సిరియాలో బహిరంగ ధూమపానం నిషేధం
అరబ్ దేశాల్లో బహిరంగ ధూమపానాన్ని నిషేధించిన నేపథ్యంలోనే సిరియాలోను బహిరంగ ధూమపానంపై నిషేధం విధించినట్లు ఆ దేశం ప్రకటించింది. సిరియా దేశంలోను బహిరంగంగా ధూమపానం చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశాధ్యక్షుడు బషహర్ అసద్ ప్రకటించారు. దీంతో ఆ దేశంలోని పలు ప్రధాన కూడళ్ళలో ధూమపానం చేసే వీలు కలుగదు. కాని బహిరంగ ప్రదేశాల్లో సిరియా దేశానికి చెందిన హుక్కాలకను మాత్రం సేవించవచ్చని ప్రభుత్వం తెలిపింది. తాము ఆదేశించిన ఈ ఆదేశాలు వచ్చే ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా రూపుదాల్చనున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలతోపాటు రెస్టారెంట్, కేఫ్, సినిమా థియేటర్లు, పాఠశాలలు, పాఠశాల చుట్టుప్రక్కల, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలవద్ద, కార్యాలయాలు, ప్రభుత్వ బస్సులలో ధూమపానం చేయడాన్ని నిషేధించినట్లు ఆయన తెలిపారు. ధూమపాన నిషేధాన్ని ఉల్లంఘించేవారికి రెండు వేల సిరియా పౌండ్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ దేశంలో ఇప్పటినుంచే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేందుకు అక్కడి ప్రజలు నిరాకరిస్తున్నట్లు సమాచారం.