శ్రీలంక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓట్లు సాధించిన ఓ బౌద్ధ సన్యాసి నగర మేయర్ కానున్నారు. సింహళ జాతీయ పార్టీ అయిన జథిక హేల ఉరుమాయ(జేహెచ్‌యూ)కు చెందిన జ్ఞానప్రభ అనే బౌద్ధ సన్యాసి నైఋతి రత్నపుర జిల్లాలోని గ్రామీణ పట్టణం ఎంబిలిపితియా అర్బన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎంబిలిబితియా అర్బన్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో జ్ఞానప్రభ అత్యధిక ప్రాధాన్యత ఓట్లు సాధించారు. ఓ సన్యాసిని ఈ పదవికి ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎఫ్‌పీ) ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోని శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే నియామకానికి అంగీకారం తెలిపారు. కాగా జేహెచ్‌యూ అధికార పార్టీ యూనైటెడ్ పీపుల్స్ ప్రీడమ్ అలెయన్స్ భాగస్వామి.