Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పైన ఏదో చేయి నాకు ఆశీర్వాదంలా వుంది - విజయ్ దేవరకొండ

Ananya, Vijay
, సోమవారం, 15 ఆగస్టు 2022 (18:48 IST)
Ananya, Vijay
విజయ్ దేవరకొండ, ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు.. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
 
 లైగర్ ని తెలుగు నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ గా చూడాలా ? బాలీవుడ్ నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ గా చూడాలా ?
విజయ్ దేవరకొండ : లైగర్ పక్కా తెలుగు సినిమా. అయితే హిందీలా కనిపిస్తుందనే చర్చ మన తెలుగు ఆడియన్స్ లో వుంది. దాన్ని నేను అర్ధం చేసుకుంటా. ఇందులో పాటలు చేసింది హిందీ కంపోజర్స్. షూట్ చేసినపుడు అప్పుడు వున్నది హిందీ వెర్షనే. పాటలు హిందీలో చేశాం. సినిమా మాత్రం పక్కా తెలుగు. హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేశాం. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమాని ఫీలౌతారు. లైగర్ మన సినిమా. మన సినిమాని ఇండియాకి చూపిస్తున్నాం.
 
లాంచ్ చేసినప్పుడే పాన్ ఇండియా అనుకున్నారా ?
విజయ్ దేవరకొండ : మొదటిసారి కథ చెప్పినపుడు తెలుగు సినిమా చేద్దామనే స్టార్ట్ చేశాం. అయితే కథ విన్నపుడు దిన్ని దేశం మొత్తం చెప్పొచ్చని అనిపించింది. లోకల్ సినిమాని నేషనల్ కి తీసుకెళ్ల ప్రయత్నం విజయవంతంగా జరుగుతున్న తరుణంలో లైగర్ కంటెంట్ కూడా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగింది.
 
జాతీయ స్థాయిలో వచ్చిన ఆదరణ చూసినప్పుడు ఎలా అనిపించింది ?
విజయ్ దేవరకొండ : అసలు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారనే కన్ఫ్యుజన్ కూడా వచ్చింది. ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు, భాష తెలీదు. అంతకుముందు నా సినిమాలు కూడా అక్కడి వెళ్ళలేదు. అసలు నేను అంటే ఎందుకిష్టం ? అని అడుగుతుంటా. సరైన సమాధానం దొరకలేదు. అయితే నాకు అర్ధమైయిందేమిటంటే  మన సినిమాలు డబ్బింగ్ లో చూసి, మన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాని ఫాలో అయ్యి ఒక కనెక్షన్ పెంచుకున్నారు. కానీ నాకు పూర్తిగా అర్ధం కాలేదు.
 
ఒక్కసారిగా దేశాన్ని షేక్ చేసే సినిమా చేయడం వెనుక కారణం ఏమని భావిస్తున్నారు ?
విజయ్ దేవరకొండ: కెరీర్ మొదలుపెట్టినప్పుడు నేను ఏదైనా చేయగలననే కాన్ఫిడెన్స్ వుండేది. అయితే కొంత కాలం తర్వాత నాకో సంగతి అర్ధమైయింది. పైన ఏదో చేయి వుంది. ఆశీర్వాదం వుంది. అది నడిపిస్తుంది. దాన్ని గురించి తగినంత పని చేయాలి. ఇప్పుడు వస్తున్న ప్రేమకు వారిని సంతోషపెట్టె పని చేయాలి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు పంచిన ప్రేమను లైగర్ తిరిగిస్తుందని నమ్మకంగా వుంది.
 
నటుడిగా ప్రయత్నిస్తున్న రోజుల్లో అవకాశం కోసం పూరి గారిని ఎప్పుడైనా కలిశారా ?
విజయ్ : నటుడిగా ఇంకా కెరీర్ ప్రారంభించక మునుపు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజ గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేసేవాడిని. పూరి గారు అయితే సహాయ దర్శకులకు మంచి సాలరీలు ఇస్తారని నాన్న ఒకసారి చెప్పారు. కానీ పూరి గారిని కలవడం కుదరలేదు. డియర్ కామ్రేడ్ తర్వాత కలిశాను. కథ విన్నాను. ఆ ప్రయాణం ఇక్కడి వరకూ వచ్చింది.
 
భారీ అంచనాలని ఎలా అందుకుంటామనే భయం ఉందా ?
విజయ్ : అంచనాలు అందుకునే విషయంలో ఎలాంటి భయం లేదు. అది పెద్ద పని కాదు. ఏదైనా పెద్దగా చేయాలని వుండేది. పెళ్లి చూపులు సమయంలో అదే పెద్ద సినిమా నాకు. తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. అలా అంచనాలు పెరుక్కుంటూ వచ్చాయి. అంచనాలు పెగుతూనే వున్నాయి. వాటిని ఎలా అధిగమించాలానే ఆలోచన మాత్రం లేదు.
 
లైగర్ హిందీలో ఎలా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు ?
విజయ్ : లైగర్ లో టెర్రిఫిక్ కంటెంట్ వుంది. ఒక సీన్ కి మించి మరో సీన్ .. ఫుల్ హైలో వుంటుంది. అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్. రమ్యకృష్ణ గారిని హిందీలో కూడా ప్రేమిస్తారు. అనన్య అక్కడ వారికీ తెలిసిన నటి. నాతో పాటు అలీ గెటప్ అందరినీ ప్రేమిస్తారు. థియేటర్ లోఅడుగుపెడితే ఇంక ఆలోచించాల్సిన పని లేదు.
 
లైగర్ లో సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
విజయ్ : లైగర్ నా కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా. అలాగే ఫిజికల్ గా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా కూడా ఇదే. బాడీని ట్రాన్ ఫార్మ్ చేయడానికి ఏడాదిన్నర కాలం పట్టింది. ఫెర్ఫార్మెన్స్ వైజ్ కూడా సవాల్ తో కూడున్న సినిమా. ఫైట్స్ నేర్చుకోవడం, అలాగే డ్యాన్స్ కూడా.  పూరి గారు ప్లే చేయడానికి అద్భుతమైన కంటెంట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం సర్వస్వం ఇచ్చేశా.
 
లైగర్ తో తెలుగులో రావడం ఎలా అనిపించింది ?
అనన్య పాండే : సౌత్ సినిమాలు అంటే ఇష్టం. పూరి, ఛార్మీ గారు లైగర్ కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. లైగర్ లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాతో సౌత్ లోకి రావడం ఆనందంగా వుంది. ఆన్ స్క్రీన్ లో చూసినప్పుడు విజయ్ చాలా సైలంట్ అనుకున్నాను. కానీ ఆయనతో పని చేసిన తర్వాత తెలిసింది. విజయ్ నేను అనుకున్నంత సైలెంట్ కాదు. విజయ్ నాకు చిరకాల మిత్రుడయ్యారు.
 
డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది ?
విజయ్ : డ్యాన్స్ అంటే నాకు ఏడుపోస్తుంటుంది. నేను డ్యాన్సర్ అని అనుకోను. కానీ లైగర్ కోసం డ్యాన్సులు చేశాను. ఇందులో అనన్య నన్ను చాలా భరించింది. డ్యాన్స్ టేక్ మధ్యలో కట్ చెప్పేస్తుంటా. నాకు సరిగ్గా వచ్చేసరికి ఆమెకు అలసట వచ్చేస్తుంటుంది. (నవ్వుతూ).అనన్యతో వర్క్ చేయడం మంచి అనుభవం. అనన్య ముద్దు పిల్ల. సినిమా కోసం చాలా కష్టపడుతుంది.
 
మైక్ టైసన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
విజయ్ : మైక్ టైసన్ తో పని చేయడం లైఫ్ టైం గుర్తుపెట్టుకునే జ్ఞాపకం. మైక్ టైసన్ అంటే మా అమ్మ భయపడింది. సినిమా యాక్షన్ కోర్రియోగ్రఫీ గురించి తనకి తెలీదు. షూటింగ్ రోజు ఆయన్ని చూస్తే భయం వేసింది. ఆయనది మామూలు పర్శనాలిటీ కాదు. షేక్ హ్యాండ్ ఇస్తే పది కేజీల బరువు తాకినట్లు వుంటుంది. ఆయన మెడ మనకి మూదితంలు వుంటుంది. ఆయన షూ సైజ్ 16. ఎక్కడా దొరకలేదు స్పెషల్ గా తయారుచేశాం. క్లైమాక్స్ లో పెద్ద ఫైట్ సీక్వెన్స్ వుంది. ఆయన రియల్ గా నటుడు కూడ కాదు. మొదట్లో చాల భయం వేసింది. అయితే ఆయన చాలా స్వీట్ పర్శన్. కథ చెప్పడమే టైసన్ రిఫరెన్స్ తో చెప్పారు. సినిమా చేస్తున్నపుడు ఆయన అయితేనే న్యాయం జరుగుతుందని ఏడాది పాటు కష్టపడి ఆయన్ని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాం. ఆయన పాత్ర లైగర్ లో చాలా కీలకం.
 
బాక్సింగ్ వుంది కదా.. అమ్మా నాన్న తమిళమ్మాయితో పోలికలు ఉన్నాయా ?
విజయ్ : లేదు.  పూరి గారి అమ్మా నాన్న తమిళమ్మాయికి నేను ఫ్యాన్ ని. చాలా సార్లు ఆ సినిమా చూశా. రీమేకులు ఫ్రీమేకులు నాకు ఇష్టం వుండదు. ఆ సినిమా కథతో కొంచెం పోలిక వున్న నేను చేయను కదా. పైగా లైగర్ లో వున్నది బాక్సింగ్ కాదు. ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్. అమ్మా నాన్న తమిళమ్మాయితో లైగర్ కి ఎలాంటి పోలిక లేదు.
 
పూరి గారి సినిమాల్లో డైలాగులు దూసుకుపొతుంటాయి. కానీ లైగర్ లో మీకు నత్తి పెట్టారు. ఎలా ప్రిపేర్ అయ్యారు ?
విజయ్ : సినిమాలో అన్నటికంటే మజా నత్తి వల్లే వస్తుంది. దాని నుండి వచ్చిన డ్రామా హై చాలా ఇంటరెస్టింగా వుంటుంది. నత్తి పాత్ర చేయడానికి మొదట మూడురోజులు కాస్త కష్టపడ్డా. తర్వాత ఆ పాత్రతో ఒక కనెక్షన్ వచ్చేసింది. ఈ పాత్ర ఎంత నచ్చిందంటే.. ఇప్పుడు నాకు నత్తి లేకుండా మాట్లాడటం నచ్చడం లేదు. లైగర్ పాత్రని చాలా మిస్ అవుతున్నా.
 
మీ నాన్నగారు నటించే అవకాశం రావడం ఎలా అనిపించింది ?
అనన్య: లైగర్ లో మా నాన్న గారు కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఆయనతో ఎప్పటినుండో నటించాలని వుండేది. ఆయన ఎప్పుడూ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయమని చెబుతుండేవారు. ఈ సినిమాతో రెండు కోరికలు తీరాయి.
 
 కరణ్ జోహార్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
విజయ్ : నా సినిమా అర్జున్ రెడ్డి చూసి కాల్ చేశారు. హిందీ సినిమా చేయాలని వుంది చెప్పారు. కానీ అప్పుడు నేను వేరే ప్రాజెక్ట్స్ లో వున్నా. లైగర్ ని హిందీలో కూడా చేయాలనుకుంటున్నాం అని ఆయనతో చెబితే కథ కూడా వినకుండా చేద్దామని చెప్పారు. కరణ్ జోహార్ చాలా నైస్ పర్శన్. బాలీవుడ్ ప్రమోషన్స్ లో ఆయన పాత్ర చాలా కీలకం.
 
తెలుగులో మోస్ట్ హ్యాండసమ్ యాక్టర్ ఎవరు ?
అనన్య: అల్లు అర్జున్ గారు. ఆయన చాలా కూల్. అల వైకుంఠపురంలో నాకు చాలా నచ్చింది. 
 
బాడీని మెంటైన్ చేయడానికి ఎలా కష్టపడ్డారు ?
విజయ్: షూటింగ్ లేనప్పుడు రోజుకు ఐదారు గంటలు వర్క్ అవుట్ చేయాల్సివచ్చింది. ఆహరం విషయంలో కూడా చాలా నియమాలు పాటించా. డైట్ లో షుగర్  వుండేది కాదు. చిన్నపుడు ఆదివారం వస్తే చికెన్  గురించి ఎదురుచూసేవాడిని. గత రెండేళ్ళుగా మూడు పూటలు చికెనే తింటున్నా. విరక్తి వచ్చేసింది. అయితే చిన్నపుడు మనస్పూర్తిగా తిందామంటే దొరికేది కాదు. దాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు దొరికింది తిను అని నాకు నేను చెప్పుకునేవాడిని. బాడీని మైంటైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. అయితే సినిమాలో వున్నకంటెంట్ గుర్తు చేసుకున్నపుడు బాడీని ఇట్లాఉంటేనే బావుటుందని స్ఫూర్తి పొందేవాడిని.
 
లైగర్ ప్రమోషన్స్ లో బాగా తిరుగుతున్నారు కదా.. ఆరోగ్యం ఏమైనా ఇబ్బందయ్యిందా ?
విజయ్ : దురదృష్టవశాత్తు కాస్త నలతగా అనిపిస్తుంది. వారం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అయితే రెండేళ్ళు కష్టపడి ఒక సినిమా తీశాం. ఇప్పుడు హెల్త్ గురించి అలోచించే పరిస్థితి లేదు. ప్రమోషన్స్ లో దూసుకుపోవడమే. ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా.  షూటింగ్ లో బ్యాక్ ఇంజురీ అయ్యింది. అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంతుంటుంది. బాడీ కొంచెం హ్యాండ్ ఇచ్చినప్పటికీ మెంటల్ గా ఎంజాయ్ చేస్తున్నా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు సినిమా.. దేశానికి చూపిస్తున్నాం: విజయ్ దేవరకొండ