Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసు దోచే అమ్మాయి కానరాలేదు : హీరో రామ్‌ ఇంటర్వ్యూ

Advertiesment
hero ram interview
, సోమవారం, 28 డిశెంబరు 2015 (22:16 IST)
సినిమాల్లో ఒకరికి ఇద్దరిని ప్రేమించేసి వారి ప్రేమను పొందేయడం అనేది సినిమాటిక్‌. కానీ రియలస్టిక్‌గా అది జరగదు. ఎందుకంటే.. తన మనస్సు దోచే అమ్మాయి ఇంతవరకు కనపడలేదని.. హీరో రామ్ చెబుతున్నారు. ఇప్పటికే ఇంటిలో వారు పెండ్లి గురించి అడుగుతున్నా... ఇంకా నాకంటే ముందు ఇద్దరు వున్నారు. సో.. నాపై ఇంకా పూర్తిగా కానస్‌న్‌ట్రేషన్‌ చేయడంలేదని చెబుతున్నాడు. రామ్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా 'నేను శైలజ'. ఈ చిత్రం ద్వారా కిషోర్‌ తిరుమల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్రవంతి మూవీస్‌పై రివికిశోర్‌ నిర్మించారు. జనవరి 1 న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రామ్‌తో జరిపిన ఇంటర్వ్యూ..
 
తను.. శైలజ.. టైటిల్‌ ఏమిటి?
ఇది ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథ. ఆ కథను నేను నెరేట్‌ చేయడంతో టైటిల్‌ అలా పెట్టారు. చాలా కొత్తగా వుంటుంది. గతంలో చేసిన సినిమాలకంటే భిన్నంగా వుంటుంది.
 
ఈ చిత్రానికి హరికథ అని పేరు పెట్టి తర్వాత మార్చారు?
సినిమాలో నా పాత్ర హరి.. హరిగాడు చెప్పేకథ. అని ట్యాగ్‌లైన్‌ పెట్టాం.. ఇదేం పేరని.. ఫ్రెండ్స్‌. యూనిట్‌కూడా కొంత ఆశ్చర్యం ప్రకటించారు. వర్కింగ్‌ టైటిల్‌గా ఆ పేరు పెట్టేశాం. సినిమా పూర్తయ్యాక. పేరు మార్చాం. ఎలాగూ హరి.. చెప్పే కథ కనుగ.. నేను శైలజ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు డిసైడ్‌ చేశారు.
 
కథలో మిమ్మల్ని బాగా మెప్పించిన అంశాలు?
ఇది తండ్రి, కూతురు కథ. తండ్రిగా.. సత్యరాజ్‌, కుమార్తెగా కీర్తి సురేష్‌ నటించారు. వీరిద్దరి జీవితంలో హరి అనేవాడు ప్రవేశిస్తే కథ ఎలా మలుపు తిరిగింది అనేది ఆసక్తికరంగా వుంటుంది. సెంటిమెంట్‌ చాలా వుంది. ఫ్యామిలీ అంతా చూడతగ్గ సినిమా. డైలాగ్స్‌ కూడా కిశోర్‌ అద్భుతంగా రాసుకున్నాడు. ఎందుకంటే తను ముందుగా రచయిత.
 
'శివమ్‌' పోయింది. అంతకుముందు సినిమాలు పెద్దగా ఆడలేదు.. దీన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారు?
అనుకున్నంత సినిమా ఆడకపోతే.. ముందు బాధపడతాం. తర్వాత అలవాటు పడతాం. కొద్దిరోజుల తర్వాత.. మనం చేయగలిగింది ఏమీలేదు అనిపిపస్తుంది. అందుకే.. తర్వాత సినిమాపై శ్రద్ధ పెడతాం..
 
పెండ్లెప్పుడు చేసుకుంటారు?
అగుగుతున్నారండీ.. ఇంట్లోవారు.. ఏదో సందర్భంలో చెబుతూనే వుంటారు. కానీ.. నాకంటే ఇద్దరు పెద్దవాళ్లు వున్నారు. వారి గురించి ఆలోచించాక.. నా గురించి ఆలోచించడం అని చెప్పాను.. 
 
లవ్‌ మేరేజా? పెద్దల నిర్ణయమా?
నా జీవితంలో మనసుదోచే అమ్మాయి తారసపడలేదు. ఏదీ చెప్పలేను. ఏదీ మన చేతుల్లోలేదు.
 
ఈసారి న్యూఇయర్‌ ఎక్కడ వుంటారు?
గత ఏడాది నుంచే న్యూ ఇయర్‌.. విదేశాల్లో చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాను. అయితే ఈసారి.. నా సినిమా విడుదల కనుక.. ఇక్కడే వుంటాను.
 
కీర్తి సురేష్‌ ఎలా నటించింది?
ఆమె చాలా బాగా నటించింది. తెలుగుదనం ఉట్టిపడే లుక్స్‌ ఆమెలో వున్నాయి.
 
కొత్త చిత్రాలు?
ఏమీ అనుకోలేదు. సంతోష్‌శ్రీనివాస్‌.. కథ చర్చల్లో వుంది. ఎప్పుడు అవుతుందో చెప్పలేను అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu