Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల్‌ని ముద్దు పెట్టుకోవడం అక్కడ చాలా అవసరం: మధుశాలిని ఇంటర్వ్యూ

Advertiesment
cheekati rajyam movie madhu shalini interview
, మంగళవారం, 24 నవంబరు 2015 (17:07 IST)
యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌, శ్రీగోకులం మూవీస్‌ పతాకాలపై రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'చీకటి రాజ్యం'. ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్‌తో సూపర్‌హిట్‌ చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో మధుశాలిని నటించింది. 'చీకటిరాజ్యం' విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో నటి మధుశాలిని చిత్రంలోని తన పాత్ర గురించి, తన పెర్‌ఫార్మెన్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ గురించి మాట్లాడారు. 
 
కమల్ గారితో నటించడంపై మీ ఫీలింగ్...? 
నవంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రానికి మీడియా ద్వారా చాలా పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రావడం వల్ల సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. నేను నటించిన ఒక తెలుగు సినిమాలో నా క్యారెక్టర్‌కి ఇంత మంచి ఫీడ్‌ బ్యాక్‌ రావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. కమల్‌ హాసన్‌గారు చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఒక స్ట్రెయిట్‌ మూవీ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఆయన్ని చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ రాజేష్‌గారు కమల్‌ హాసన్‌గారితో ఏడు సంవత్సరాలు ట్రావెల్‌ చేశారు. డైరెక్టర్‌గా ఆయనకిది మొదటి సినిమా. ఈ సినిమాతో డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు రాజేష్‌గారు. ఇలాంటి మంచి సినిమాలు ఆయన ఇంకా ఎన్నో చెయ్యాలి, నాకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలు అనేవి లేకపోయినా మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమా అంతా చాలా గ్రిప్పింగ్‌గా వుంది. మంచి సినిమా ఏదైనా మనం ఆదరిస్తాం. ఈ సినిమా ఒక డిఫరెంట్‌ జోనర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌.
 
ముద్దు సీన్ గురించి... 
ఈ సినిమాలో కమల్‌ హాసన్‌గారితో ముద్దు సీన్‌లో నటించాను. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్‌ అంటే అది ఒక రొమాంటిక్‌ సీన్‌లో చూపిస్తుంటారు. కానీ, ఈ సినిమాలో కమల్‌గారిని ముద్దు పెట్టుకోవడం అనేది కథకి అవసరం. ఆయన సినిమాల్లో ఏదైనా కథతోనే వెళ్తుంది. ఏ సీన్‌ అయినా కథలో వుండాలి కాబట్టే పెడతారు. సినిమా చూసిన వాళ్ళందరికీ కమల్‌గారితో ముద్దు సీన్‌ కన్విన్సింగ్‌గానే అనిపించింది. దీన్ని ఎవరూ పిన్‌పాయింట్‌ చేయలేదు. 
 
చాలామంది అమ్మాయిల్ని చూసినా మిమ్మల్నే ఎందుకు సెలక్ట్ చేశారు...?
కమల్‌హాసన్‌గారంటే నాకు చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఒక సినిమాకి ఆడిషన్స్‌ చేస్తున్నారని నా ఫ్రెండ్‌, హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌ చెప్పింది. కమల్‌గారు చాలా మంది అమ్మాయిల్ని చూశారు. పర్టిక్యులర్‌గా నన్నే ఎందుకు సెలెక్ట్‌ చేసుకున్నారంటే ఉత్తమ విలన్‌ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినపుడు ఆయన్ని కలవడం జరిగింది. ఆయన వెంటనే తన సినిమాలో నన్ను తీసుకోవడానికి ఓకే చెప్పారు. అప్పుడు నాకు ఆ క్యారెక్టర్‌కి వున్న ఇంపార్టెన్స్‌ గురించి తెలిసింది.
 
కమల్‌గారితో నటించడం మీకు ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది...?
కమల్‌గారు ఏదైనా చాలా ఈజీగా చేసేస్తుంటారు. కానీ, నాకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఆయన ఇప్పటికి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చేసినప్పటికీ ఇదే తన మొదటి సినిమా అనే జీల్‌తో చేస్తారు. తన క్యారెక్టర్‌ గురించే కాకుండా సినిమాలో నటించే ఇతర క్యారెక్టర్స్‌ కూడా ఎంత ఔట్‌పుట్‌ ఇవ్వొచ్చు అనేది చెప్తూ మా అందరికీ చాలా హెల్ప్‌ఫుల్‌గా వున్నారు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను నటించడం అనేది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని కలిగించింది.
 
ఇతర చిత్రాల గురించి వివరాలు... 
నేను చేయబోయే తదుపరి చిత్రాలు తమిళ్‌, మలయాళంలలో వున్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాకు నచ్చిన క్యారెక్టర్‌ రాకపోవడం వల్ల చెయ్యలేకపోతున్నాను అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu