పాకిస్థాన్ దేశంలోని లాహోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు గురువారం ఉదయం దాడులకు పాల్పడ్డారు. లాహోర్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ భవంతి, ఎలైట్ పోలీస్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడి పలువురు అధికారులను బంధించారు. వీరిలో ఇద్దరు అధికారులు బలైనారు.
ఉగ్రవాదుల ఉగ్రరూపానికి ఇద్దరు అధికారులు బలైనారు. మరో ఆరుగురి మృత దేహాలను స్థానిక గంగారామ్ ఆసుపత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ చర్యకు ప్రతిస్పందించిన పాకిస్థాన్ భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు భద్రతా దళాధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా లాహోర్ సమీపంలోని కోహాట్ పట్టణంలో ఓ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మాహుతి దళానికి చెందిన సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో అక్కడికక్కడే పది మంది మృతి చెందారు. వీరిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.