పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో తాలిబన్ ఉగ్రవాదులకు పాక్ సైన్యానికి మధ్య జరిగిన పోరులో స్వాత్ లోయలో నివసిస్తున్న దాదాపు 20లక్షలమంది శరణార్థులలోంచి నాలుగు లక్షలమంది తమ తమ ఇండ్లకు చేరుకున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
పాక్‌లోని స్వాత్ లోయలోని తమ స్వంత ప్రంతాలలోని ఇండ్లకు గత పది రోజులుగా మూడు లక్షల 85వేలమంది శరణార్థులు చేరుకున్నారని ఐరాస మానవాధికారి వూల్ఫ్‌గైంగ్ హార్బింజర్ అన్నారు.
గత కొద్ది రోజులుగా బునేర్ మరియు స్వాత్ ప్రాంతాలలోని ప్రజలకొరకు అధికారులు అంతర్గతంగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించారని ఆయన తెలిపారు.
పాక్‌లోని వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాదులపై పోరాడేందుకు జరిపిన పోరాటాలలో చాలా ప్రాంతాలు దెబ్బ తిన్నాయని ఆయన పేర్కొన్నారు.
న్యూయార్క్‌లోని సంరా ప్రధాన కార్యాలయానికి చెందిన ప్రతినిధి మాట్లాడుతూ... వాతావరణంలో వచ్చిన మార్పులు, శరణార్థులు తమ తమ ప్రాంతాలకు తిరిగి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, ప్రస్తుతం పాక్‌లోని వాయువ్యప్రాంతం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోందని ఆయన అన్నారు.