Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మానందం కోన్ ఐస్ క్రీమ్ కావాలంటే కోన వెంకట్ ఇచ్చేశాం... అల్లరి నరేష్ ఇంటర్వ్యూ

Advertiesment
allari naresh interview
, గురువారం, 6 నవంబరు 2014 (18:13 IST)
ఇవివి కుటుంబం నుంచి వచ్చిన నటవారసుడు అల్లరి నరేష్‌. కామెడీ చిత్రాల్లో అతనిదో శైలి. అలాంటిది కొత్తకొత్త ప్రయోగాలు చేయాలని 'ఏక్షన్‌ 3డి', 'లడ్డూబాబు' వంటి చిత్రాల్లో నటించాక చాలా అనుభవం సంపాదించానని అంటున్నారు. ఓ వైపు స్వంత నిర్మాణసంస్థ ద్వారా 'బందిపోటు' అనే చిత్రాన్ని నిర్మిస్తూ, మరో వైపు నాయకుడిగా చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా నటించిన 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌తో ఇంటర్వ్యూ... 
 
బొమ్మాళి బ్రదర్‌గా ఎలా చేశారు? 
కథలో నేను, కార్తీక కవలపిల్లలం. నేను సాఫ్ట్‌గా వుంటే ఆమె చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. తనవారిని ఎవరైనా ఏమంటే ఎదురుతిరుగుతుంది. అవసరమైతే చేయిచేసుకుంటుంది. ఈ చిత్రం చేయకముందు సోదరి లేదనే ఫీలింగ్‌ వుండేది. బొమ్మాళి చేశాక ఇలాంటి సిస్టర్‌ వుంటే ఈపాటికి హిమాలయాలకు పారిపోయేవాడ్ని. 
 
కథాపరంగా అంత ఏడిపిస్తుంది. ఆడుకుంటుంది. నా ప్రేమ వ్యవహారంలో దూరి దూరం చేస్తుంది. నేను అబద్ధాలు ఆడను. ఆడితే ఇలాంటి ఆడపిల్ల పుడుతుందనే భయం. తనకు ఆవేశం ఎక్కువ. నాకు ఆలోచన ఎక్కువ. ఇవన్నీ చూసేవాడికి చాలా సరదాగా వుంటాయి. 
 
ఆమెనే తీసుకోవడానికి కారణం? 
నాకు ఆమె ఐబ్రోస్‌ అంటే చాలా ఇష్టం. 'రంగం'లో ఐబ్రోస్‌తో పలుకరిస్తుంది. ఇది చాలామంది చూసి మెచ్చుకున్నారు. నేను అదే విషయం చెబితే.. తన ఐబ్రోస్‌ చెన్నైలో మోడల్‌గా ఉపయోగించారని చెప్పింది. కథలో చాలా ఫాస్ట్‌గా ఐబ్రోస్‌ ఎగరేసే అమ్మాయి కావాలి అనగానే టక్కున ఆమె గుర్తుకు వచ్చింది. పైగా తను ఫైటర్‌, డాన్సర్‌ కూడా. 
 
ఇందులో డాన్స్‌ ఎలా చేసింది? 
'రంగం'లో నన్ను సరిగ్గా డాన్స్‌ చేయనీయలేదని ఫీలయి నాకు చెప్పింది. ఈ సినిమాలో కొన్ని డాన్స్‌లు వేస్తానంది. లెగ్‌ మూవ్‌మెంట్స్‌ చేస్తానంది. మొదట ఏదో జోక్‌ చేస్తుందనుకున్నా. కానీ సీరియస్‌గా అన్నాననంది. మామూలుగా మగాళ్ళు చేస్తేనే కాలికి గాయమై ఆసుపత్రి పాలవుతారు. బాగా డాన్స్‌ వచ్చిన ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ అలా చేసేవారు. 
 
అలాంటిది ఓ సన్నివేశంలో తనే చేస్తానని కార్తీక పట్టుబడితే.. మొదట జోక్‌ చేస్తుందనుకున్నా. డాన్స్‌మాస్టర్‌ చూద్దామని ఓ బిట్‌ సాంగ్‌ ఇచ్చారు. ఆమె డాన్స్‌ చూసి ఆయనతోపాటు నేనూ ఆశ్చర్యపోయా. ఇలాంటి డాన్స్‌కు సహజంగా రోప్స్‌ వాడతారు. అవేవీ లేకుండా చేసేసరికి.. ఆ భారం నాపై పడింది. అంటే ఆమెకు పోటీగా చేయాలి. ఇలా ఆమె నటించడం పోటీగా భావించాను.
 
బ్రహ్మానందం పాత్ర ఎలా వుంటుంది? 
తను వంటవాడు. అయితే అన్ని సినిమాల్లో బ్రహ్మానందం అందర్నీ బకరా చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేస్తాడు. కానీ ఈ సినిమాలో అతన్నే బకరా చేస్తాం. పేరు ఏం పెట్టాలని అనుకుంటుండగా... కోన్‌ ఐస్‌క్రీమ్‌ అనుకున్నాం. అది చెప్పగానే. కోన్‌ ఎందుకు కోన వెంకట్‌ అని పెట్టేయండి అన్నాడు. ఆ విషయం 
కోన వెంకట్‌కు చెప్పి ఒప్పించారు. చాలా ఫన్నీగా వుంటుంది. 
 
మీ 50వ సినిమా ఎలా వుండబోతుంది? 
ఇంతవరకు పలానా సినిమా అనుకోలేదు. కానీ హర్రర్‌ కామెడీ తరహాలో చేయాలనుకున్నాను. ఈపాటికే అలాంటి చిత్రాలు వచ్చేశాయి. ఇప్పటికే ముగ్గురు దర్శకులు కథలు చెప్పారు. వచ్చేనెలలో ఫైనల్‌ వివరాలు తెలియజేస్తాను. 
 
ఎప్పుడూ బిజీగా వుండే మీ చిత్రాలు తగ్గాయి. కారణం? 
ఒక్కటే కారణం... ఏక్షన్‌ 3డి సినిమా కొత్తగా వుంటుందని చేశాను. దానికి ఏడాదిన్నర పట్టింది. ఆ తర్వాత 'లడ్డూబాబు'కు 8 నెలలు గ్యాప్‌ తీసుకున్నారు. ఆ సినిమా చేస్తుండగా మరో సినిమా చేయవద్దని దర్శకుడు రవిబాబు చెప్పారు. ఇలా ఆ రెండు సినిమాలు టైమ్‌ పట్టినా ఫలితం రాలేదు. దాంతో చాలా అనుభవం వచ్చింది. 
 
ఈమధ్య ప్లాప్‌లు ఎక్కువగా వస్తున్నాయి? 
అదే చెబుతున్నా.. ఇక్కడ హిట్‌ ప్లాప్‌లు సమానమే. అలా తీసుకుంటేనే ఇండస్ట్రీలో వుండగలం. అన్నీ హిట్లు వస్తే కూడా కష్టమే.. అప్పుడప్పుడు మేం చెప్పిన తప్పులు ఎత్తిచూపిస్తుండాలి. 
 
దర్శకత్వం ఎప్పుడు చేస్తారు? 
చేసే ఆలోచన వుంది. ఇంకా చాలా టైమ్‌ వుంది. నాకు నచ్చిన కథ దొరికితే తప్పకుండా చేస్తాను. 
 
ఓసారి మాస్క్‌ చిత్రాలు చేయాలనుందన్నారు? 
ఇంగ్లీషులో మాస్క్‌ చిత్రాలు జేమ్స్‌బాండ్‌ చిత్రాలు చేయాలంటే కోట్లలో వుంటుంది. దాన్ని మనం చేయలేం. అందుకే వద్దనుకున్నాను అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu