తమన్నా, నాది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్: విశాల్ ఇంటర్వ్యూ
''తమన్నా, నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో వీళ్లిద్దరూ తెరపై ఎలా ఉంటారోనని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అదే సినిమాకు ప్లస్ అయిందని'' హీరో విశాల్ తెలియజేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఇటీవలే విడుదలైంది. ప్రమోషన్
''తమన్నా, నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో వీళ్లిద్దరూ తెరపై ఎలా ఉంటారోనని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. అదే సినిమాకు ప్లస్ అయిందని'' హీరో విశాల్ తెలియజేశారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఒక్కడొచ్చాడు'. ఇటీవలే విడుదలైంది. ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్.
మీరు కథల ఎంపిక ఎలా చేసుకుంటారు?
నేను కథలు వింటూ ఉంటాను. ఏ కథ నచ్చితే ఆ కథతో ముందుకెళ్లిపోతాను. 'ఒక్కడొచ్చాడు' కథ చేయడానికి ముందు ఐదారు కథలు విన్నాను. ఈ కథ పాయింట్ నాకు బాగా నచ్చింది.
బ్లాక్‌మనీ కథ ఎంచుకోవడానికి కారణం?
ఇప్పుడు సోసైటీలో జరుగుతున్న బ్లాక్ మనీ సమస్యకు కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా చేస్తున్నప్పుడు ఈ సమస్యపై మోడీగారు కూడా బ్లాక్ మనీ సమస్యపై పోరాటం చేస్తారని అనుకోలేదు. యాదృశ్చికంగా ఈ కథ సెట్ అయింది.
పెద్దనోట్ల రద్దు ప్రభావం ఎలా వుంది?
దాని గురించే సినిమా రెండు సార్లు వాయిదావేశాం. రెండుచోట్ల బాగానే వుంది. తమిళంలో ఇంకా బాగుంది. తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేయడం, వరుసగా సెలవులు ఉండటం మాకు ప్లస్ అయ్యింది.
అందరికీ నచ్చేలా వుందా?
సినిమాకు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఓ సినిమా చేయడం అనేది హీరోకు చాలా ముఖ్యం. అది హీరోకే కాదు, యూనిట్ అందరికీ ఎనర్జీ బూస్టర్‌లా ఉపయోగపడుతుంది. నేను అందుకే ఈ కథ ఎంచుకున్నా. అలాగే ఈ సినిమాలోని మంచి మెసేజ్ ఉండటం కూడా నేను ఈ సినిమా చేయడానికి కారణం.
వడివేలు కామెడీ బాగోలేదని అంటున్నారు?
ఇలా నిర్మొహమాటంగా అడిగినందుకు థ్యాంక్స్. వడివేలు చాలాకాలం తర్వాత వచ్చాడు. అయితే ఆయన్ను తమిళంలో బాగానే రిసీవ్ చేసుకుకన్నారు. డబ్బింగ్ వాయిస్ కూడా ఆర్టిస్టుకు ముఖ్యం. అది ఇక్కడ వర్కవుట్ అయివుండలేదనుకుంటా. వడివేలుతో పాటు సూరి కామెడికి మంచి స్పందన వస్తుంది.
ఇందులో బాగా డాన్స్ చేశారే?
ఒకప్పుడు ఫైట్స్ చేయడానికి బాగా ఇష్టపడేవాడిని, సాంగ్స్ చేయడానికి భయపడేవాడిని. కానీ ఇప్పుడు ముందు డ్యాన్సులు చేయడానికి ఇష్టపడుతున్నాను. తమన్నా మంచి డ్యాన్సర్ కాబట్టి ఆమెతో డ్యాన్స్ చేయడానికి డ్యాన్సుల కోసం బాగా రిహార్సల్ చేశాను. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
జగపతిబాబును తీసుకోవడానికి కారణం?
జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. ఆయన తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తుండటం వల్ల తమిళ ప్రేక్షకులకు సుపరిచితులే. అందువల్ల కీ రోల్ కోసం ఆయన్నే తీసుకొన్నాం. ఆయన రోల్‌కు చాలా మంచి ప్రశంసలు దక్కాయి.
ఇదే నిర్మాతతో మరో సినిమా చేస్తున్నారా?
ఇక ఒక హీరో, ప్రొడ్యూసర్ మధ్య మంచి రిలేషన్ ఉండటం అనేది మంచి పరిణామమే. నిర్మాత హరితో నా జర్నీ బాగా ఉంది. నా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ఉండాలని నేను ఆలోచించుకోవడం ఓకే, కానీ ఓ నిర్మాతగా హరిగారు విశాల్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఒక్కడొచ్చాడు సినిమా విషయంలో ఆయన చాలా కేర్ తీసుకున్నారు.
తదుపరి చిత్రాలు?
నా 23వ సినిమా మిస్కిన్ దర్శకత్వంలో ఉంటుంది. ఆయన స్టయిల్‌లో మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. తెలుగులో ఇంకా టైటిల్ అనుకోలేదు. 24వ సినిమాగా మిత్రన్ దర్శకత్వంలో చేస్తున్నాను. ఇప్పటికే సినిమా 40 శాతం పూర్తయ్యింది. సమంత హీరోయిన్. నా 25వ సినిమా 'పందెంకోడి2' చేయబోతున్నా.
ఇది సీక్వెలా? సిరీసా?
పందెంకోడి ఎక్కడ పూర్తయిందో అక్కడనుంచి కంటెన్యూ అవుతుంది. ఈ చిత్రం చేయడానికి ఆలస్యమైంది. కారణం.. ఇప్పటికి 7 వర్షన్‌లు మార్చాల్సివచ్చింది. ఫైనల్ వర్షన్ ఓకే అయింది. త్వరలోనే సెట్స్‌లోకి వెళుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.