Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి మామయ్యకు అలా ఎందుకనిపించిందో నాకు తెలీదు... : అల్లు శిరీష్‌ ఇంటర్వ్యూ(వీడియో)

చిరంజీవి మేనల్లుడు, అల్లు అర్జున్‌ సోదరుడయిన శిరీష్‌కు మొదటి నుంచి హీరో అవ్వాలని లేదు. కానీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అవ్వాలని వుందనీ.. లేదంటే.. ప్రొడక్షన్‌ చూసుకోవాలనుందని మనసులోమాటను వెల్లడించారు. కొన్

Advertiesment
Allu sirish interview
, గురువారం, 4 ఆగస్టు 2016 (20:34 IST)
చిరంజీవి మేనల్లుడు, అల్లు అర్జున్‌ సోదరుడయిన శిరీష్‌కు మొదటి నుంచి హీరో అవ్వాలని లేదు. కానీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు అవ్వాలని వుందనీ.. లేదంటే.. ప్రొడక్షన్‌ చూసుకోవాలనుందని మనసులోమాటను వెల్లడించారు. కొన్నాళ్లపాటు సౌత్‌స్కోప్‌ అనే సినీ మ్యాగజైన్‌ను రన్‌ చేసిన ఆయన.. హఠాత్తుగా హీరో అవ్వాలనుకున్నట్లు చెప్పగానే చిరంజీవి కూడా ఆశ్చర్యానికి గురయినట్లు.. ఇటీవలే 'శ్రీరస్తు శుభమస్తు' ఆడియోలో వెల్లడించారు. ఈ విషయమై శిరీష్‌ క్లారిటీ ఇస్తూ.. అవును.. హీరో అవ్వాలనుకులేదు. కానీ.. చిరంజీవి.. బన్నీ.. ప్రభావం నాపై వుందని.. చెబుతున్నాడు. ఆయన నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' ఈ శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ విశేషాలు.
 
కొత్తజంట తర్వాత గ్యాప్‌ తీసుకున్నారే?
'కొత్త జంట' షూటింగ్‌లోనే కాలు బెణికింది. ఆ సమయంలో డాక్టర్‌ను సంప్రదిస్తే.. చిన్న ఆపరేషన్‌ చేశారు. ఇది 2014లో జరిగింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అందువల్ల గ్యాప్‌ వచ్చింది.
 
పరశురామ్‌ను మీరే అడిగారా?
పరశురామ్‌ దర్శకత్వంలో పనిచేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ముందు నేనే అడిగాను. ఎందుకంటే ఆయన తీసిన 'సోలో', 'ఆంజనేయులు' సినిమాలంటే బాగా ఇష్టం. హ్యూమన్‌ వాల్యూస్‌, కామెడీ టైమింగ్‌ బావుంటాయి. వాటికి బాగా కనెక్ట్‌ అయ్యేవాడిని. ఓసారి ఆయనతో కలిసి ఈ విషయాన్నే చెప్పాను. ఆయన కూడా నాతో పనిచేయాలని ఉందనే విషయాన్ని వ్యక్తం చేశారు.
 
కథ ఎలా ఉంటుంది?
సింగిల్‌ లైన్‌లో చెబితే పెద్దగా ఏమీ అనిపించదు. ఎందుకంటే ఒకమ్మాయి, ఒకబ్బాయి ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే ఏం చేశారు?... సింపుల్‌గా కథగా వినడానికి ఇంతే ఉంటుంది. కానీ పరశురామ్‌ చేసిన స్క్రీన్‌ప్లే, డ్రామా చాలా బాగా ఉంటుంది.
 
సీనియర్స్‌తో నటించడం ఎలా అనిపించింది?
చాలామంది ఆర్టిస్టులున్నారు. సీనియర్లు సలహాలు తీసుకున్నాను. ప్రకాష్‌రాజ్‌తో ఇప్పటికే చేసేశాను. రావు రమేష్‌తో చేయడం కొత్తగా అనిపించింది. తను ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినా.. దర్శకుడు చెప్పేది చాలా శ్రద్ధగా వింటూ దానికోసం కృషిచేస్తుంటారు. వాళ్ళను చూసి ఇలాంటి కృషి చేయాలనిపించింది.
 
సిక్స్‌ ప్యాక్‌ చేశారు. ఈ సినిమాకు వుపయోగించారా?
నేను గ్యాప్‌ తీసుకున్న సమయంలో సిక్స్‌ ప్యాక్‌ చేశాను. కానీ ఈ కథకు అది సూట్‌కాదు. ఎందుకంటే.. ఇందులో విలన్‌ లేడు. ఫైట్స్‌ లేవు. ఎందుంటే నేను యాక్షన్‌ చేయలేను. రెండేళ్ళయినా.. కాలికి మరేమైనా అవుతుందనే జాగ్రత్తలు డాక్టర్లు చెప్పారు.
 
ఇంతకీ మోకాలు ఆపరేషన్‌ ఎందుకు జరిగింది?
'గౌరవం' సినిమా చేస్తున్నప్పుడు మోకాలు బెణికినట్టు అనిపించింది. అప్పట్లో నొప్పిని నిర్లక్ష్యం చేశా. కానీ 'కొత్తజంట' తర్వాత ఆ నొప్పి మరింత ఎక్కువైంది. అందువల్ల ఎండోస్కోపీ చేస్తే చిన్న ఆపరేషన్‌ చేయాలని చేశారు.
 
ఆడియో వేడుకలో చిరంజీవిగారు.. మీరు హీరో అవుతారని అనుకోలేదన్నారు.. నిజమేనా?
అవును. చిరంజీవిగారు చెప్పినట్లు మొదట హీరో అవ్వాలనే ఆలోచనలే లేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయాలని మాత్రం మైండ్‌లో వుంది. ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలు చూసుకోవాలనుకున్నాను. అయితే.. నిర్మాతగా క్రియేటివిటీ ఏమీ వుండదని గ్రహించాను.
 
మరి హీరోగా అవ్వాలని ఎలా అనుకున్నారు?
బహుశా.. చిరంజీవిగారి సినిమాల ప్రభావం, బన్నీ ప్రభావం తెలీకుండా నాపై పడింది.
 
మీపై చేసే విమర్శలను ఎలా స్వీకరిస్తారు?
ఏవైనా విమర్శలు వస్తే వాటిని సరిద్దుకునేందుకు వుపయోగపడుతుంది. వృత్తిపరంగా ఎదగడానికి నేనెప్పుడూ విమర్శలను ఆహ్వానిస్తాను. ఎటువంటివైనా పాజిటివ్‌గా స్వీకరిస్తా. ఒకరకంగా విమర్శలు లేకపోతే.. జీవితంలో ఎదగలేం. అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. నాకు కొంతమంది మీద నమ్మకం ఉంటుంది. గౌరవం ఉంటుంది. వారికి నా విషయాలను చెప్పి సలహా అడుగుతాను. నేను చేసిన సినిమాలను చిరంజీవి గారిని, అల్లు అర్జున్‌ను అడుగుతాను. నా స్నేహితుల సలహాలు కూడా తీసుకుంటాను. 
 
తమిళంలో కథలు వింటున్నారా?
వింటున్నాను. కానీ థ్రిల్లర్‌ అంటే ఇష్టముండదు. మంచి ఫ్యామిలీ చిత్రాలయితే చేస్తాను.
 
లావణ్య త్రిపాఠి గురించి చెప్పండి?
ఇప్పటిదాకా పనిచేసిన హీరోయిన్లతో పోలిస్తే ద మోస్ట్‌ ప్రొఫెషనల్‌. తను ఆయా సీన్లలో నటించినట్టు కనిపించదు. చాలా లవ్లీగా రియాక్ట్‌ అయినట్టే ఉంటుంది. ఈ సినిమాలో చాలా బాగా చేసింది.
 
ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
అప్పుడే కాలేజీ అయిపోయిన కుర్రాడిగా కనిపిస్తా. లావణ్య ఇంకా కాలేజీలోనే ఉండే అమ్మాయిగా నటించింది. ఆ వయసుకు తగ్గ ప్రేమకథ. ఫ్యామిలీ విలువలు మెండుగా ఉంటాయి. ఇప్పటివరకు నేను చేసిన అన్ని పాత్రల్లోకీ నా రియల్‌ లైఫ్‌కి కాసింత దగ్గరగా ఉండే పాత్ర.
 
