Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతడు చెప్పేది ప్రజలు వినాలి... అది పవన్ చెబితేనే... వెంకటేష్ ఇంటర్వ్యూ

Advertiesment
gopala gopala venkatesh movie
, గురువారం, 8 జనవరి 2015 (16:14 IST)
అటు క్లాస్‌, ఇటు మాస్‌ చిత్రాలు ఏది చేసినా కుటుంబ సభ్యులతో హాయిగా చూసే చిత్రాల్లో నటిస్తూ మెప్పించే నటుడిగా వెంకటేష్‌కు పేరుంది. దాన్ని అలాగే కొనసాగిస్తూ సినీ కెరియర్‌ను సాగిస్తున్న ఆయన గతంలో మహేష్‌ బాబుతో కలిసి నటించాడు. తాజాగా పవన్‌తో 'గోపాల గోపాల'లో నటించాడు. ఈ చిత్రం 'ఓ మైగాడ్‌' చిత్రానికి రీమేక్‌.. ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతుంది. ఈ సందర్భంగా వెంకటేష్‌తో ఇంటర్వ్యూ వివరాలు.
 
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది? 
సింపుల్‌. సామాన్యుడి పాత్ర. దేవుడంటే నమ్మకం వుండదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల భక్తుడిగా ఎలా మారాడు? అన్నది తెరపైనే చూడాలి.
 
నిజ జీవితానికి విరుద్ధంగా వున్న పాత్ర కదా... ఎలా అనిపించింది? 
అవును. నిజ జీవితంలో దేవుడ్ని నమ్ముతాను. అది చిన్నతనం నుంచి నాన్నగారి ద్వారా అబ్బిందే. ఈ లోకంలో ఏదీ మనం చేయలేదు. అంతా చేసి పైవాడు పంపాడు. దాన్ని కాపాడుకోవాలి. దేవుడంటే భక్తి వుండాలి. భయం వుండకూదు. పిల్లలకు కూడా దేవుడిని ప్రేమించాలనేది తల్లిదండ్రులు నేర్పించాలి. అప్పుడే యోగ్యుడైన వాడుగా ఎదుగుతాడు. 
 
అది ఏ మతమైనా కావచ్చు.. దానివల్ల ఏ సమస్యవచ్చినా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఇది నేటి పిల్లల్లో కొరవడింది. చిత్రమేమంటే... ఇటీవలే నా కొడుకు అర్జున్‌... లైఫ్‌ ఈజ్‌ సో సింపుల్‌.. ప్రతిదీ లైట్‌గా తీసుకోవాలి నాన్న.. అంటూ చెప్పాడు. అంత పెద్ద సత్యాన్ని తను ఎలా చెప్పాడు అనేది ఆశ్చర్యమేసినా.. చిన్న వయస్సులో తల్లి కానీ, తండ్రి కానీ గురువుగానీ... వారి ప్రభావం వారిపై వుంటుంది.
 
పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చేశారు. అతని క్యారెక్టర్‌ ఎలా వుంటుంది? 
మేమిద్దరం కలిసి పది సంవత్సరాల క్రితమే ఓ సినిమా చేద్దామనుకున్నాం. అప్పట్లో మేమిద్దరం మా ప్రాజెక్ట్స్‌తో బిజీగా వుండటం వల్ల కుదరలేదు. ఈ ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే ఈ సినిమాలో నేను ఒక కామన్‌ మేన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. గాడ్‌గా నటించాలంటే ఒక మంచి ఇమేజ్‌ వున్న హీరో అయి వుండాలి. అతను చెప్పేది ప్రజలు వినాలి. అందుకే పవన్‌ కళ్యాణ్‌తో చెయ్యడం జరిగింది. ఇది పవన్‌కి యాప్ట్‌ ఫిలిమ్‌ అని నేననుకుంటున్నాను. తన క్యారెక్టర్‌ని చాలా బాగా చేశాడు. రెగ్యులర్‌గా వచ్చే కమర్షియల్‌ ఫిలిమ్‌లా కాకుండా అతని బాడీ లాంగ్వేజ్‌లో కూడా చాలా డిఫరెన్స్‌ వుంటుంది. 
 
అనూప్‌ మ్యూజిక్‌ ఎలా వచ్చింది? 
ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్‌ అవసరమో అలాంటి మ్యూజిక్‌ ఇచ్చాడు. మూఢ నమ్మకాల మీద వచ్చే పాట, భగవద్గీత మీద పాట చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌తో చేసిన భజే భజే పాట చాలా బాగా వచ్చింది. అలాగే రీ-రికార్డింగ్‌ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తనకి కూడా రెగ్యులర్‌ సినిమాల్లా కాకుండా ఒక డిఫరెంట్‌ మ్యూజిక్‌ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాకి మ్యూజిక్‌ చేసి టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకునే అవకాశం అతనికి వచ్చింది. ఎన్నో మంచి సినిమాలకు మ్యూజిక్‌ ఇచ్చిన అనూప్‌ ఈ సినిమాకి ది బెస్ట్‌ మ్యూజిక్‌ చేశాడు.
webdunia

 
ఇద్దరు స్టార్స్‌ ఈ సినిమాలో కలిసి చేశారు. ఫ్యాన్స్‌ని ఎలా శాటిస్‌ఫై చేయబోతున్నారు? 
నేను ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తున్నాను, పవన్‌ ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తున్నాడనే విషయంలో ఫ్యాన్స్‌ చాలా క్లియర్‌గా వున్నారు. అందులో కాంపిటిషన్‌ ఏమీ లేదు. రెగ్యులర్‌గా వచ్చే కమర్షియల్‌ సినిమా కాదు. ఇది కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ. ఒక కామన్‌ మ్యాన్‌ దేవుడి మీద కేసు వేస్తాడు. ఈ విషయంలో క్లారిటీ వుండటం వల్ల ఒక కొత్త తరహా సినిమా చూస్తున్నామని వాళ్ళు కూడా ఫీల్‌ అవుతారు.
 
హిందీలో పరేష్‌ రావల్‌ పాత్ర మీరు పోషించారు. స్టార్‌ హీరోగా ఏవైనా మార్పులు చేశారా? 
నేను స్టార్‌ హీరో అని ఎవరన్నారు. మీరే పేర్లు పెట్టేస్తున్నారు. నేను నటుడ్ని మాత్రమే. రకరకాల పాత్రల్లో కన్పిస్తాను. స్టార్‌ అనే మాట.. మన సెన్స్‌లో వున్నప్పుడే గుర్తుంటాయి. నిద్రపోయాక.. ఏ స్టార్‌ లేడు.. గీరూలేడు. మనమెవరో మనక్కూడా నిద్రలో తెలీదు. అలా కాసేపు వచ్చి వెళ్లిపోయే ఈ స్టార్‌ను నమ్మను. 
 
ఆకట్టుకున్న సన్నివేశం ఏమైనా వుందా? 
ఈ స్క్రిప్ట్‌ గ్రాఫ్‌ చాలా బాగుంటుంది. ప్రతి సీన్‌ చాలా బాగా వచ్చింది. పర్టిక్యులర్‌గా ఒక సీన్‌ గురించి చెప్పాలంటే కష్టం. ఇందులో నా క్యారెక్టరే చాలా విభిన్నంగా వుంటుంది. దేవుడి మీద కేసు వేస్తాను. దాంతోనే తెలిసిపోతుంది కదా నా క్యారెక్టర్‌ ఎలాంటిదో. ఇది ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌ కావడం వల్ల ప్రతి సీన్‌ విభిన్నంగానే వుంటుంది. ప్రతి సీన్‌ అందరికీ నచ్చేలా వుంటుంది.
 
బాలకృష్ణ, నాగార్జునలాంటి హీరోలతో కూడా కలిసి చేస్తారా? 
తప్పకుండా చేస్తాను. నేను ఇంతకుముందే చెప్పాను ఎవెంజర్స్‌ లాంటి సినిమా చెయ్యాలని. పది మంది హీరోలు వరసగా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో వుండే పోస్టర్‌ వేస్తే ఎలా వుంటుంది? పది మంది కలిసి ఒక సినిమా చేస్తే ఒక్కొక్కరికి పది నిముషాల క్యారెక్టర్‌ వుంటుంది. ఎవరికి ఎంత క్యారెక్టర్‌ వుందీ, ఫ్యాన్స్‌ ఎలా ఫీల్‌ అవుతారు అనేది ఆలోచిస్తే ఎలా? అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. 
 
మల్టీస్టారర్‌ అంటే ఇద్దరేనా.. ఎంతమందితోనైనా చేస్తారా? 
కింగ్‌లో నాగార్జునగారు ఓ పాటలో హీరోయిన్లతో నటించారు. అక్కడ ఆ సన్నివేశం కుదిరింది. పదిమంది వరకు హీరోయిన్లు వున్నారు. ఒకరిద్దరు నటించాలంటేనే కథ దొరకడం లేదు. ఎక్కువమందితో కలిసి చేయాలంటే.. కథ సిద్ధంగా వుంటే పది మంది హీరోలతో కలిసి చేయడానికి రెడీగా వున్నాను అని ముగించారు.
 

Share this Story:

Follow Webdunia telugu