Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవీశ్రీతో అమెరికా వెళ్ళా... అప్పుడు అక్కడ... యాంకర్ అనసూయ ఇంటర్వ్యూ

Advertiesment
Anchor Anasuya Interview
, శనివారం, 20 ఫిబ్రవరి 2016 (16:05 IST)
దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ కాన్సెర్ట్స్‌ కోసం అమెరికా వెళ్లాను. అక్కడే 45 రోజులు ఉన్నాం. ఆ సమయంలో అడవి శేష్‌ దగ్గర నుండి మెసేజ్‌ వచ్చింది. సినిమా చేయాలనుకుంటున్నాం.. కథ వింటారా అని. ఆ టైంలో నేను బిజీగా ఉండటం వలన కుదరలేదు. అలా రెండు నెలలు వాయిదా వేశాను. ఆ తర్వాత కలిసి.. కథ విని ఓకే చేశా అంటూ యాంకర్‌, నటి అనసూయ.. తన 'క్షణం' చిత్రంలోని పాత్ర గురించి చెప్పింది. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్‌.
 
టీవీని వదిలినట్లేనా?
నేను నేర్చుకున్నదంతా టీవీల్లోనే. 'క్షణం' సినిమాకు ముందు 'సోగ్గాడే చిన్ని నాయన' విడుదల కావడంతో.. అదే మొదటిది అయింది. అందులో నాది చిన్న రోల్‌. కానీ క్షణంలో ఫుల్‌ లెంగ్త్ క్యారెక్టర్‌‌లో నటిస్తున్నాను. నటిగా నన్ను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని ఎదురుచూస్తున్నాను.
 
అవకాశం ఎలా వచ్చింది?
దేవిశ్రీ ప్రసాద్‌ లైవ్‌ ప్రోగ్రాం కోసం అమెరికా వెళ్లాను. అక్కడే 45 రోజులు ఉన్నాం. ఆ సమయంలో అడవి శేష్‌ దగ్గర నుండి మెసేజ్‌ వచ్చింది. సినిమా చేయాలనుకుంటున్నాం.. కథ వింటారా అని. ఆ టైంలో నేను బిజీగా ఉండటం వలన కుదరలేదు. ఆ తరువాత ఇండియా వచ్చాక రెండు నెలలు నా పనుల్లో బిజీ అయిపోయాను. ఒకసారి కాఫీ షాప్‌‌కి వెళ్ళినపుడు శేష్‌ కలిశాడు. స్టోరీ వినిపించాడు. శ్వేతా అనే క్యారెక్టర్‌ కోసం అడుగుతున్నారనుకున్నాను. కాని జయా భరద్వాజ్‌ అనే కాప్‌ క్యారెక్టర్‌ కోసం అనుకున్నారు.
 
పోలీసు పాత్రల్లో ఎవరిని స్పూర్తిగా తీసుకున్నారు?
దానికి సంబంధించిన సినిమా చాలానే చూశాను. జయా భరద్వాజ్‌ పాత్ర కోసం నేను నేనుగా నటించాలనుకున్నాను.
 
సోగ్గాడే..లో పాత్ర అనగానే ఎలా ఫీలయ్యారు?
నాగార్జున సినిమా అనగానే గెంతాను. సోగ్గాడే చిన్ని నాయనలో రెండు సీన్లు, ఒక్క పాటలో నటించాలని చెప్తే మొదట ఒప్పుకోలేదు. నాగ్‌ సర్‌ నా ఫేవరేట్‌ యాక్టర్‌. రమ్యకృష్ణ, నాగార్జునలతో కలిసి వర్క్‌ చేయొచ్చని సినిమా ఒప్పుకున్నాను.
 
మీ పర్సనల్‌ లైఫ్‌ ఇబ్బందిలేదా?
నాకు పెళ్లైంది.. పిల్లలున్నారు. బాలీవుడ్‌లో కూడా పెళ్ళైన చాలామంది నటిస్తున్నారు. కాని అక్కడ పెర్సనల్‌ లైఫ్‌ చూడరు. స్క్రీన్‌ మీద ఎంటర్టైన్‌ చేస్తున్నారా..? లేదా..? అనే చూస్తారు. నాకు ఎంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారో.. అంతే వ్యతిరేకులున్నారు. కాని నేనెవరినీ పట్టించుకోను. స్క్రీన్‌ మీద ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేయడమే నాకు ముఖ్యం. 
 
మీపై గాసిప్స్‌ రాలేదా?
వచ్చాయి. ఒక్కోసారి నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాను. ఆ సమయంలో నా ఫ్యామిలీ, నా భర్త నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. నువ్వంటే ఏంటో మాకు తెలుసు.. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని నా వెన్నంటే ఉంటారు. అయినా సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి. ఎవరి ప్రాబ్లెమ్స్‌ వాళ్ళకు ఉంటాయి.
webdunia
 
తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్నారే?
ఇలాగే అందరూ అనుకుంటారు. కాని వాళ్లకు తెలియదు కదా.. నేను ఎంత హార్డ్‌ వర్క్‌ చేసానో.. నేను షార్ట్‌ టైంలో ఎక్కువ హార్డ్‌ వర్క్‌ చేయడం వలన ఈ స్థాయిలో ఉన్నాను. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడే వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పలనుకుంటాను కాని అనవసరం అనిపిస్తుంది.
 
టీవీకి, సినిమాకు తేడా ఏమిటి?
పెద్ద తేడా అనిపించలేదు. టీవీలోనే ఇంకా డిసిప్లైండ్‌గా ఉండాలి. సినిమాల్లో నటించడం నాకు సుళువుగా అనిపించింది.
 
గ్లామర్‌ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు?
నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఓ ఆర్మీ ఆఫీసర్‌ అవ్వమని చెప్పేవారు. కానీ నా కాలేజ్‌ రోజుల్లో ప్రతి ఒక్కరూ నన్ను మోడలింగ్‌ లోకి వెళ్ళమని సలహా ఇచ్చారు. మొదట్లో నేనొక న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌‌ని ప్రారంభించాను. ఆ తర్వాత యాంకర్‌గా మారాను.
 
ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
నేను ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్దమే. ముఖ్యంగా నేను చూడటానికి క్యూట్‌గా అందంగా ఉంటాను అనే ఇమేజ్‌ నుంచి బయటకి రావాలి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నా టాలెంట్‌ చూసి నన్ను గుర్తించాలి, అంతేకానీ నా లుక్స్‌ వలన నన్ను గుర్తు పట్టకూడదు అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu