Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సముద్రంలో కూలిన విమానం: ప్రయాణికులు సురక్షితం

Advertiesment
భూమధ్యసాగరం
భూమధ్యసాగరంలోని కోరసికా ద్వీపానికి సమీపంలో ఓ చిన్న విమానం సముద్రంలో పడిపోయింది. కాని అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

సముద్రంలో ఓ చిన్న విమానం పడిపోయిందని, అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారని, వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు భూమధ్యసాగరానికి చెందిన ఓడరేవు భద్రతాదళాధికారులు తెలిపారు.

ఈ విమాన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని అధికారులు తెలిపారు. కాగా ఇందులో ప్రయాణించిన వారికి ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని వారు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu