Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీతి గలవాడే నాకు ఆదర్శం: చిరంజీవి మినీ ఇంటర్వ్యూ

మెగాస్టార్‌ చిరంజీవి దేశంలో సామాజిక న్యాయం లేదనీ.. అది జరగాలనేది తన కోరికని వెల్లడించారు. తాజాగా ఆయన సీని జీవితం 150 చిత్రాలపై 'మెగా చిరంజీవితం 150.. సినీ ప్రస్థానం' పేరిట సీనియర్‌ జర్నలిస్టు పసుపులేటి రామారావు రాసిన పుస్తకంలో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయ

నీతి గలవాడే నాకు ఆదర్శం: చిరంజీవి మినీ ఇంటర్వ్యూ
, సోమవారం, 23 జనవరి 2017 (20:08 IST)
మెగాస్టార్‌ చిరంజీవి దేశంలో సామాజిక న్యాయం లేదనీ.. అది జరగాలనేది తన కోరికని వెల్లడించారు. తాజాగా ఆయన సీని జీవితం 150 చిత్రాలపై 'మెగా చిరంజీవితం 150.. సినీ ప్రస్థానం' పేరిట సీనియర్‌ జర్నలిస్టు పసుపులేటి రామారావు రాసిన పుస్తకంలో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఆయన మాటల్లోనే...
 
రాజకీయంగా మీ టార్గెట్‌ ఏమిటో తెలుసుకోవాలనుంది?
ప్రజలకు ఇంకా మెరుగైన నాణ్యమైన జీవితాన్ని అందించాలన్నదే నా టార్గెట్‌. మనకున్న వనరులు, మనకున్న సహజ సంపద చూసుకుంటే ప్రజలు ఇంత అధ్వాన్న స్థితిలో వుండే అవకాశం లేదు. సంపాదించేవాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులైపోతున్నారు. పేదవాళ్లు ఇంకా నిరుపేదలుగానే వున్నారు. అంతరాలు తగ్గిపోవాలంటే సహజమైన సంపద, వనరులు అందరికీ సమపాళ్ళలో అందాలి. అవి చేయాలంటే సామాజిక న్యాయం జరగాలి. నా లక్ష్యం అదే.
 
రాహుల్‌ గాంధీ సమక్షంలోనే మీరు కాంగ్రెస్‌లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వున్నాయి?
సోనియా గాంధీ సమక్షంలో చేరకపోవడానికి కారణాలు తెలిసిందే. దానిపై భిన్నాభిప్రాయం వుంటుందని నేను అనుకోవడంలేదు. రాహుల్‌ గాంధీ సమక్షంలో చేరటం అందరికీ ఆమోదయోగ్యంగా వుంటుందని చేరాను.
 
రాజకీయాల్లో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే వ్యక్తి ఎవరు?
ఒళ్లు దాచుకోకుండా కష్టపడి తన బాగుతోపాటు పదిమంది బాగుండాలని కోరుకోనేవారెవరైనా సరే.. నీతి నిజాయితీలకు కట్టుబడి సమాజ శ్రేయస్సు తన శ్రేయస్సుగా భావించే ఏ వ్యక్తయినా నాకు ఆదర్శనమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహానటుడి నటవిశ్వరూపం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం : క్రిష్ లేఖ