొప్ప‌గా అనిపించింది. ఎందుకంటే త‌న‌తో పెళ్ళైన త‌ర్వాత ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేదు.
 
ఈ కథకు ఇంకా ఎవరినైనా అనుకున్నారా?
క‌థ రాసుకుంటున్న‌ప్పుడే బాల‌కృష్ణ‌గారు మాత్ర‌మే హీరోగా అనుకున్నాను. ఇప్పుడు సినిమా చూసిన త‌ర్వాత అంద‌ర‌రూ బాల‌కృష్ణ‌గారు త‌ప్ప మ‌రెవ‌రూ ఈ పాత్ర‌ను చేయ‌లేర‌ని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మ‌క క‌థ‌ను చేస్తున్న‌ప్పుడు భ‌యం క‌ల‌గ‌లేదు. బాధ్య‌త‌గా ఫీలయ్యాను.ఈ సినిమాలో అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో అని చూపించ‌డం కంటే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి అనే క్యారెక్ట‌ర్‌ను ఎంత బాగా ఆడియెన్స్‌ను చూపించామ‌నేదే చాలెంజింగ్‌గా అనిపించింది.
 
చిత్రంపై విమర్శలు వస్తున్నాయే...?
సినిమా క‌థ రాసుకునేట‌ప్పుడు ఐదు పుస్తకాలు చ‌దివితే శాత‌క‌ర్ణి గురించి ప‌ది డిఫ‌రెంట్ వెర్ష‌న్స్ తెలిసింది. అంటే మ‌న‌కు తెలిసింది చాలా త‌క్కువ‌. ఈ మేట‌ర్స్‌ను తీసుకుని, రాజ‌సూయ యాగం చేశాడు. త‌ల్లి పేరుని ముందు పెట్టుకున్నాడు. అనే విష‌యాలు తీసుకుని నాకున్న చారిత్రక ఆధారంగా తీసుకుని సినిమాటిక్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాను.
 
79 రోజుల్లో ఎలా సాధ్య‌మైంది?
సినిమాను నాలుగు భాగాలుగా విడ‌గొట్టాం. మొరాకోలో జ‌రిగేదంతా ఒక సెట‌ప్ అయితే, అమ‌రావ‌తిలో జ‌రిగేది ఒక సెట‌ప్‌. క‌ళ్యాణ‌దుర్గం, సౌరాష్ట్ర‌లో జ‌రిగేది ఒక సెట‌ప్‌. గ్రీకుల‌తో జ‌రిగే యుద్ధం ఒక సెట‌ప్ ఇలా నాలుగు భాగాల‌ను క్రోడిక‌రించి సినిమా చేయాల‌నుకున్నాం. మ‌ళ్ళీ వీటిలో ప్ర‌తి భాగాన్ని చిన్న చిన్న భాగాలుగా విడ‌గొట్టాం. అందులో రాజసూయ యాగం, 32 క‌త్తుల‌ను తీసుకుని రావ‌డం ఇలా చిన్న చిన్న పార్టులుగా విడ‌గొట్టాం. దుస్తులు ఎలా ఉండాల‌ని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. 
 
మొరాకోలో షెడ్యూల్ పూర్తి కాక‌ముందే చిలుకూరి వ‌ద్ద ఓడ సెట్ వేశాం. నేను ఇక్క‌డ‌కు రాగానే మూడు రోజులు రెస్ట్ తీసుకుని మ‌ళ్ళీ షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్క‌డ ఓడ ఫైట్ జ‌రుగుతున్న‌ప్పుడే ఓ యూనిట్ జార్జియా వెళ్లింది. మ‌రో యూనిట్ మ‌హేశ్వ‌రం వెళ్లింది. అందుకే నా టీం అంత‌టినీ మూడు యూనిట్స్‌గా విడ‌గొట్టాను. షూటింగ్ అయిన‌ప్ప‌టి నుండి ఎడిటింగ్ కూడా చేయించుకుంటూ వ‌చ్చాను. నా ద‌గ్గ‌రున్న రిసోర్స్‌ను చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నాను. ఈ ప్లానింగ్ వ‌ల్లే సినిమాను 79 రోజుల్లో పూర్తి చేశాం. సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌డానికి ముందే చాలా బ్యాక్‌గ్రౌండ్ వ‌ర్క్ జ‌రిగింది.
 
ఫోన్ పెట్టేయమన్నారటగా...
ఈ సినిమా ఇంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కులు ముందుకు రావ‌డానికి పంచ‌భూతాలు కూడా స‌పోర్ట్ చేశాయ‌ని బాల‌కృష్ణ‌గారు ఓ సంద‌ర్భంలో అన్నార‌. అది వంద శాతం నిజం. ఎందుకంటే దైవ కృప లేకుంటే మేం అనుకున్న‌ది అనుకున్న‌ట్లు పూర్త‌య్యేది కాదు. సినిమాకు ముందు రైతు అనౌన్స్‌మెంట్ జ‌ర‌గ‌బోతుంద‌ని తెలిసింది. అయితే బాల‌కృష్ణ‌గారితో ఈ క‌థ‌ను సినిమాగా చేయాల‌ని అప్ప‌టి నుండి అనుకున్నాను. మా నాన్న‌గారు ఈ క‌థ‌ను చెప్ప‌డానికి బాల‌కృష్ణ‌గారితో అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ స‌య‌మంలో నేను కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావుగారితో మాట్లాడ‌టం జ‌రిగింది. ఆయ‌న‌కు టైటిల్ చెప్ప‌గానే ఆయ‌న నువ్వు ఫోన్ పెట్టెయ్, నేను కాల్ చేస్తాన‌ని అన్నారు. అన్న‌ట్లుగానే పన్నెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే బాల‌కృష్ణ‌గారి నుండి అపాయింట్‌మెంట్ వ‌చ్చింది. అంతా అలా జ‌రిగింది.
 
త‌దుప‌రి చిత్రం?
త‌దుప‌రి చిత్రంగా వెంక‌టేష్‌గారి 75వ సినిమా చేస్తున్నాను. వెంక‌టేష్ మూవీ త‌ర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 26న "S3-య‌ముడు-3" విడుద‌ల‌