Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి'కి పైరసీతో లాభమే.. రిలీజ్ ఎపుడో చెప్పలేను : ఎస్.ఎస్.రాజమౌళి ఇంటర్వ్యూ

Advertiesment
'Baahubali' Audio
, గురువారం, 28 మే 2015 (18:51 IST)
'బాహుబలి' (ది బిగినింగ్‌) చిత్రం మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక అనివార్య కారణాల రీత్యా వాయిదా పడింది. దీనికి సంబంధించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి విలేకరులు అడిగిన అనేక ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చారు.
 
* పోలీసు పర్మిషన్‌ టైంలో వివరాలు అడుగుతారు కదా? చివరిలో వాయిదా వేయడానికి కారణం? 
మాకున్న అంచనాతో ముందుగానే ఇంతమంది వస్తామని వారికి నివేదించాం. పోలీసుల సహకారం, ఈవెంట్‌ మేనేజర్‌ సహాయంతో భారీగా చేయాలనుకున్నాం. కానీ పోలీసుల వద్ద నుంచి నిన్నే (బుధవారం) ఓ వార్త వచ్చింది. వారికున్న పరిమితుల మేరకు చాలా తక్కువమందికి మాత్రమే అనుమతిని ఇవ్వగలమనేది దాని సారాంశం. ఈ సినిమా కోసం, ప్రభాస్‌ కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తూ ఉండటంతో, మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనం వస్తారని సమాచారం రావడంతో రిలీజ్‌ను వాయిదావేయక తప్పలేదు. త్వరలో మరో తేదీని ప్రకటిస్తాం.
 
 
* వాయిదాకి వేరే కారణం ఏమైనా వుందా?
పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమనేదే సమస్యే లేదిక్కడ. ప్రభాస్‌ కోసం రెండున్నరేళ్ళుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇబ్బందులకు గురి చేస్తే ఆడియో ఈవెంట్‌ ఫెయిలైనట్టే! అదీగాక గతంలో రెండు మూడు సినిమా ఫంక్షన్ల విషయంలో కొన్ని బాధాకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటివి పునరావృతం కారాదనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేం కూడా అభిమానుల సేఫ్టీ గురించి ఆలోచించి ఈ రిలీజ్‌ను వాయిదా వేశాం.
 
 
* ఇది కూడా సినిమాపై క్రేజ్‌ కోసమే అనుకోవచ్చా?
ఇప్పటికే మాకు రావాల్సిన క్రేజ్‌ వచ్చేసింది. కొత్తగా వస్తే దానివల్ల లాభపడాల్సింది ఏమీలేదు. వాయిదా అనివార్యమైంది. దీనికి ఏదో ఒకటి తగిలించడకండి. అయినా సరే ఈ స్థాయిలో ఆడియో రిలీజ్‌ చేస్తున్నామంటే అది అభిమానుల కోసమే. 
 
* ట్రైలర్‌ కూడా వాయిదా పడ్డట్టేనా?
నిజానికి ట్రైలర్‌ రిలీజ్‌ కోసం మేము ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాం. ఆడియో ఫంక్షన్‌లో ఏ టైమ్‌కి, ఏ స్టైల్లో ట్రైలర్‌ రిలీజ్‌ చేయాలనేది పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రైలర్‌ రిలీజ్‌ విషయమై ఇంకా ఏదీ ఆలోచించలేదు. 
 
* ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ ఆడియో విడుదల కానుందా? 
లేదు. అన్ని భాషల్లో వేర్వేరుగా గ్రాండ్‌గా చేసేందుకే తమిళ, హిందీ పంపిణీదారులు ఇష్టపడుతున్నారు. జూన్‌ ఒకటిన బాహుబలి హిందీ ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో జరుగనుంది. ఈనెల 30న ఉదయం ఓ పెద్ద ప్రెస్‌మీట్‌, 31న సాయంత్రం హైటెక్స్‌లో గ్రాండ్‌గా ఆడియో రిలీజ్‌, ఆ తర్వాత జూన్‌ 1న ముంబైలో ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం.. ఇలా అన్నీ ప్లాన్‌ చేసుకున్నాం. ఇప్పుడు అంతా మారిపోయింది. హిందీ ట్రైలర్‌ లాంచ్‌ మాత్రం తప్పకుండా ఉంటుంది. 
 
* సినిమా ప్రోగ్రెస్‌ ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. రీ రికార్డింగ్‌ 90 శాతం పూర్తయింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు ఇంకా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేస్తున్నాం. 
 
* మొదటి పార్ట్‌ నిడివి ఎంత? 
2 గంటల 35 నిమిషాలు ఉంటుంది. 
 
* పార్ట్‌-2 షూటింగ్‌ ఎంతవరకు పూర్తైంది? 
పార్ట్‌ 2 షూటింగ్‌ 70 శాతం పూర్తయినట్టే. పార్ట్‌ 1 రిలీజ్‌ అయిన తర్వాత పార్ట్‌ 2కి సంబంధించిన మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తాం. 
 
* భారీగా తీసిన ఈ సినిమాకు పైరసీ వస్తే ఎలాంటి కంట్రోల్‌ చేయగలరు? 
పైరసీ వల్ల మాకు లాభమేకానీ. నష్టంలేదు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు.. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అనేవి పెద్దతెరపై చూస్తేనే ఎఫెక్ట్‌గా వుంటాయి. సో.. మాకేమీ భయంలేదు. 
 
* భీమవరంలో భారీగా ఆడియో చేయాలని అప్పట్లో వార్తలు వచ్చాయి? 
ఒక్క భీమవరమేకాదు. వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌లలో చేయాలనుకున్నాం. కానీ అక్కడా వారంతా మేమే చూసుకుంటా రండి అని ఆహ్వానించారు. కానీ గుంపులను కంట్రోల్‌ చేయడం చాలా కష్టమైన పనిని ఒద్దనుకున్నాం. 
 
* హిందీలో కరణ్‌ జోహార్‌ ఒత్తిడిచేస్తున్నట్లు తెలిసింది? 
ఎలా వస్తాయో వార్తలు మీకు.. భలే అడుగుతారే... మా మధ్య ఎటువంటి ఇబ్బందిలేదు.
 
* బాహుబలి కోసం థియేటర్ టిక్కెట్ల ధరలు పెంచబోతున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనా? 
అలాంటిదేమీ లేదు. అవన్నీ పుకార్లే అంటూ రాజమౌళి ఎటకారంగా వ్యాఖ్యానించారు. 
 
* అయితే రిలీజ్‌ ఎప్పుడనుకుంటున్నారు? 
మూడు రోజుల నాటి ఫంక్షన్నే అనుకున్నట్లు జరగలేదు. ఇంకా రెండు నెలల తర్వాత గురించి నేనేమీ చెప్పలేను. అని ముగించారు. 

Share this Story:

Follow Webdunia telugu