Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు పెళ్ళయి, పిల్ల కూడా వుందన్నారు : అంజలి ఇంటర్వ్యూ

Advertiesment
anjali interview
, సోమవారం, 11 జనవరి 2016 (19:35 IST)
'జర్నీ' సినిమాలో హీరోను డామినేట్‌ చేస్తూ ప్రవర్తించే పాత్రలో 'ఈ అమ్మాయి చాలా స్పీడే' అనిపించేంతగా పేరు తెచ్చుకున్న నటి అంజలి. నిజజీవితంలోనూ అంతే హుషారుగా.. చురుగ్గా వుంటానని చెబుతోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎప్పుడో చేసినా ఇంకా అందులోని పాత్ర గురించే చర్చించుకోవడం.. నటిగా ధన్యమైందని చెబుతుంది. 'గీతాంజలి', శంకరాభరణం వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ అంజలి. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం అంజలి ప్రధాన పాత్రలో నటించిన 'డిక్టేటర్‌' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ అంజలితో ఇంటర్వ్యూ.
 
మీ కళ్ళు కొత్తగా కన్పిస్తున్నాయే?
డిక్టేటర్‌ సినిమా కోసం బ్లూ ఐస్‌ వుండేలా పాత్ర కోసం దర్శకుడు అలా పెట్టారు. ఇంకా రిలీజ్‌ కోసం పబ్లిసిటీలో కూడా అలాగే వుండాలని ఇలా వచ్చేశా.
 
సినిమాలో ఎలా కన్పించబోతున్నారు?
ఇంతవవరకు నటించిన చిత్రాల్లో ఒక విధంగా కనిపిస్తే ఈ సినిమాలో మాత్రం నా లుక్‌, హెయిర్‌ స్టైల్‌ మొత్తం కొత్తగా కనిపించాలని శ్యాం కె నాయుడు చాలా కేర్‌ తీసుకొని చూపించారు. ఆఫీస్‌కు వెళ్ళే అమ్మాయి పాత్ర.
 
బాడీ కూడా తగ్గినట్లుందే?
ఈ పాత్ర కోసం ఐదున్నర కేజీలు తగ్గాను.
 
అంతకుముందు 'చిత్రాంగద' చిత్రం కోసం 7 కేజీలు తగ్గానన్నారు?
అవును. అది ఏడాదిన్నర మాట. ఆ సినిమా ఎప్పుడో పూర్తయింది. తర్వాత బాడీ మామూలు స్థితికి వచ్చింది. మళ్ళీ డిక్టేటర్‌ కోసం తగ్గాను.
 
సీనియర్‌ నటుడు బాలకృష్ణతో చేయడం భయమనిపించలేదా?
ఆయన గురించి చాలామంది భయపెట్టారు. అందుకే ఆయనతో సినిమా అంటే మొదట చాలా టెన్షన్‌ పడ్డాను. పెద్ద స్టార్‌ హీరో ఆయనతో సమానంగా నటించగలనా! అనే భయం ఉండేది. కానీ లొకేషన్‌లో ఆయన ప్రవర్తించిన విధానం.. బయట విన్నది విరుద్ధంగా అనిపించింది. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.
 
ఏం నేర్చుకున్నారు?
కో-స్టార్‌కు మంచి గౌవరం ఇస్తారు. సెట్స్‌లో ఉండే లైట్‌ మ్యాన్‌ నుండి అందరిని బాగా చూసుకుంటారు. ఆయనతో క్రమశిక్షణ, నిబద్ధత ఎక్కువ. ఆయన దగ్గర నుండి క్రమశిక్షణ నేర్చుకున్నాను. సెట్స్‌కి చెప్పిన సమయానికి వచ్చేసేవారు.
 
మిమ్మల్ని అలనాటి సావిత్రితో పోల్చారు. ఎందుకంటారు?
ఆ మాట వినగానే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడం పూర్తయిన తరువాత బాలయ్యగారు వచ్చి బాగా నటించావని చెప్పారు. ఓ సీన్‌లో నటించాక.. సెట్‌లోని వారంతా.. బ్రహ్మాండంగా చేశావ్‌! అని మెచ్చుకున్నారు. ఎటువంటి సన్నివేశాన్నైనా ఈజీగా చేసేస్తావని దర్శకులూ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను.
 
ఈ సినిమాలో ఛాన్స్‌ ఎలా వచ్చింది?
బాలకృష్ణ గారితో ఇంతకుముందే రెండు చిత్రాలు చేయాల్సింది. కుదరలేదు. 'లెజెండ్‌', 'లయన్‌' సినిమాలు నేనే చేయాల్సింది. కాని డేట్స్‌ కుదరక చేయలేకపోయాను. బోయపాటి శ్రీనుగారు లెజెండ్‌లో రాధికాఆప్టే పాత్ర గురించి చెప్పారు. అప్పుడు తమిళ చిత్రాల్లో బిజీగా వుండటంతో కుదరలేదు. ఈ సినిమా మిస్‌ చేయకూడదనే ఒప్పుకున్నాను. స్టొరీ కూడా నాకు బాగా నచ్చింది.
 
అందుకే ఇప్పుడు బోయపాటి సినిమాలో ఐటంసాంగ్‌ చేస్తున్నారా?
అది ఐటంసాంగ్‌ కాదు. కథకు కీలకం. అల్లు అర్జున్‌కు ఎంత ప్రాధాన్యత వుంటుందో ఆ సీన్‌లో నా పాత్రకూ అంతే వుంటుంది. నా పాత్ర ప్రాధాన్యతతో పాటు ఓ పాట వస్తుంది. ఇది ఐటం సాంగ్‌ కాదు.
 
సాంగ్‌కు పారితోషికం కూడా బాగానే తీసుకున్నారని తెలిసింది?
మంచి రెమ్యునరేషన్‌ అంటే మనకు మార్కెట్‌ ఉన్నప్పుడే ఇస్తారు. అలానే మనం కూడా డిమాండ్‌ చేయగలం. మార్కెట్‌ తగ్గిపోతే నిర్మాతలు కూడా ఇవ్వరు కదా.. నాకు కథ నచ్చి నా పాత్ర నచ్చితే తక్కువ బడ్జెట్‌ సినిమా అయినా రెమ్యునరేషన్‌ విషయంలో కన్సిడర్‌ చేస్తాను.
 
తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎక్కువకాలం వుండరు. మీరు బాగానే చేస్తున్నారు?
అది కరక్టే. తెలుగు అమ్మాయిలు ఎక్కువ కాలం వుండరు. దానికి కారణం.. కొన్ని పరిధులు ఉండటం వలన, మంచి ప్లాట్‌ఫాం క్రియేట్‌ చేసుకోలేకపోవడం వలన అవకాశాలు తగ్గుతున్నాయి. అంతేకాని తెలుగమ్మాయిలు నిలబడలేకపోతున్నారని అనలేం. నన్ను ఇండస్ట్రీలో అందరూ ప్రోత్సహిస్తునే ఉంటారు. ఇండస్ట్రీలో నేను లాంగ్‌ జర్నీ చేయడానికి కారణం కథల విషయంలో పర్టిక్యులర్‌గా ఉండడమే. ఒకేసారి 10 సినిమాలు చేయడం నాకు నచ్చదు. గట్టిగా ఒక సినిమానే చేయాలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేసి నాలుగు సంవత్సరాలయ్యింది. కాని ఇంకా ఆ సినిమాను ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారు. అలా గుర్తుండిపోయే పాత్రల్లోనే నటించాలనుకుంటాను. నేను తెలుగమ్మాయి అయినా.. తమిళంలో మొదట గుర్తింపు వచ్చింది. ఆ తర్వాతే తెలుగులో అవకాశాలు వచ్చాయి.
 
మీపై గతంలో విమర్శలువచ్చాయి. కొన్నాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎలా సాల్వ్‌ చేసుకున్నారు?
ప్రతి కుటుంబంలో వున్న గొడవలే నాకూ వున్నాయి. అయితే నేను ఫెమిలియర్‌ కావడంతో ఫోకస్‌ అంతా నాపైనే పెట్టారు. పూర్తిగా గొడవలు తగ్గలేదు కానీ.. దానికి కొంత టైం పడుతుంది.
 
విమర్శలు ఎలా స్వీకరిస్తారు?
మొదట్లో చాలా బాధపడ్డాను. కానీ అలా బాధపడిపోయి సినిమాలను పక్కన పెట్టేయలేను కదా. నా శ్రేయోభిలాషులు, స్నేహితులు కాంట్రవర్సీలు వస్తే మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఉంటుందని చెప్పేవారు. అందులో కూడా మంచినే తీసుకుంటాను. నేను బాధపడినప్పుడు మాత్రం ఫ్రెండ్స్‌తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను.
 
సినిమాపై ప్రభావం చూపుతాయిగదా. దాన్ని మర్చిపోవడానికి ఏం చేస్తారు?
నేను బాధపడి.. ఆ తర్వాత షూటింగ్‌కు వెళితే.. మొత్తం చెడిపోతుంది. అందుకే స్నేహితులతో షేర్‌ చేసుకుని.. వారి ధైర్యంతో ముందుకు సాగుతాను. ఒకసారి షూటింగ్‌కు వెళితే.. పర్సనల్‌ గురించి ఆలోచించను. ఇందుకోసం ప్రత్యేకమైన కేర్‌ తీసుకోను. మైండ్‌ను కంట్రోల్‌ చేసుకుంటాను.
 
మీకు ప్రముఖ వ్యక్తితో పెళ్ళయిందని వార్తలు వచ్చాయి?
అవి విని నవ్వుకున్నాను. నాకు బిడ్డ కూడా పుట్టిందని రాశారు. ఓంకార్‌తో ఎఫైర్‌ వుందన్నారు. అసలు ఆయన ఎవరో తెలీదు కూడా.
 
శంకరాభరణం.. పాత్ర ప్లస్సా? మైనసా?
అందులో లేడీ డాన్‌గా చేసిన తీరు.. విమర్శకులను సైతం మెప్పించింది. ఆ సినిమాలో అంజలి బాగా చేసిందని రివ్యూలు కూడా రాశారు..
 
దర్శక నిర్మాతగా శ్రీవాస్‌ ఎలా ప్రవర్తించారు?
ఈ సినిమాకు శ్రీవాస్‌ గారు దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. రెండు పనులు చేయగలిగే సామర్ధ్యం ఆయనలో ఉంది. ఒక్కోసారి నిర్మాతగా చెబుతున్నారా. దర్శకుడిగా చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. అయితే ప్రతి విషయంలో పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఆడియన్స్‌ థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలనే విషయాన్ని మైండ్‌లో పెట్టుకొని సినిమా తీశారు. సినిమా అంతా రిచ్‌గా కనిపించాలని బాగా ఖర్చుపెట్టారు.
 
తోటి హీరోయిన్స్‌తో పోటీ ఎలా వుంది?
నా తోటి హీరోయిన్స్‌తో నేనెప్పుడు గొడవపడను. అందరితో చాలా స్నేహంగా ఉంటాను. ఈ చిత్రంతో సోనాల్‌తో కలిసి పని చేశాను. తను కూడా నాకు మంచి ఫ్రెండ్‌ అయిపోయింది.
 
మీ పాత్రకు మీరే డబ్బింగ్‌ చెప్పుకుంటారా?
ప్రస్తుతానికి తెలుగు, తమిళ చిత్రాలకు నేనే డబ్బింగ్‌ చెబుతున్నాను. కన్నడ కూడా ట్రై చేశాను కాని కుదరలేదు.
 
బయట కూడా ఇంత ఫాస్ట్‌గా వుంటారా?
నిజ జీవితంలో నాది హైపర్‌ క్యారెక్టర్‌. డల్‌గా ఉండడం అస్సలు నచ్చదు. జర్నీ చిత్రంలో నేను ఎలా వున్నానో. అలాగే సీతమ్మ వాకిట్లో.. ఎలా వున్నానో.. అది నా ఒరిజినల్‌ పాత్ర. సెట్స్‌లో ఎప్పుడైనా కామ్‌గా కుర్చున్నానంటే అందరూ ఎందుకు అలా ఉన్నావని అడుగుతూనే ఉంటారు. ఉన్నది ఒక్కటే జీవితం సంతోషంగా ఉండాలనేదే నేను నమ్ముతాను.
 
'చిత్రాంగద' ఆలస్యానికి కారణం?
'చిత్రాంగద' సినిమా పూర్తయింది. జోహాన్స్‌బర్గ్‌లో కొన్ని సీన్లు చేశారు. దానికి తగినట్లుగా.. కొన్ని సీన్స్‌ లింక్‌ చేస్తూ.. ఇక్కడ తీయాలి. గ్రాఫిక్స్‌ ముఖ్యం. దాని గురించి ఆలస్యమైంది. క్రిస్మస్‌ కానుకగా డిశంబర్‌లో రిలీజ్‌ చేయాల్సింది, కాని చాలా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయని రిలీజ్‌ డేట్‌ ఫిబ్రవరికి వాయిదా వేశారు.
 
మలయాళం మమ్ముట్టితో సినిమా చేస్తున్నారే?
ఇప్పుడు నటించబోయేది రెండో సినిమా. అది తమిళ్‌.. మలయాళంలో కూడా వస్తుంది. ఇది కాకుండా మలయాళంలో మరో సినిమాలో నటిస్తున్నాను.
 
తెలుగులో ఏమైనా కమిట్‌ అయ్యారా?
తెలుగులో రెండు కథలు విన్నాను. అవి సైన్‌ చేయాలనుకుంటున్నాను. అయ్యాక చెబుతాను అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu