ప్రధానమంత్రి హసీనా విషాహారం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారని ఒక ప్రైవేటు టీవీ ఛానెల్ ప్రసారం చేసింది.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు సబ్ జైలులో విషాహారం సరఫరా చేస్తున్నట్లు సీనియర్ అవామీలీగ్ నాయకుడు పేర్కొన్నారు.
అక్కడి సైన్యం మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి ప్రధాని షేక్ హసీనాను సబ్ జైలులో నిర్భంధించింది.
పార్లమెంటు ఉప నాయకురాలు సయ్యద్ సాజీదా పత్రికా విలేఖరులతో ఫోన్లో మాట్లాడుతూ, గతంలో తాను పేర్కొన్నట్లు హసీనా అనారోగ్యంతో బాధపడుతున్నారని, జైలు అధికారులు సరఫరా చేసే ఆహారం తీసుకోవడం మానేశారని ఆమె చెప్పారు.