Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా 500 పాటల నుంచి టాప్ 10 చెప్పమంటే... చక్రి ఇంటర్వ్యూ 4

నా 500 పాటల నుంచి టాప్ 10 చెప్పమంటే... చక్రి ఇంటర్వ్యూ 4
, సోమవారం, 15 డిశెంబరు 2014 (23:02 IST)
మర్చిపోలేని మైలురాయి!
2003లో నేను మొత్తం 18 సినిమాలకు సంగీతం అందించగా.. వాటిలో 13 చిత్రాలు విడుదలై సంగీత దర్శకుడిగా నా పేరు మారుమ్రోగేలా చేశాయి. ఆ 13 చిత్రాలు వరుసగా... 
1. తొలి చూపులోనే, 2. అమ్మాయిలు- అబ్బాయిలు, 3. వీడే, 4. దొంగరాముడు అండ్‌ పార్టీ,  5. నేను సీతామహాలక్ష్మి, 6. ఆంధ్రావాలా, 7. శివమణి (98480 22338), 8. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా, 9.  అందరూ దొంగలే (దొరికితే), 10. నేను పెళ్ళికి రెడీ, 11. 143, 12. పెదబాబు, 13. సోగ్గాడు!
 
ఇప్పటివరకు నేను చేసిన 99 సినిమాల్లో 'టాప్‌-10' నన్ను సెలక్ట్‌ చేయమని అడగడమంటే.. కచ్చితంగా కావాలని నన్ను ఇబ్బంది పెట్టడమే. కానీ 'చెప్పి తీరాల్సిందే'నని మీరు 'పెన్ను పట్టుకుని' గట్టిగా అడుగుతున్నారు కాబట్టి.. (పెద్దగా నవ్వుతూ) వరుసగా ఈ సినిమాల పేర్లు చెబుతాను.
1. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం  దర్శకుడు: పూరి జగన్నాధ్‌
2. ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు దర్శకుడు: వంశీ
3. ఇడియట్‌- దర్శకుడు: పూరి జగన్నాథ్‌
4. సత్యం        దర్శకుడు: సూర్యకిరణ్‌
5. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి దర్శకుడు: పూరి జగన్నాథ్‌
6. దేశముదురు    దర్శకుడు: పూరి జగన్నాథ్‌
7. దేవదాస్‌       దర్శకుడు: వైవిఎస్‌ చౌదరి
8. నేనింతే        దర్శకుడు: పూరి జగన్నాథ్‌
9. కృష్ణ          దర్శకుడు: వి.వి.వినాయక్‌
10. సింహా       దర్శకుడు: బోయపాటి శ్రీను శ్రీ
 
ఇప్పటి వరకు నేను స్వరపరిచిన సుమారు 500 పాటల నుంచి.. 'టాప్‌-10' సాంగ్స్‌ సెలక్ట్‌ చేయడం మరింత కష్టమైన పని. అయితే చెప్పమని పట్టుబడుతున్నారు కాబట్టి దిగువ పాటల్ని పేర్కొంటున్నాను. నా పర్సనల్‌ టేస్ట్‌ను బట్టి కాకుండా.. ప్రేక్షకాదరణ పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్‌ చెబుతున్నాను.
1. మళ్ళి కూయవే గువ్వా (ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం)
2. నీవే నీవే నేనంట (అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి)
3. వెన్నెల్లో హాయి హాయి (ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు)
4. ఓ మగువా నీతో స్నేహం కోసం (సత్యం)
5. ఒకే ఒక మాట (చక్రం)
6. అడిగీ అడగలేక (దేవదాస్‌)
7. నిన్నే నిన్నే..(దేశముదురు)
8. నయ్‌రే.. నయ్‌రే (ఆంధ్రావాలా)
9. మోన మోన మోనా (శివమణి)
10. బంగారుకొండ (సింహా)    
 
ఇలా తన జ్ఞాపకాలను పంచుకున్న సంగీత దర్శకుడు చక్రి డిశెంబరు 15న సంగీతాభిమానుల నుంచి దూరంగా కానరాని లోకాలకు వెళ్లిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu