Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈజీగా ఎంటరయ్యా... తర్వాతే కష్టమైంది: ''తుంగభద్ర'' హీరో ఆదిత్‌

Advertiesment
chitchat with Tungabhadra Movie Adith
, బుధవారం, 18 మార్చి 2015 (21:23 IST)
పుట్టింది కోయంబత్తూర్‌ అయినా ఆంధ్రప్రదేశ్‌లో పెరిగి.. మళ్ళీ చెన్నైలో కాలేజీ చదివి నటుడిగా ఎదిగినవాడు హీరో ఆదిత్‌. కాలేజీలో పలు నాటకాలు ఆడిన అనుభవంతో సినిమారంగంపై మక్కువతో ఇందులో ప్రవేశించానని అంటున్న ఆదిత్‌.. తొలి సినిమా 'కథ'. ప్రస్తుతం 'తుంగభద్ర' చిత్రంలో నటించాడు. ప్రమోషన్‌లో ఇది తమిళ వాసన ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతుంది. వారాహి చలనచిత్రం పతాకంపై ఆదిత్‌, డిరపుల్‌ జంటగా సాయిశివాని సమర్పణలో శ్రీనివాస కృష్ణ గోగినేని దర్శకత్వంలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్‌తో ఇంటర్వ్యూ.

 
ట్రైలర్‌లో తమిళ నేటివిటీ కన్పిస్తుంది. ఇది తమిళ సినిమానా? 
కాదు. స్ట్రెయిట్‌ తెలుగు సినిమా. తమిళ నటులు వుండడంతో అలా అనిపిస్తుంది. గెడ్డం వున్న వ్యక్తులు ఇందులో నటించారు. సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు. ఇది పూర్తి గుంటూరు పల్నాడులో చిత్రించారు. ఎండలో 40 రోజుల పాటు అక్కడ షూటింగ్‌ చేశారు. 
 
ఈ చిత్ర కథ ఎప్పటిది? 
గతంలో సెల్‌ ఫోన్‌ అందుబాటులో లేని పీరియడ్‌ని ఈ కథ కోసం ఎంచుకున్నాం. కథకు అనుకూలంగానే వుంటుంది. అందుకే ఏ సంవత్సరంలోని కథ అనేది మెన్షన్‌ చెయ్యలేదు. 
 
మీ నేపథ్యం గురించి? 
మాది కోయంబత్తూర్‌. మా నాన్నగారు బ్యాంక్‌లో వర్క్‌ చేస్తారు. మేం మైగ్రేట్‌ అయి హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యాం. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని గాంధీనగర్‌, హిమాయత్‌ నగర్‌లలో నేను పెరిగాను. కొన్నాళ్ళు గుంటూరులో కూడా వున్నాను. ఆ తర్వాత వైజాగ్‌లో టెన్త్‌, ఇంటర్‌ చదివాను. చెన్నైలో బి.ఎ. జర్నలిజమ్‌ అండ్‌ ఫోటోగ్రఫీలో డిగ్రీ తీసుకున్నాను. కాలేజీలో టీమ్స్‌ వుంటాయి కదా. నేను థియేటర్‌ టీమ్‌లో చేరాను. అక్కడ రజానీ గారు మాకు కోచింగ్‌ ఇచ్చారు. డ్రాయింగ్‌, మ్యూజిక్‌ నేర్చుకున్నట్టుగా యాక్టింగ్‌ ఒక ప్యాషన్‌తో నేర్చుకున్నాను. అది ఇప్పుడు ఫుడ్‌ పెడుతుందని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. 
 
తుంగభద్ర అంటే ఏమిటి? 
తుంగ, భద్రావతి అనే రెండు నదులు కలిసి తుంగభద్రగా ప్రవహిస్తుంది. నదులు కలుస్తాయి కానీ వాటి పక్కన వున్న మనుషులు కలవరు అనే ఒక కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే కథ. దాంట్లో ఓ లవ్‌ స్టోరీ కూడా వుంటుంది. ఆ రెండు వర్గాల వల్ల ఏం జరిగింది అనేది కథ.
 
'వీకెండ్‌ లవ్‌' తర్వాత సరైన సినిమా అనుకుంటున్నారా?  
'కథ' సినిమా చేసిన తర్వాత నన్ను నేను చూసుకుంటే నాకు నచ్చలేదు. తర్వాత తమిళ హ్యాపీడేస్‌ చేసినపుడు ఈ సినిమా అయితే నాకు కరెక్ట్‌ అనిపించింది. అందుకే తమిళ్‌ సైడ్‌ వెళ్ళాను. ఆ తర్వాత వీకెండ్‌ లవ్‌ తెలుగు సినిమా చేశాను. కానీ అదీ నిరాశపర్చింది. కానీ తుంగభద్ర సినిమా చాలా కరెక్ట్‌ కాన్సెప్ట్‌ అనిపించింది. దీని కోసం చాలా కష్టపడ్డాను.
 
సినిమారంగం ఎలా అనిపిస్తుంది? 
సినిమాల్లోకి రావాడానికి చాలా మంది కష్టపడతారు. నేను చాలా ఈజీగా వచ్చేశాను. కానీ ఆ తర్వాత మాత్రం చాలా కష్టమైంది. ఎవర్ని అడగాలో.. ఏమి అడగాలో తెలీదు. ఏదైనా డెస్టినీని నమ్ముతాను. దాని ప్రకారమే అది జరుగుతుంది. నేను ఊహించని బేనర్‌లో తుంగభద్ర చేశాను. మంచి పేరు వస్తుంది ఆశిస్తున్నా.
 
డింపుల్‌ను మీరు సజెస్ట్ చేశారని తెలిసింది? 
హీరోగా నన్ను అనుకున్నప్పుడు.. కథానాయికగా మరో అమ్మాయిని అనుకున్నారు. కానీ ఆమెకు ఒకేసారి 45 రోజులు డేట్స్‌ కుదరలేదు. వీకెండ్‌ లవ్‌, లవర్స్‌ చిత్రాల్లో డింపుల్‌ నటించింది. ఆమె అయితే బాగుంటుందని చెప్పాను. వెంటనే వారు అప్రోచ్‌ అవ్వమన్నారు. అంతకంటే మా ఇద్దరి మధ్య పెద్ద పరిచయం లేదు.
 
తదుపరి చిత్రాలు? 
తెలుగు, తమిళ్‌లో ఒక సినిమా జరుగుతోంది. తెలుగులో 'నీవైపే' పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన టీజర్‌ కూడా రిలీజ్‌ అయింది. హెచ్‌.ఎఫ్‌.ఆర్‌. అనే టెక్నాలజీతో ఈ సినిమా చేస్తున్నాం. చాలా పెద్ద సినిమా. కంప్లీట్‌ అవడానికి ఓ సంవత్సరం పడుతుంది. అది కాకుండా డి.ఎస్‌.రావుగారికి ఒక సినిమా చేస్తున్నాను అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu