'బట్టలిప్పేసి.. శ్వేదం చిందేవరకు వర్క్ చేయండి.. బెలారస్ ప్రెసిడెంట్ పిలుపు : విధులకు నగ్నంగా..
తూర్పు యూరోప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగుల తీరును చూసి అధికారులు తలబద్దలు కొట్టుకుంటున్నారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును
తూర్పు యూరోప్ దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో దేశంలోని ఉద్యోగుల తీరును చూసి అధికారులు తలబద్దలు కొట్టుకుంటున్నారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఆయన భావగర్భితంగా ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు మరో రకంగా తీసుకున్నారు. ఆయన చెప్పిన మాటలను మరోలా అర్థం చేసుకుని అక్షరాల అమలు చేస్తూ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కష్టపడి పనిచేయడం ఎంత అవసరమో చెప్పడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడ్డాడు.
''గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ (బట్టలిప్పుకొని పనిచేయండి చెమటలు కక్కేదాక)'' అంటూ ఆయనిచ్చిన సందేశంలోని సారాంశాన్ని పూర్తి భిన్నంగా ఆలోచించిన బెలారస్ ఉద్యోగులు ఆయన మాటలను అక్షరాల అమలు చేయడానికి ఆఫీసుల్లో బట్టలిప్పుకొని నగ్నంగా పనిచేస్తున్నారు. అలా పనిచేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీసి మరి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఆఫీసుల్లో పనిచేసే మగవాళ్లతోపాటు ఆడవాళ్లు కూడా బట్టలు లేకుండా ఫొటోలు దిగడం యూరప్‌లాంటి దేశంలో కూడా కొంత ఆశ్చర్యమే.
నగ్నంగా కూర్చుని పనిచేసినా కూడా లాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అడ్డుగా పెట్టుకుని తమ మానాన్ని కాపాడుకోవడం గమనార్హం. ఇది ఒక్క ఉద్యోగస్తులకే పరిమితం కాలేదు. సంగీత కళాకారులు కూడా బట్టలిప్పేసి వాయిద్యాలతో మానాన్ని దాచుకుంటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. వారిని భవన నిర్మాణ కార్మికులు కూడా అనుసరిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.''బట్టలిప్పుకొని పనిచేయాలని మన దేశాధ్యక్షుడే చెబుతున్నారు'' లాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. తమతో పాటు దేశాధ్యక్షుడు లుకషెంకో కూడా బట్టలిప్పుకొని పనిచేస్తున్నట్టు ఫొటోషాప్‌లో మార్పిడి చేసిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. పాపం లుకషెంకో దీనిపట్ల ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.