వేలానికి మైఖేల్ జాక్సన్ వెంట్రుకలు
పాప్ సంగీత సామ్రాజ్యంలో అగ్రగామిగానున్న పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ జుట్టును ఈ నెల 17న వేలం వేయనున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ జుట్టును వేలానికి పెట్టారు. 1984లో సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలో నటిస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన జుట్టు కాలిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో సేకరించిన 12 వెంట్రుకలను 1600 అమెరికన్ డాలర్ల ధరను నిర్ణయించినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థ తెలిపింది. తాము నిర్వహించే ఈ వేలం శనివారం (17.10.09) నాడు జరుగనుందని, వీటిని లండన్‌లో వేలం వేస్తామని సంస్థ ప్రకటించింది.వీటిని ప్రకటనకు చెందిని కార్యవర్గ నిర్మాత రాల్ఫ్ కోహేన్ సేకరించినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థ తెలిపింది. ఇదిలావుండగా మరో గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ జుట్టును కూడా ఇదే నెలలో వేలం వేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. దీని ధర 14 వేల 400 అమెరికన్ డాలర్లకు నిర్ణయించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.