అమెరికా విదేశాంగశాఖామంత్రి హిల్లరీ క్లింటన్ వచ్చే వారం భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆమె కాంగ్రెస్ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరు దేశాల సత్సంబంధాలు, దిశానిర్దేశాలు ఎలా ఉండాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
భారతదేశంలో జరిపే పర్యటన చారిత్రాత్మకమౌతుందని దీనిపై గత కొద్ది రోజులుగా హిల్లరీ వివిధ కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇయాన్ కేలీ విలేకరులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె బుధవారంనాడు ఉదయం అల్పాహార సమయంలో సెనేట్ సభ్యులు, వైట్‌హౌస్ ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల కమిటీలోని ప్రముఖులు జాన్ కైరీ మరియు హావర్డ్ బర్మన్ తదితర కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారని కేలీ తెలిపారు.
ఇరు దేశాల సంబంధాలు ఏ మార్గంవైపు పయనించాలోకూడా ఆమె ఈ సభ్యులతో చర్చించినట్లు కేలీ పేర్కొన్నారు.
ఇదిలావుండగా విదేశీ వ్యవహారాలను చూసే మరికొంతమంది నిపుణులతోకూడా ఆమె సంప్రదింపులు జరిపినట్లు కేలీ తెలిపారు.
కాగా హిల్లరీ క్లింటన్ పర్యటన సందర్భంగా అణుశక్తి విషయం చర్చలకు వస్తుందా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం దాటవేశారు.