అంటే ఎలా ఉంటుంది?
పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా అవేమీ లేకుండా అందరితో కలిసిపోతానని, అందరినీ ఒకేలా చూస్తానని నా ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అంటుంటారు. అలాగే ఈ సినిమాలో హీరో కూడా పెద్ద ఫ్యామిలీ వ్యక్తి అయినప్పటికీ అందరితో కలిసిపోతుంటాడు. సరదాగా ఉంటాడు.
 
ఇక నిర్మాతగా బాధ్యతలు చేయరా?
నాకు ఆ పని బోర్‌ కొట్టింది. నేను మనీ పర్సన్‌ని కాదు. నిద్ర లేచినప్పటి నుంచి డబ్బులు లెక్కేయడం తప్ప ఇంకోటి ఉండదు. కానీ నాకు క్రియేటివ్‌ వర్క్‌ ఇష్టం. స్టోరీ డిస్కషన్స్‌ ఇష్టం. క్రియేటివ్‌గా ఉండటం ఇష్టం. అందుకే నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తే బావుంటుందనిపించి మొదలుపెట్టా. 
 
మీకు ఎటువంటి కథలంటే ఇష్టం?
థ్రిల్లర్‌లు, హారర్‌ కామెడీలు నాకు నచ్చవు. యాక్షన్‌ చేయడమంటే ఇష్టం. కానీ కథలో లేకుండా కావాలని యాక్షన్‌ని ఇరికించడం కూడా నాకు నచ్చదు. అంతెందుకు ఈ సినిమాలో ఐదు పాటలు పెట్టాలనుకున్నాం. కానీ ఇరికించినట్టు ఉంటుందనిపించి మూడు పాటలతోనే సరిపెట్టాం. చూశాక విమర్శకులు ఈ విషయాన్ని ప్రస్తావించకూడదని.
 
లుక్‌ పరంగా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి?
చెక్డ్‌ షర్ట్‌‌లు వేసుకున్నా. హెయిర్‌ స్టైల్‌ కూడా మార్చా.
 
ఈ చిత్రాన్ని చూశాక. బొమ్మరిల్లు గుర్తుకువచ్చిందని చిరంజీవిగారు అన్నారు?
ఆయనకు ఎలాఎలా అనిపించిందో తెలీదుకానీ.. ఒక్కొక్కరికి ఒక్కోలాగా సింక్‌ అవుతుంది. బొమ్మరిల్లు కథకు దీనికి పూర్తి విరుద్ధం. అందులో తండ్రి మాటను జవదాటడు హీరో. కానీ నా మాటకు గౌరవిస్తారు ఇందులో.. ఇలా చాలా వేరియేషన్స్‌ వున్నాయి.
 
డాన్స్‌ ఎలా చేశారు?
చెప్పాను కదా.. నేను డాన్స్‌ లేకుండా పాటలు ఎక్కువ లేకుండా చూసుకుంటాను. ఎందుకంటే కాలు గురించి డాక్టర్‌ జాగ్రత్తలు చెప్పారు. ఏదైనా చేయాలంటే.. లైటర్‌వేలో మాత్రమే డాన్స్‌ చేయాలి. అందుకే.. డాన్స్‌కు నేను పర్‌ఫెక్ట్‌ కాదు. అలాగే పెద్దపెద్ద ఫైట్లు కూడా చేయలేను.
 
డబ్బింగ్‌ ఎలా చెప్పగలిగారు?
2 గంటల సినిమాకు 60 గంటలు డబ్బింగ్‌ చెప్పాను. ప్రతీదీ పర్‌ఫెక్షన్‌ వుండాలని దర్శకుడు కేర్‌ తీసుకున్నారు.
 
తర్వాతి సినిమా ఎంతవరకు వచ్చింది?
వేణు దర్శకత్వంలో చేయబోతున్నా. కథరీత్యా ఏడొందల ఏళ్ల నాటి ప్రేమకథ. నా మార్కెట్‌కి తగ్గ బడ్జెట్‌లోనే తీస్తాం. ఓ దర్బార్‌ సెట్‌ ఉంటుంది. అందులో గౌతమ్‌ అనే పాత్రలో నటిస్తాను అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బో... అనసూయలో ఈ కోణం కూడా ఉందా...? ఏ డేట్ విత్ అనసూయ అంటోంది...