బెల్లంకొండ శ్రీనివాస్...సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించిన ‘అల్లుడు శీను’ చిత్రంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్. అదరగొట్టే డాన్సు, విరగ్గొట్టే ఫైట్స్‌తోనే కాకుండా నటనలో తనదైన శైలితో మెప్పించాడు. తొలి చిత్రంతోనే సూపర్‌హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఇప్పుడు మరోసారి తన స్పీడును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘స్పీడున్నోడు’గా వస్తున్నాడు. శ్రీనివాస్ బర్త్‌డే జనవరి 3. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ...
బర్త్ డే స్పెషల్ ఏంటి....
ఈ పుట్టినరోజుకు పెద్దగా కొత్త ఆలోచనలేమీ లేదు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాను. బయట ఎక్కడా వెళ్ళడం లేదు.
స్పీడున్నోడు టైటిల్ ఏంటి?
డైరెక్టర్ గారికి ఎస్ సెంటిమెంటో ఏమో కానీ డైరెక్టర్ గారి చాయిస్ మీదనే టైటిల్ పెట్టాం. ‘స్పీడున్నోడు’ ఒక ఫ్రెండ్‌ఫిప్ గురించి, ప్రేమ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి తెలియజేప్పే చిత్రం.
తమిళ చిత్రం రీమేక్ కదా...?
`తమిళ సినిమా ‘సుందర పాండ్యన్’ సినిమా మెయిన్ ప్లాట్ బాగా తీసుకున్నామంతే. తెలుగు క్లయిమాక్స్ మినహా అన్నీ సీన్స్ మన నెటివిటీకి తగిన విధంగా చేంజస్ చేశాం. సినిమా రెండు సాంగ్స్, రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. చిత్రీకరణకు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమాను ఫిభ్రవరి 5న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. జనవరి 16న ఆడియో రిలీజ్ ఉంటుంది.
ఇందులో మీ క్యారెక్టర్...
ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉంది. ఎమోషనల్ కమర్షియల్‌ఎంటర్‌టైనర్. కాబట్టి బాడీ లాంగ్వేజ్ నుండి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. అన్నీ విషయాల్లో కేర్ తీసుకుని ఈ సినిమాలో నటించాను. నా తొలి సినిమాకు ఏ మాత్రం తగ్గని ఫైట్స్, డ్యాన్సులు ఉంటాయి. ఆ చిత్రం కంటే పదిరెట్లు కష్టపడ్డాను.
బోయపాటి సినిమా గురించి...
నా సెకండ్ ప్రాజెక్ట్ బోయపాటిగారితో చేయాల్సింది. కానీ అంతకంటే ముందే బన్ని, బోయపాటి సినిమా చేయాలనుకున్నారు. కానీ బన్ని ఆరు నెలలు పాటు బిజీగా ఉండటంతో ఆ గ్యాప్లో నాతో సినిమా చేయాలని బోయపాటిగారు అనుకున్నారు కానీ కథ సంతృప్తిగా అనిపించక ఆగిపోయాం. ఏప్రిల్ 8 నుండి బోయపాటి గారి సినిమా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చిలో షూటింగ్ ఉంటుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో ఓ సినిమా. విజయ్ కుమార్ కొండాగారి దర్శకత్వంలో జయన్న కంబైన్స్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మికాంత్ రెడ్డి నిర్మాణంలో మరో సినిమా ఉంటుందంటూ ఇంటర్వ్యూ ముగించారు.